Apple AirPods Pro Launch : ఆపిల్ ‘వండర్‌లస్ట్’ ఈవెంట్.. USB-C ఛార్జింగ్‌తో ఎయిర్ పాడ్స్ ప్రో ఇదిగో.. ఫస్ట్ సేల్ ఎప్పటినుంచంటే?

Apple AirPods Pro Launch : ఆపిల్ అభిమానులకు గుడ్ న్యూస్.. MagSafe ఛార్జింగ్ కేస్ (USB-C)తో కూడిన AirPods ప్రో (2వ జనరేషన్) సెప్టెంబర్ 22 నుంచి రూ. 24,900కి అందుబాటులో ఉంటుంది.

Apple unveils 2nd gen AirPods Pro with USB-C charging

Apple AirPods Pro Launch :  2023 ఆపిల్ ‘వండర్‌లస్ట్’ (apple wanderlust event 2023) ఈవెంట్ సందర్భంగా ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) ఎయిర్‌పాడ్స్ ప్రో (2వ జనరేషన్)ని ఆవిష్కరించింది. ఈ కొత్త ఎయిర్ పాడ్స్ ప్రోను USB-C ఛార్జింగ్ రెట్టింపు సామర్థ్యాలతో కూడిన యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌ను ప్రకటించింది. MagSafe ఛార్జింగ్ కేస్ (USB-C)తో కూడిన AirPods ప్రో (2వ జనరేషన్) సెప్టెంబర్ 22 నుంచి రూ. 24,900కి అందుబాటులో ఉంటుంది. ఈ కొత్త AirPods ప్రో అధునాతన ట్రాన్స్‌పరెన్సీ మోడ్, మరింత లీనమయ్యే ప్రాదేశిక ఆడియో ఎక్స్‌పీరియన్స్, మెరుగైన ఫిట్ కోసం ఇయర్ టిప్ సైజ్‌లను కూడా అందిస్తుంది.

Read Also : iPhone 14 Price Cut : ఐఫోన్ 15 ఇలా వచ్చిందంతే.. భారీగా తగ్గిన ఐఫోన్ 14 సిరీస్ ధరలు.. ఏ మోడల్ ధర ఎంతో తెలుసా?

ఎయిర్ పాడ్స్ ప్రో అదనపు డెస్ట్ రెసిస్టెన్స్, (Apple Vision Pro)తో లాస్‌లెస్ ఆడియోతో అప్‌గ్రేడ్ చేసింది. iOS 17తో, అన్ని ఎయిర్‌పాడ్స్ ప్రో అడాప్టివ్ ఆడియో, కాన్వర్జేషన్ అవేర్‌నెస్ వంటి కొత్త ఆడియో ఎక్స్‌పీరియన్స్ యాక్సెస్‌ అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఇప్పుడు, Mac, iPad, AirPods, iPhone 15 లైనప్‌ను ఛార్జ్ చేసేందుకు ఒకే కేబుల్‌ని సులభంగా ఉపయోగించవచ్చు.

ఆపిల్ ప్రొడక్టులతో ఎయిర్ పాడ్స్ ఛార్జింగ్ :
ఆపిల్ వినియోగదారులు iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro, iPhone 15 Pro Maxతో నేరుగా AirPodలను ఛార్జ్ చేయవచ్చు. USB-C కనెక్టర్‌తో కూడా సపోర్టు అందిస్తాయి. ఇయర్‌బడ్‌లు, కేస్‌లకు మెరుగైన IP54 రేటింగ్ అదనపు డెస్ట్ రెసిస్టెన్స్ కూడా అందిస్తుంది. సరికొత్త AirPods Pro, ఆపిల్ విజన్ ప్రోలో H2 చిప్, అద్భుతమైన వైర్‌లెస్ ఆడియో ప్రోటోకాల్‌తో కలిపి, పవర్‌ఫుల్ 20-బిట్, 48 kHz లాస్‌లెస్ ఆడియోను ఆడియో లేటెన్సీలో భారీ డిస్కౌంట్‌తో అందిస్తుంది.

Apple AirPods Pro Launch : 2nd gen AirPods Pro with USB-C charging

అడాప్టివ్ ఆడియో లిజనింగ్ మోడ్ డైనమిక్‌గా ట్రాన్స్‌పరెన్సీ మోడ్, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌ను అందిస్తుంది. యూజర్లకు సౌండ్ ఆధారంగా సౌండ్ కంట్రోల్ అడ్జెస్ట్ చేస్తుంది. అధునాతన కంప్యూటేషనల్ ఆడియో ద్వారా అన్‌లాక్ చేసిన సౌండ్ ఎక్స్ పీరియన్స్, వినియోగదారులు తమ పరిసరాల గురించి తెలుసుకునేందుకు వీలు కల్పిస్తుంది, అయితే అపసవ్య శబ్దాలు, ఆఫీసులో గ్రూప్ చిట్‌చాట్, ఇంట్లో వాక్యూమ్ లేదా లోకల్ కాఫీ షాప్‌లో నాయిజ్ వంటివి తగ్గుతాయి. సెప్టెంబర్ 22 నుంచి మొదలయ్యే ఆపిల్ ఎయిర్ పాడ్స్ ప్రో సేల్ కోసం రెడీగా ఉండండి.

Read Also : iPhone 15 Plus Series : ఐఫోన్ అంటే ఇట్లుంటది.. USB-C టైప్ ఛార్జింగ్‌తో ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ మోడల్స్.. ఫీచర్లు భలే ఉన్నాయి భయ్యా..!

ట్రెండింగ్ వార్తలు