Rohit Sharma : మనసు మార్చుకున్న రోహిత్ శర్మ..! కోహ్లీ మాత్రం..
వచ్చే ఏడాది జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ముందు భారత జట్టు కేవలం రెండు వన్డే సిరీస్‌లు మాత్రమే ఆడనుంది.
- Thota Vamshi Kumar
- Published On : July 17, 2024 / 05:02 PM IST
Rohit Sharma Could Take Selfless Decision For SL ODIs
Rohit Sharma – IND vs SL : టీమ్ఇండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ శ్రీలంకతో సిరీస్ నుంచే బాధ్యతలు చేపట్టనున్నాడు. అదే సమయంలో సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్‌ప్రీత్ బుమ్రాలు విశ్రాంతి కోరుతున్నారని, అందుకనే లంక పర్యటనకు అందుబాటులో ఉండడం లేదనే వార్తలు వచ్చాయి. అయితే.. వచ్చే ఏడాది జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ముందు భారత జట్టు కేవలం రెండు వన్డే సిరీస్‌లు మాత్రమే ఆడనుంది. ఇంకా సరిగ్గా చెప్పాలంటే కేవలం ఆరు వన్డేలు ఆడనుంది.
ఈ నేపథ్యంలో ఈ ముగ్గురు ఖచ్చితంగా లంకతో సిరీస్‌లో అందుబాటులో ఉండాలని గంభీర్ కోరినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నాడట. తన మనసును మార్చుకున్నాడట. లంకతో సిరీస్‌కు అందుబాటులో ఉంటానని చెప్పినట్లుగా క్రిక్‌బజ్ తెలిపింది. అయితే.. లండన్‌లో ఉన్న విరాట్ కోహ్లీతో పాటు జస్‌ప్రీత్ బుమ్రాలు మాత్రం లంకతో వన్డే సిరీస్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది.
Mohammed Shami : టీమ్ఇండియా అభిమానులకు శుభవార్త.. వికెట్ల వీరుడు మొదలెట్టాడు..
ఒకవేళ లంకతో వన్డే సిరీస్‌కు రోహిత్ గనుక అందుబాటులోకి వస్తే.. అతడే టీమ్ఇండియా కెప్టెన్‌గా ఉండనున్నాడు. ఒకవేళ అతడు ఈ సిరీస్‌లో ఆడకుంటే మాత్రం కేఎల్ రాహుల్ నాయకత్వ బాధ్యతలను చేపట్టే అవకాశం ఉంది. లంక పర్యటనలో భారత జట్టు మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది.
టీ20 సిరీస్ జూలై 27 నుంచి ఆరంభం కానుండగా వన్డే సిరీస్ మాత్రం ఆగస్టు 2 నుంచి మొదలు కానుంది. టీ20 ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ఛాంపియన్‌గా నిలిచిన తరువాత పొట్టి ఫార్మాట్‌కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాలు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే.
Gautam Gambhir : అయ్యో పాపం గంభీర్ పరిస్థితి ఇలా అయ్యిందేంటి..? వరుస షాకులు ఇస్తున్న బీసీసీఐ..?
