Mohammed Shami : టీమ్ఇండియా అభిమానుల‌కు శుభ‌వార్త‌.. వికెట్ల వీరుడు మొద‌లెట్టాడు..

టీమ్ఇండియా వెట‌ర‌న్ పేస‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీ త్వ‌ర‌లోనే రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు.

Mohammed Shami : టీమ్ఇండియా అభిమానుల‌కు శుభ‌వార్త‌.. వికెట్ల వీరుడు మొద‌లెట్టాడు..

Mohammed Shami starts bowling in the nets after injury

Updated On : July 17, 2024 / 3:58 PM IST

Mohammed Shami – Team India : టీమ్ఇండియా వెట‌ర‌న్ పేస‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీ త్వ‌ర‌లోనే రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. స్వదేశంలో జ‌రిగిన వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023 అనంత‌రం ష‌మీ ఆట‌కు దూరంగా ఉన్నాడు. చీల‌మండ‌ల గాయానికి శ‌స్త్ర చికిత్స చేయించుకున్నాడు. బెంగ‌ళూరులోని నేష‌న‌ల్ క్రికెట్ అకాడ‌మీలో ష‌మీ కోలుకుంటున్నాడు. ఈ క్ర‌మంలోనే త‌న ఫిట్‌నెస్ పై దృష్టి పెట్టాడు. నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్‌ను మొద‌లుపెట్టాడు.

అయితే.. పూర్తి స్థాయి తీవ్ర‌త‌తో బౌలింగ్ చేసేందుకు మ‌రికొన్ని రోజులు ప‌ట్ట‌నుంది. కాగా.. తాను బౌలింగ్ చేస్తున్న వీడియోను ష‌మీ ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానుల‌తో పంచుకున్నాడు. ష‌మీ పూర్తిగా కోలుకుంటే సెప్టెంబ‌రులో బంగ్లాదేశ్‌తో జ‌ర‌గ‌నున్న రెండు టెస్టు మ్యాచుల సిరీస్‌తో రీ ఎంట్రీ ఇచ్చే అవ‌కాశం ఉంది. ఈ సిరీస్ త‌రువాత న్యూజిలాండ్‌తో భార‌త్ మూడు టెస్టులు ఆడ‌నుంది. ఆ త‌రువాత బోర్డ‌ర్-గ‌వాస్క‌ర్ ట్రోఫీ కోసం న‌వంబ‌ర్‌లో ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లనుంది భార‌త్. ఆసీస్‌తో ఐదు టెస్టులు ఆడ‌నుంది.

Gautam Gambhir : అయ్యో పాపం గంభీర్ ప‌రిస్థితి ఇలా అయ్యిందేంటి..? వ‌రుస షాకులు ఇస్తున్న బీసీసీఐ..?

స్వ‌దేశంలో జ‌రిగిన వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023లో మ‌హ్మ‌ద్ ష‌మీ అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్‌గా నిలిచాడు. కాగా.. ప్ర‌పంచక‌ప్ ఆడుతున్న స‌మ‌యంలోనే ష‌మీ చీల‌మండ‌లానికి గాయ‌మైంది. ఓ వైపు గాయం వేధిస్తున్న‌ప్ప‌టికీ కూడా టీమ్ఇండియాను గెలిపించేందుకు ష‌మీ కొన్ని మ్యాచుల్లో ఆడాడు. ఆస్ట్రేలియాతో ఫైన‌ల్ ముగిసిన త‌రువాత లండ‌న్‌కు వెళ్లి శ‌స్త్ర‌చికిత్స చేయించుకున్నాడు. దీంతో ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌, ఐపీఎల్ 2024, టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024టోర్నీల‌కు దూరం అయ్యాడు.

 

View this post on Instagram

 

A post shared by ???????? ????? (@mdshami.11)