Apple WWDC 2023 : ఆపిల్ విజన్ ప్రో.. ఇదో కొత్త రకం కంప్యూటర్.. కొత్త కంప్యూటింగ్ శకానికి నాంది అంటున్న సీఈఓ టిమ్ కుక్

Apple WWDC 2023 : ఆపిల్ (WWDC 2023) ఈవెంట్ సందర్భంగా ఆపిల్ విజన్ ప్రో (Apple Vision Pro) అనే రియాలిటీ హెడ్‌సెట్ ప్రవేశపెట్టింది. వర్చువల్, రియల్ స్పేస్‌లను మిళితం చేసే కొత్త రకమైన వర్చువల్ రియాలిటీ హెడ్‌సెట్.. ఈ విజన్ ప్రోని ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ కొత్త కంప్యూటింగ్ యుగానికి నాంది అన్నారు.

Apple WWDC 2023 launches Vision Pro : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) కంపెనీ ఐఫోన్‌ను ప్రారంభించిన కొన్నిఏళ్ల తర్వాత.. టచ్-స్క్రీన్ ఎరాను కిక్‌స్టార్ట్ చేసింది. ఆపిల్ సరికొత్త టెక్నాలజీతో ఇతర కంపెనీలకు భిన్నంగా గ్లోబల్ మార్కెట్ల దూసుకుపోతోంది. ఆపిల్ విజన్‌‌ అనేది క్రిప్టోగా పిలుస్తున్నారు. అయితే, ఇప్పుడు (AI) లేదా AGI (ఆర్టిఫిషియల్ జెనరేటివ్ AI) ఏఐ టెక్నాలజీపైనే అందరి దృష్టిపడింది. ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా (Meta) మార్క్ జుకర్‌బర్గ్‌తో సహా గతంలో కొందరు వర్చువల్ రియాలిటీ లొకేషన్ అన్వేషించారు.

ఇప్పుడు ఆపిల్ కూడా వర్చువల్ రియాలిటీ స్పేస్‌లో చేరింది. ఆపిల్ విజన్ ప్రో అనే కొత్త రకం వర్చువల్ రియాలిటీ హెడ్‌సెట్‌ను ప్రారంభించింది. అంతేకాదు.. విజన్ ప్రో హెడ్‌సెట్ అనేది కొత్త కంప్యూటింగ్ యుగానికి నాందిగా కంపెనీ సీఈఓ టిమ్ కుక్ (Tim Cook) పిలుపునిచ్చారు. గత ప్రొడక్టులైన Mac, iPod, iPhone మాదిరిగానే ప్రపంచాన్ని మారుస్తుందని కుక్ పేర్కొన్నారు. WWDC 2023లో విజన్ ప్రోని ఆవిష్కరించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. విజన్ ప్రో అనేది కొత్త రకం కంప్యూటర్ అన్నారు. వినియోగదారులు రియాలిటీ, వర్చువల్ స్పేస్‌లను ఒకేచోట వీక్షించవచ్చుని తెలిపారు.

మరో మాటలో చెప్పాలంటే.. ఆపిల్ విజన్ ప్రోని సాధారణ వర్చువల్ రియాలిటీ హెడ్‌సెట్‌గా అని పిలవడం లేదు. దానికి బదులుగా, కంపెనీ ప్రాదేశిక కంప్యూటింగ్‌కు నాందిగా పిలుస్తోంది. ఈ కంప్యూటింగ్, ఆపిల్ ప్రకారం, వినియోగదారులు చేతులు, కళ్ళ చుట్టూ క్రియేట్ చేసిన నేచరుల్ ఇంటర్‌ఫేస్‌ను ఉపయోగిస్తుంది. ఐఫోన్, ఐప్యాడ్ మల్టీ-టచ్ ఇంటర్‌ఫేస్‌తో ప్రపంచాన్ని మార్చేస్తుంటే.. మాక్ మౌస్‌ను ఉపయోగించిందని, ఐప్యాడ్ క్లిక్-వీల్ తీసుకొచ్చిందని ఆపిల్ ప్రతినిధి చెప్పారు. ఆపిల్ Vision Pro అనేది చేతులు, కళ్ళచే కంట్రోల్ చేయొచ్చునని అన్నారు.

Read Also : Apple WWDC 2023 Event : హెల్త్ ఫీచర్లపైనే ఆపిల్ ఫోకస్.. ఈ సరికొత్త ఫీచర్లతో మానసిక ఆరోగ్యాన్ని మానిటర్ చేయొచ్చు..!

అన్ని వర్చువల్-రియాలిటీ హెడ్‌సెట్‌ల మాదిరిగానే.. వినియోగదారులు ఈ విజన్ ప్రోను ధరించాలి. గతంలో వినియోగదారులకు ఇబ్బందికరంగా అనిపించేలా ఉన్నప్పటికీ అలాంటి హెడ్‌సెట్‌లు టేకాఫ్ చేయకపోవడానికి ఇది ఒక కారణమని చెప్పవచ్చు. అయితే ఆపిల్ హెడ్‌సెట్ డిజైన్‌, అనేక కీలక ఫీచర్ల ద్వారా సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తోంది. తద్వారా ఆపిల్ యూజర్లు కేవలం వర్చువల్ స్పేస్‌ని చూడటమే కాకుండా తమ వాస్తవ-ప్రపంచ పరిసరాలను పర్యవేక్షించడానికి అనుమతిస్తుంది.

ఆపిల్ విజన్ ప్రో అవకాశాలివే :
విజన్ ప్రో వంటి కొత్త గాడ్జెట్ వినియోగ విధానం, ఫీచర్లు క్రమంగా అభివృద్ధి చెందనున్నాయి. అయితే, తక్షణ ఉపయోగం విషయంలో ఆపిల్ విజన్ ప్రో శక్తివంతమైనది, అలాగే కమ్యూనికేషన్ టూల్‌గా ఉంటుందని కంపెనీ విశ్వసిస్తోంది. వినియోగదారులు ఈ హెడ్‌సెట్ ధరిస్తే.. 3D వర్చువల్ స్పేస్‌లో సినిమాలు చూడగలరు. గేమ్‌లు ఆడగలరు. తమ ఫొటోలు, వీడియోలను స్క్రోల్ చేయగలరు. ఆపిల్ డిస్నీ సీఈఓ బాబ్ ఇగోర్‌ను (WWDC 2023) వేదికగా ప్రపంచానికి పరిచయం చేసింది. డిస్నీ ప్లస్ (Disney Plus) ఇప్పటికే విజన్ ప్రోకి వస్తోందని, ఆయా ప్రోగ్రామ్‌లు వర్చువల్ స్పేస్‌లలో చూసేందుకు యూజర్లకు అందుబాటులో ఉంటాయని ఇగోర్ వెల్లడించారు. మరో మాటలో చెప్పాలంటే.. విజన్ ప్రో యూజర్లు రాబోయే మార్వెల్ మూవీని నేరుగా వర్చువల్ వాతావరణంలో చూసే అవకాశం ఉంది.

Apple WWDC 2023 _ Apple launches Vision Pro, CEO Tim Cook calls it beginning of a new computing era

అదేవిధంగా, కమ్యూనికేషన్ అవసరాలకు (Apple Vision Pro) యూజర్లకు, వర్చువల్ రూమ్‌లలో వీడియో కాల్‌ చేసుకునేందుకు అనుమతిస్తుంది. అదేపనిగా వర్చువల్ హెడ్‌సెట్‌ని ధరించినప్పుడు తమ వాస్తవ-ప్రపంచ పరిసరాలకు దూరమవుతారనేది గమనించాలి. ఆపిల్ విజన్ ప్రోలో ఐ సైట్ అనే ఫీచర్‌ను రూపొందించింది. వినియోగదారులు విజన్ ప్రోని ధరించినప్పుడు కూడా పరిసరాలను చూపించేందుకు విభిన్న కెమెరాలు, సెన్సార్‌లను ఉపయోగిస్తుంది. ఆపిల్ డెమోలో విజన్ ప్రో ధరించిన యూజర్ తక్షణమే ఒక వ్యక్తి తన విజర్‌లో గదిలోకి ప్రవేశించడాన్ని చూడవచ్చు. ఆ తర్వాత గాడ్జెట్‌ను తీయకుండానే వారితో మాట్లాడవచ్చు.

ఆపిల్ విజన్ ప్రో ధర ఎంత? హార్డ్‌వేర్ ఏంటి? :
ఆపిల్ విజన్ ప్రో గాడ్జెట్.. డిజైన్ కర్వ్ గ్లాసుతో తయారైంది. ఈ గాడ్జెట్ లోపల ప్రత్యేకంగా ఆపిల్ క్రియేట్ చేసిన హార్డ్‌వేర్‌ ఉంది. ఇందులో R1 సిలికాన్ చిప్, సౌండ్ క్లారిటీ బాగుండేలా కొత్త సౌండ్ సిస్టమ్, పవర్ సోర్స్‌కి కనెక్ట్ కానప్పుడు డివైజ్ 2-గంటల పాటు పవర్ చేసే బ్యాటరీని కలిగి ఉంది. ఈ డివైజ్ ఆప్టిక్ IDని కూడా ఉపయోగిస్తుంది. యూజర్ల రెటీనాను లాక్ చేసేందుకు అన్‌లాక్ చేసేందుకు విజన్ ప్రోని స్కాన్ చేస్తుంది. అలాగే, ఆపిల్ క్రియేట్ చేసిన కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ హార్డ్‌వేర్ (visionOS) ద్వారా ఆధారితమైనది. విజన్ ప్రో అనేది కంప్యూటింగ్ భవిష్యత్తుగా కంపెనీ విశ్వసిస్తోంది. ఇప్పటివరకు వివిధ కంపెనీలు వర్చువల్ రియాలిటీ హెడ్‌సెట్ ప్లేస్ ఛేదించడానికి ప్రయత్నించాయి. HTC కంపెనీ Vive) గాడ్జెట్‌లతో ఇదే విధానాన్ని ప్రయత్నించింది. మైక్రోసాఫ్ట్ కూడా హాలో (Halo)తో ప్రయత్నిస్తోంది. Meta క్వెస్ట్ సిరీస్ గాడ్జెట్‌లను కలిగి ఉంది. గూగుల్ కూడా గూగుల్ గ్లాస్‌తో ప్రయత్నించింది. కానీ, అందులో ఏ ఒక్కటీ విజయం సాధించలేదు.

అయితే, ఆపిల్ మాత్రం ఆ విధానానికి భిన్నంగా ఉందని చెబుతోంది. విజన్ ప్రోను అభివృద్ధి చేసే ప్రక్రియలో సుమారు 5వేల పేటెంట్లను దాఖలు చేసిందని కంపెనీలు చెబుతున్నాయి. ఇంతకుముందు వచ్చిన వాటికి భిన్నంగా ఉందని అంటోంది. కంపెనీ డెమోలు, క్లెయిమ్‌లు నిజంగా ఏదో ఒక ప్రత్యేకతను సూచిస్తాయి. అయితే, కచ్చితంగా ఏదైనా చెప్పాలంటే.. ముందు వేచి చూడాల్సిందే. విజన్ ప్రో ఇంకా అందుబాటులో లేదు. విజన్ ప్రో వచ్చే ఏడాది ప్రారంభం నుంచి 3499 డాలర్లు ప్రారంభ ధరకు అందుబాటులో ఉంటుందని ఆపిల్ వెల్లడించింది.

Read Also : Apple WWDC 2023 Updates : ఆపిల్ ఐఓఎస్ 17 వెర్షన్ ఇదిగో.. ఈ ఐఫోన్లలో కొత్త ఫీచర్లు తీసుకొచ్చింది.. ఇప్పుడే చెక్ చేసుకోండి!

ట్రెండింగ్ వార్తలు