iPhone 15 Details Leak : వచ్చే వారమే ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్ వచ్చేస్తోంది.. లాంచ్ ఈవెంట్‌కు ముందే ఫీచర్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చుంటే?

iPhone 15 Details Leak : వచ్చే సెప్టెంబర్ 12న అతిపెద్ద ‘వండర్‌లస్ట్’ ఈవెంట్‌కు ఆపిల్ కంపెనీ రెడీ అవుతోంది. ఆపిల్ గ్రాండ్ ఆవిష్కరణకు ముందు రాబోయే iPhone 15 సిరీస్ మోడల్‌లకు సంబంధించిన వివరాలు లీక్ అయ్యాయి.

Fresh iPhone 15 details leak ahead of Apple launch event next week on September 12

iPhone 15 Details Leak : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) సెప్టెంబర్ 12న అతిపెద్ద ‘వండర్‌లస్ట్’ ఈవెంట్‌ నిర్వహించనుంది. ఈ గ్రాండ్ ఈవెంట్ ఆవిష్కరణకు ముందుగానే.. రాబోయే iPhone 15, iPhone 15 Pro మోడళ్లకు సంబంధించిన కొన్ని వివరాలు లీక్ ఉన్నాయి. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. లీకైన స్పెక్స్, డిజైన్, కొత్త మార్పులు, iPhone 15 సిరీస్ ధరలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కొత్త లీక్ ప్రకారం, ఐఫోన్ 15 సాంప్రదాయ తెలుపు, నలుపు రంగులతో పాటు మూడు ఆకర్షణీయమైన పాస్టెల్ రంగులలో రావచ్చు. అందులో పసుపు, పింక్/ఎరుపు, నీలం ఉండవచ్చు.

ఈ ఐఫోన్లు ఇప్పటికీ టోగుల్ బటన్, SIM కార్డ్ ట్రే వంటి ఫీచర్లు, బ్రష్డ్ ఫినిషింగ్‌తో అల్యూమినియం ఛాసిస్‌ను కలిగి ఉంటాయి. కెమెరాల విషయానికి వస్తే.. డ్యూయల్ పంచ్-హోల్ నాచ్‌ను కలిగి ఉంటాయి. ఆపిల్ ఇన్‌సైడర్ ద్వారా లీక్ చేసిన అన్ని iPhone 15 డమ్మీలు దిగువన USB-C పోర్ట్‌ను కలిగి ఉన్నాయి. అంటే.. రాబోయే కొత్త ఐఫోన్లు ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్టును కలిగి ఉంటాయని నివేదికలు సూచిస్తున్నాయి. ప్రామాణిక iPhone 15 మోడల్‌లకు 20W, ప్రో మోడల్‌లకు 35W వరకు ఛార్జింగ్ సపోర్టు ఉండవచ్చు.

Read Also : iPhone 15 Models : ఐఫోన్ లవర్స్‌కు అదిరే న్యూస్.. ఈ తేదీన ఐఫోన్ 15 సిరీస్ లాంచ్.. ఏకంగా 5 మోడల్స్.. ధర ఎంత, ఫీచర్లు ఇవేనా?

* ఐఫోన్ 15 ప్రో మోడల్‌లు ఫింగర్‌ప్రింట్ ఆధారిత బ్రష్డ్ ఎఫెక్ట్‌తో టైటానియం ఛాసిస్‌ను కలిగి ఉండవచ్చు. మెటల్ గ్లాసు కలిసే చోట డివైజ్ అంచులు సున్నితంగా మరింత గుండ్రంగా ఉంటాయి.
* ఐఫోన్ 15 ప్రో మోడళ్లలో పెద్ద డిస్‌ప్లేలను చూడవచ్చు. బెజెల్‌లను ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ మార్పు పెద్ద డిస్‌ప్లేలను ఇష్టపడే వారికి స్క్రీన్-టైమ్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపరుస్తుంది.
* A17 బయోనిక్ చిప్ కొత్త 2023 ప్రో మోడల్‌లలో రిజర్వ్ చేసే అవకాశం ఉంది. A16 తక్కువ ధర కలిగిన iPhone 15, iPhone 15 Plus స్మార్ట్‌ఫోన్‌లలో కనిపిస్తుంది.
* మ్యూట్ స్విచ్ కస్టమైజడ్ యాక్టివిటీతో ‘యాక్షన్ బటన్’ ద్వారా పనిచేస్తుందని నివేదిక చెబుతోంది. ఈ బటన్ ద్వారా వివిధ పనులను త్వరగా పూర్తి చేసేందుకు యూజర్లను అనుమతిస్తుంది.
* ప్రో మోడల్స్‌లోని టెలిఫొటో, అల్ట్రా-వైడ్ కెమెరాలు రెండూ మునుపటి కన్నా ఎక్కువ మెగాపిక్సెల్‌లను కలిగి ఉంటాయట.. తద్వారా ఫొటోగ్రఫీ సామర్థ్యాలలో గణనీయమైన మెరుగుదలను సూచిస్తుంది.
* అంతేకాకుండా, ఆపిల్ ఫైండ్ మై యాప్‌ (Find My App)లో లొకేషన్ ట్రాకింగ్‌ను మెరుగుపరిచే సరికొత్త ‘U2’ అల్ట్రా-వైడ్‌బ్యాండ్ చిప్‌ను ఆవిష్కరించనుంది.
* ఆపిల్ మొత్తం ఐఫోన్ల లైనప్‌లో వేగవంతమైన వైర్‌లెస్ ఛార్జింగ్ స్పీడ్‌ను అందించనుంది. అంతేకాదు.. మరింత రిపేర్ చేయగల డిజైన్‌ను అందించనుంది.
* ఐఫోన్ 15, 15 ప్లస్ ఫోన్లలో డైనమిక్ ఐలాండ్, A16 బయోనిక్ చిప్, 48MP ప్రధాన కెమెరా వంటి ఫీచర్లను లీక్ డేటా సూచిస్తోంది. ఊహించినట్లుగా iPhone 15 Pro Max ‘అల్ట్రా’ మోడల్‌గా బ్రాండ్ చేయకపోవచ్చు.
* గత ఏడాది మోడల్ ధరతో ఐఫోన్ 15 సమానంగా ఉంటుందని అంచనా.

Fresh iPhone 15 details leak ahead of Apple launch event next week on September 12

లీక్‌ల ప్రకారం.. ఐఫోన్ 15 సిరీస్ ధర రూ. 79,900 నుంచి ప్రారంభం కావచ్చు. ఐఫోన్ 15 ప్రో కూడా పాత ఐఫోన్ ధరను అలాగే ఉంచుతుందని ట్రెండ్‌ఫోర్స్‌లోని విశ్లేషకులు భావిస్తున్నారు. ఐఫోన్ 14 ప్రో మాదిరిగానే అమెరికాలో 999 డాలర్ల ధర ఉంటుందని అంటున్నారు. అంటే.. భారత మార్కెట్లో ఐఫోన్ 15 ప్రో కూడా పాత మోడల్ మాదిరిగానే రూ. 1,29,900 ధర ఉండవచ్చు. హై-ఎండ్ ఐఫోన్ 15 ప్రో మాక్స్ 100 డాలర్ల ధర పెంపును సూచిస్తుంది. దీని ధర 1,199 డాలర్ల నుంచి ప్రారంభమవుతుంది.

ఆపిల్ ఇండియాలో ఒక్కో డాలర్‌ను రూ. 100గా నిర్ణయించడంతో.. ఐఫోన్ 15 ప్రో మాక్స్ ధర రూ.99,506గా ఉండవచ్చు. కానీ, వాస్తవానికి, భారతీయ మార్కెట్‌లో వాస్తవ ధర ఒకేలా ఉండదని గమనించాలి. అమెరికా, భారత్ మధ్య ఎల్లప్పుడూ పెద్ద ధర మార్జిన్ కారణంగా దేశంలో చాలా ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. ఆపిల్ ‘వండర్‌లస్ట్’ ఈవెంట్ సమీపిస్తున్న కొద్దీ ఈ కొత్త పరిణామాలతో టెక్ ఔత్సాహికులలో మరింత ఆసక్తి నెలకొంది. ఐఫోన్ 15 సిరీస్‌కు సంబంధించి మరిన్ని వివరాలను తెలుసుకోవాలంటే వచ్చే వారం వరకు వేచి ఉండాల్సిందే..

Read Also : Apple iPhone 13 Sale : ఆపిల్ ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్.. కేవలం రూ.6,999కే సొంతం చేసుకోండి.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు!

ట్రెండింగ్ వార్తలు