Elon Musk Omelettes : అలా అయితే.. వారం పాటు ఆమ్లెట్ తినడమే మానేస్తా: మస్క్‌ మామ!

Elon Musk Omelettes : స్పేస్ఎక్స్ ప్రయోగం కారణంగా 9 పక్షి గూళ్లు ధ్వంసం అయ్యాయి అనేది వార్త సారాంశం. అయితే, న్యూయార్క్‌ టైమ్స్ న్యూస్ ఎంపికను నెటిజన్ ఒకరు ప్రశ్నించగా.. మస్క్‌ మామ దానిపై చమత్కరంగా స్పందించారు.

Elon Musk Omelettes : అలా అయితే.. వారం పాటు ఆమ్లెట్ తినడమే మానేస్తా: మస్క్‌ మామ!

Elon Musk to avoid omelettes for a week ( Image Source : Google )

Updated On : July 10, 2024 / 10:32 PM IST

Elon Musk Omelettes : ప్రపంచ బిలియనీర్, స్పేస్ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ వారం రోజులు ఆమ్లెట్ తినడం మానేస్తానని వెల్లడించారు. తన స్పేస్‌ఎక్స్‌ కంపెనీకి సంబంధించి ఒక ప్రముఖ న్యూస్‌పేపర్‌లో వచ్చిన స్టోరీపై స్పందించిన మస్క్ తనదైన శైలీలో వ్యంగ్యాస్త్రాలు విసిరారు. అసలు జరిగింది ఏంటంటే? యూఎస్‌కు చెందిన ప్రముఖ న్యూస్ పేపర్ ది న్యూయార్క్‌ టైమ్స్‌ ఫస్ట్ పేజ్‌లో స్పేస్‌ఎక్స్‌ గురించి ఒక స్టోరీని ఎక్స్ వేదికగా నెటిజన్ ఒకరు షేర్ చేశారు.

Read Also : బీఎండబ్ల్యూ హిట్ అండ్ రన్ కేసు.. ప్రియురాలికి 40 సార్లు ఫోన్ చేసిన నిందితుడు.. బుల్డోజర్‌తో బార్ కూల్చివేత

స్పేస్ఎక్స్ ఫస్ట్ పేజీ లేఔట్ పై చిన్న వివరణ కూడా ఇచ్చారు. ఆ పేజీలో రైట్ సైడ్‌లో లీడ్‌ స్టోరీ ఉంటే.. లెఫ్ట్ సైడ్ సబ్‌ లీడ్‌ ఉంటుంది. పేపర్‌ ఫోల్డింగ్‌ పైనా ఆ రోజు ముఖ్యమైన హెడ్‌లైన్స్ ఉంటాయి. అందులో 2024 ప్రెసిడెంట్ రేసు నుంచి యూఎస్ అధ్యక్షుడు బైడెన్ వైదొలగాలంటూ డెమోక్రాట్‌ నేతల ఒత్తిడి చేస్తారనే వార్త కనిపించింది.

ఫ్రాన్స్‌ ఎన్నికల్లో ఫలితాల గురించి మరో వార్త కూడా ఉంది. అక్కడే స్పేస్‌ఎక్స్ ప్రయోగం స్టోరీ కూడా ఉందని వివరణ ఇచ్చారు. స్పేస్ఎక్స్ ప్రయోగం కారణంగా 9 పక్షి గూళ్లు ధ్వంసం అయ్యాయి అనేది వార్త సారాంశం. అయితే, న్యూయార్క్‌ టైమ్స్ న్యూస్ ఎంపికను నెటిజన్ ఒకరు ప్రశ్నించగా.. మస్క్‌ మామ దానిపై చమత్కరంగా స్పందించారు.

ఈ తప్పును సరిదిద్దుకోవడానికి వారం రోజులు ఆమ్లెట్లు తినకుండా మానేస్తానని మస్క్ చెప్పారు. మస్క్ వ్యంగ్యంగా స్పందించిన దానిపై నెటిజన్లు కూడా ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం ఎక్స్ ప్లాట్‌ఫారంలో గతంలో ట్విటర్‌ లోగోలో పక్షి కూడా ఉండేది.. పక్షులకు ఓనర్ అయిన మస్క్ పక్షులను ఎలా బాధపెడతారులే.. పొద్దున్నే ఆల్పహారంలో ఏం తింటారులే అని ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.

Read Also : ఈ చెట్టు ఎందుకంత డేంజర్? మనిషికి చేసే హాని ఏంటి? పవన్ కల్యాణ్ ఇచ్చిన ఆదేశాలు ఏంటి..