Rajasthan Royals Sale : రండి బాబూ రండి.. IPL కి ముందు అమ్మకానికి మరో టీమ్.. జస్ట్ ఎన్ని కోట్లంటే..
Rajasthan Royals Sale : ఐపీఎల్ ప్రారంభానికి ముందు కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. ఆర్సీబీ బాటలోనే మరో టీం అమ్మకానికి రెడీ అవుతోన్నట్లు సమాచారం.
Reports said after RCB Rajasthan royals Headed For Sale
Rajasthan Royals Sale : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు అమ్మకం తుది దశకు చేరుకుందన్న వార్తల నేపథ్యంలో మరో ప్రముఖ ఐపీఎల్ ఛాంపియన్ జట్టు రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) కూడా విక్రయానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. తాజాగా వచ్చిన నివేదికల ప్రకారం రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం తమ వాటాల్లో కొంత భాగాన్ని విక్రయించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల కాలంలో ఐపీఎల్ ఫ్రాంచైజీల విలువలు భారీగా పెరిగాయి. ఈ కారణంగా పెద్ద వ్యాపార సంస్థలు, పెట్టుబడిదారులు ఐపీఎల్ జట్ల కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే కొన్ని ప్రముఖ కార్పొరేట్ సంస్థలు రాజస్థాన్ రాయల్స్ కొనుగోలుకు బిడ్లు వేయడానికి సిద్ధమవుతున్నట్లు క్రీడా వర్గాలు చెబుతున్నాయి. ఆ టీమ్ మెజారిటీ వాటాదారుడైన మనోజ్ బదలే తన వాటాను పూర్తిగా విక్రయించాలని చూస్తున్నారు. రాజస్థాన్ రాయల్స్ విలువ దాదాపు 1.1 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 9,100 కోట్లు) ఉండగా.. బిడ్డింగ్‌లో రూ. 10,168 కోట్ల నుంచి రూ. 12,479 కోట్లు పలుకుతుందని అంచనా వేస్తున్నారు. ఈ టీమ్ కోసం దిగ్గజ కార్పొరేట్ సంస్థలు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.
ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెట్ లీగ్‌గా ఐపీఎల్ నిలవడంతో ఫ్రాంచైజీలకు భారీ డిమాండ్ ఏర్పడింది. మరో రెండు వారాల్లో ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో త్వరలోనే రాజస్థాన్ రాయల్స్ విక్రయంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
మార్చి 28 నుండి ఐపీఎల్ ప్రారంభం
ఈ ఏడాది ఐపీఎల్ మార్చి 28న ప్రారంభమై, మే 31 వరకు కొనసాగుతుంది. ఎప్పటిలానే ఈ ఏడాది మొత్తం 10 జట్లు పోటీపడనున్నాయి. లీగ్ దశలో ప్రతి జట్టు 14 మ్యాచ్‌లు ఆడుతుంది. మొత్తం సుమారు 80కు పైగా మ్యాచ్‌లు జరగనున్నాయి. ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు మే చివరి వారంలో ప్రారంభమై, మే 31న ఫైనల్‌తో టోర్నీ ముగుస్తుంది.
