KL Rahul – Sanjiv Goenka : ఐపీఎల్ 2025లో లక్నో సూపర్ జెయింట్స్‌కు కొత్త కెప్టెన్ రానున్నాడని, ప్రస్తుత కెప్టెన్ కేఎల్ రాహుల్ పై వేటు తప్పదని టీమ్ఇండియా వెటరన్ ఆటగాడు అమిత్ మిశ్రా అన్నాడు. రాహుల్ నాయకత్వంపై లక్నో ఫ్రాంచైజీ అసంతృప్తితో ఉందని చెప్పాడు. ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తరుపున మిశ్రా ఆడుతున్నాడు. అయితే.. ఐపీఎల్ 2024లో మిశ్రాకు ఎక్కువ అవకాశాలు రాలేదు. కేవలం ఒకటి లేదా రెండు మ్యాచుల్లోనే ఆడాడు.
ఐపీఎల్ 2024 సీజన్‌లో ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో లక్నో సూపర్ జెయింట్స్ 10 వికెట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయింది. దీంతో మ్యాచ్ అనంతరం మైదానంలోనే కెప్టెన్ కేఎల్ రాహుల్ పై లక్నో యజమాని సంజీవ్ గోయెంకా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారగా సంజీవ్ గోయెంకా పై నెటిజన్లతో పాటు పలువురు ఆటగాళ్లు మండిపడ్డారు. మైదానంలో అభిమానులు, కెమెరాల ముందు ఇలా చేయడం సరికాదన్నాడు.
సంజీవ్ గోయెంకా చేసిన పని కరెక్టేనని మిశ్రా అభిప్రాయపడ్డాడు. సీజన్‌లో వరుసగా మేము రెండు మ్యాచుల్లో ఘోరంగా ఓడిపోయాం. కేకేఆర్‌తో మ్యాచ్‌లో 90 పరుగులు, సన్‌రైజర్స్ చేతిలో 10 ఓవర్ల లోపే 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడాము. మా జట్టు బౌలింగ్ చేస్తూ నాకే చాలా కోపం వచ్చింది. ఇక డబ్బులు పెట్టిన వ్యక్తికి కోపం రాకుండా ఉంటుందా.? అని మిశ్రా అన్నాడు.
ఇది పెద్ద విషయం కాదు. బౌలింగ్ పేలవంగా ఉందని, జట్టు మరింత పోరాడాల్సిందని రాహుల్‌తో గోయెంకా అన్నాడని నాకు తర్వాత తెలిసిందని చెప్పాడు. ఇక లక్నో ప్లే ఆఫ్స్ చేరడంలో విఫలం కావడంతో గోయెంకా తీవ్ర నిరాశచెందినట్లుగా తెలిపాడు. ఈ క్రమంలో రానున్న సీజన్‌లో రాహుల్ కంటే మెరుగైన కెప్టెన్‌ను ఎంపిక చేయాలని ఫ్రాంచైజీ భావిస్తున్నట్లు మిశ్రా అభిప్రాయపడ్డాడు.
Mohammed Shami : టీమ్ఇండియా అభిమానులకు శుభవార్త.. వికెట్ల వీరుడు మొదలెట్టాడు..
ఇదిలా ఉంటే.. కేఎల్ రాహుల్ 2022 నుంచి లక్నో సూపర్ జెయింట్స్‌ను నడిపిస్తున్నాడు. 2022, 2023 సీజన్లలో రాహుల్ నాయకత్వంలో లక్నో ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది.