Tech Titans Fight : ఎనీ ప్లేస్.. ఎనీ టైమ్.. ఎనీ రూల్స్.. మెటా బాస్‌ను రెచ్చగొడుతున్న టెస్లా బాస్..!

Tech Titans Fight : టైం నువ్వు చెప్పినా సరే.. నన్ను చెప్పిమన్నా సరే.. ఎప్పుడైనా, ఎక్కడైనా సరే.. ఏదైనా రూల్స్ పెట్టుకో.. నేను రెడీ అంటూ మెటా బాస్‌‌కు సవాల్ విసురుతున్నాడు టెస్లా బాస్.

Elon Musk Says He's Ready To Fight Mark Zuckerberg ( Image Source : Google )

Mark Zuckerberg And Elon Musk : ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, టెస్లా అధినేత ఎలన్ మస్క్, మెటా చీఫ్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్‌తో కయ్యానికి కాలుదువ్వుతున్నాడు. సోషల్ మీడియా వేదికగా ఇద్దరూ తలపడదామా అంటూ పోరుకు పిలుస్తూ మరింతగా రెచ్చగొడుతున్నాడు మస్క్ మామ. అంతేకాదు.. టైం నువ్వు చెప్పినా సరే.. నన్ను చెప్పిమన్నా సరే.. ఎప్పుడైనా, ఎక్కడైనా సరే.. ఏదైనా రూల్స్ పెట్టుకో.. నేను రెడీ అంటూ సవాల్ విసురుతున్నాడు టెస్లా బాస్.

Read Also : Elon Musk Omelettes : అలా అయితే.. వారం పాటు ఆమ్లెట్ తినడమే మానేస్తా: మస్క్‌ మామ!

“ఏ ప్రదేశంలోనైనా, ఏ సమయంలోనైనా, ఎలాంటి రూల్స్ పెట్టినా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని అంటున్నాడు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రసంగానికి అతిథిగా హాజరయ్యేందుకు వెళ్తుండగా మెటా సీఈఓకు బిలియనీర్ మస్క్ సవాల్ విసిరాడు. దీనిపై థ్రెడ్స్‌ వేదికగా జుకర్‌బర్గ్ స్పందిస్తూ.. “మనం నిజంగా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామా? అంటూ రిప్లయ్ ఇచ్చారు.

మస్క్ మామ పోస్టుకు నెటిజన్ల రియాక్షన్ :
ఈ పోస్ట్‌లకు ఆన్‌లైన్‌లో నెటిజన్ల నుంచి విశేష స్పందన వస్తోంది. వాస్తవానికి మస్క్ ఈ విషయంలో సీరియస్‌గా లేడని, వినోదాత్మకంగా ఉండదని ఒక యూజర్ కామెంట్ చేశాడు. “ఇంకోసారి ఇది కాదు.. వారు తలపడే చివరిసారి కోసం ఎదురుచూస్తున్నాం.. అంటూ మరో యూజర్ తెలిపాడు.

“అయితే సరే.. పోరుకు వెళ్దాం. ఫైట్ ఆఫ్ ది ఇయర్. ఎ ట్రూ హెవీవెయిట్ బాటిల్.. అని మూడో యూజర్ కామెంట్ పెట్టాడు. “టెక్ దిగ్గజాలు తమ పోటీని తదుపరి స్థాయికి తీసుకెళ్తున్నట్లు కనిపిస్తోంది. డిజిటల్ ఆధిపత్యం కోసం జరిగే యుద్ధంలో ఎవరు గెలుస్తారు అనేది ఎవరికి తెలుసు” అని మరో యూజర్ వ్యాఖ్యానించారు.

ముఖ్యంగా, బిలియనీర్లు, టెక్ టైటాన్స్ ఇద్దరూ పోటీ అంటూ తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఒకరికొకరు కేజ్ మ్యాచ్ ఛాలెంజ్‌కి విసురుకోవడంతో సంచలనంగా మారింది. ఈ పోరాటం అసలు జరుగుతుందా లేదా అనేదానిపై ఆన్‌లైన్‌లో ఊహాగానాలకు దారితీసింది.

ఇద్దరి మధ్య నిజంగా వైరం ఉందా? లేదా సరదా కోసం ఇలా చేస్తున్నారా? అనేది క్లారిటీ లేదు. టెక్ దిగ్గజాలు తమ విభేదాలను నిజంగా పరిష్కరించుకుంటారో లేదో కచ్చితంగా తెలియదు. అప్పట్లో ట్విట్టర్‌కు పోటీగా జుకర్‌బర్గ్ థ్రెడ్స్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దాంతో మస్క్ వ్యాపార రహస్యాలు, ఇతర మేధో సంపత్తిని చట్టవిరుద్ధంగా దుర్వినియోగం చేసారంటూ జుకర్‌బర్గ్‌ను ఆరోపించడం అగ్నికి ఆజ్యం పోసింది.

కంపెనీ ఏఐ మోడల్ లామా 3.1 విడుదలైన తర్వాత మస్క్ మెటా బాస్‌ను ప్రశంసించారు. మెటా ప్రకారం.. ఓపెన్ఏఐ, జీపీటీ-4 కన్నా మెరుగ్గా పనిచేస్తుంది. ఇప్పుడు ఓపెన్ సోర్స్, సాధారణ యూజర్లకు ఉచిత వినియోగానికి అందుబాటులో తెచ్చింది.

Read Also : Elon Musk : న్యూరాలింక్ మరో సరికొత్త ప్రయోగం.. పక్షవాతం, జ్ఞాపకశక్తి కోల్పోయే సమస్యలను పరిష్కరించే డివైజ్..!

ట్రెండింగ్ వార్తలు