T20I rankings : టీ20 ర్యాంకింగ్స్‌లో శుభ్‌మ‌న్ గిల్‌, వాషింగ్ట‌న్ సుంద‌ర్ దూకుడు.. ఏకంగా 36 స్థానాలు ఎగ‌బాకి..

ఇటీవ‌ల జింబాబ్వే ప‌ర్య‌ట‌న‌లో అద‌ర‌గొట్టిన భార‌త యువ ఆట‌గాళ్లు ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లోనూ దుమ్ములేపారు.

T20I rankings : టీ20 ర్యాంకింగ్స్‌లో శుభ్‌మ‌న్ గిల్‌, వాషింగ్ట‌న్ సుంద‌ర్ దూకుడు.. ఏకంగా 36 స్థానాలు ఎగ‌బాకి..

Shubman Gill and Washington Sundar significant rise in ICC T20I rankings

ICC T20I rankings : ఇటీవ‌ల జింబాబ్వే ప‌ర్య‌ట‌న‌లో అద‌ర‌గొట్టిన భార‌త యువ ఆట‌గాళ్లు ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లోనూ దుమ్ములేపారు. జింబాబ్వే సిరీస్‌కు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించిన శుభ్‌మ‌న్ గిల్‌తో పాటు యువ ఓపెన‌ర్ య‌శ‌స్వి జైస్వాల్‌లు త‌మ స్థానాల‌ను మెరుగుప‌ర‌చుకున్నారు. ఆఖ‌రి మూడు టీ20 మ్యాచులే ఆడిన య‌శ‌స్వి 165.88 స్ట్రైక్‌రేటుతో 141 ప‌రుగులు చేశాడు. దీంతో నాలుగు స్థానాలు మెరుగుప‌ర‌చుకుని ఆరో ర్యాంకుకు చేరుకున్నాడు.

125 స్ట్రైక్‌రేటుతో 170 ప‌రుగులు చేసిన గిల్ ఏకంగా 36 స్థానాలు ఎగ‌బాకి 37వ స్థానానికి చేరుకున్నాడు. ఈ క్ర‌మంలో పొట్టి ఫార్మాట్‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించిన రోహిత్ శర్మ (42 ర్యాంక్), విరాట్ కోహ్లి (51) ల‌ను గిల్ అధిగమించాడు. రుతురాజ్ గైక్వాడ్ ఓ స్థానాన్ని కోల్పోయి ఎనిమిదో స్థానానికి ప‌డిపోయాడు.

Rohit Sharma : మ‌న‌సు మార్చుకున్న రోహిత్ శ‌ర్మ‌..! కోహ్లీ మాత్రం..

ఆస్ట్రేలియా విధ్వంస‌క‌ర వీరుడు ట్రావిస్ హెడ్ 844 రేటింగ్ పాయింట్ల‌తో అగ్ర‌స్థానంలో కొన‌సాగుతున్నాడు. భార‌త స్టార్ ఆట‌గాడు సూర్య‌కుమార్ యాద‌వ్ ఇంగ్లాండ్ ప్లేయ‌ర్ ఫిల్ సాల్ట్‌తో క‌లిసి రెండో స్థానంలో ఉన్నాడు. వీరిద్ద‌రి ఖాతాలో 797 పాయింట్లు ఉన్నాయి.

బౌలింగ్ ర్యాంకింగ్స్‌..

జింబాబ్వే ప‌ర్య‌ట‌న‌లో 6 వికెట్ల‌తో రాణించిన వాషింగ్ట‌న్ సుంద‌ర్ 36 స్థానాలు ఎగబాకి 46 స్థానానికి చేరుకున్నాడు. పేస‌ర్ ముకేశ్ కుమార్ 21 స్థానాలు మెరుగుప‌ర‌చుకుని 73వ ర్యాంకులో కొన‌సాగుతున్నాడు. అక్ష‌ర్ ప‌టేల్ నాలుగు స్థానాలు కోల్పోయి 13 ర్యాంక్‌కు ప‌డిపోయాడు. కాగా.. ఇంగ్లాండ్ స్టార్ స్పిన్న‌ర్ ఆదిల్ ర‌షీద్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్ర‌స్థానంలో ఉన్నాడు. ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్ విష‌యానికి వ‌స్తే.. హార్దిక్ పాండ్య ఆరో ర్యాంక్‌కు పడిపోయాడు. శ్రీలంక ఆట‌గాడు వ‌నిందు హ‌స‌రంగ అగ్ర‌స్థానంలో ఉన్నాడు.

Gautam Gambhir : అయ్యో పాపం గంభీర్ ప‌రిస్థితి ఇలా అయ్యిందేంటి..? వ‌రుస షాకులు ఇస్తున్న బీసీసీఐ..?