Google Employees : ఎంత కష్టమొచ్చింది.. గూగుల్ ఉద్యోగులకు కూర్చొనేందుకు చోటే లేదట.. తోటివారితో డెస్క్‌లు షేరింగ్.. ఎందుకో తెలిస్తే షాకవుతారు!

Google Employees : ప్రపంచ సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ లో పనిచేసే ఉద్యోగులకు పుట్టెడు కష్టమొచ్చింది. గూగుల్ ఆఫీసుల్లో కొంతమంది ఉద్యోగులకు కనీసం కూర్చొనేందుకు చోటు కూడా లేదట..

Google Employees : ప్రపంచ సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ (Google)లో పనిచేసే ఉద్యోగులకు పుట్టెడు కష్టమొచ్చింది. గూగుల్ ఆఫీసుల్లో కొంతమంది ఉద్యోగులకు కనీసం కూర్చొనేందుకు చోటు కూడా లేదట.. ఎక్కడ కూర్చొని పనిచేయాలో తెలియక తోటి ఉద్యోగులతో కలిసి కూర్చొంటున్నారట.. దీనికి సంబంధించి గూగుల్ తమ ఉద్యోగులకు మెయిల్ కూడా పంపిందట.. గూగుల్ ఉద్యోగులందరికి (Google Cloud Employees) కాదండోయ్.. ఎంపిక చేసిన సెక్షన్లకు చెందిన Google ఉద్యోగులకు మాత్రమే ఈ పరిస్థితి ఉందట..

వచ్చే త్రైమాసికం నుంచి తమ తోటి ఉద్యోగులతో డెస్క్‌లను పంచుకోవాలని కంపెనీ ఇంటర్నల్ మెమో జారీ చేసింది. ఎంపిక చేసిన ప్రదేశాలలో గూగుల్ కార్యాలయ స్థలాలను మూసివేయాలని కంపెనీ యోచిస్తున్నట్లు సమాచారం. కొత్త CNBC నివేదిక ప్రకారం.. గూగుల్ తన క్లౌడ్ ఉద్యోగులను డెస్క్ స్పేస్‌లను షేర్ చేయమని కోరింది. సెర్చ్ జెయింట్ కిర్క్‌ల్యాండ్, వాషింగ్టన్, న్యూయార్క్ నగరంలోని యూఎస్ ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగులను కంపెనీ కోరింది. శాన్ ఫ్రాన్సిస్కో, సీటెల్, సన్నీవేల్, కాలిఫోర్నియాలో కంపెనీ ఈ చర్యలను తీసుకుంటోంది. తద్వారా క్లౌడ్ ఉద్యోగుల (Cloud Employees)తో ఇటీవల షేరింగ్ యాక్సెస్ అందించినట్టు నివేదిక పేర్కొంది. ఇంటర్నల్ FAQ ప్రకారం.. ‘క్లౌడ్ డెవలప్‌మెంట్‌లో పెట్టుబడి పెట్టడాన్ని కొనసాగిస్తూనే.. కొన్ని భవనాలను ఖాళీ చేయనున్నట్లు నివేదిక తెలిపింది.

Read Also : Apple Watch Blood Glucose Feature : రాబోయే రోజుల్లో ఆపిల్ వాచ్‌తోనే షుగర్ లెవల్స్ చెక్ చేసుకోవచ్చు..? బ్లడ్ శాంపిల్ అక్కర్లేదు..!

చాలా మంది గూగ్లర్లు ఇప్పుడు డెస్క్‌ను మరొక గూగ్లర్‌తో షేర్ చేసుకోవాలని ఇంటర్నల్ మెమో తెలిపింది. మ్యాచింగ్ ప్రక్రియ ద్వారా ప్రాథమిక డెస్క్ సెటప్‌ను అంగీకరిస్తారు. కొత్త భాగస్వామ్య వాతావరణంలో సానుకూల అనుభవాన్ని పొందడానికి వారి డెస్క్ భాగస్వామి, బృందాలతో నిబంధనలను ఏర్పాటు చేస్తారు. గూగుల్ ఉద్యోగులు ఒకే రోజు ఒకే డెస్క్‌లో జాయిన్ కాకుండా ప్రత్యామ్నాయ రోజులలో రావాలని కూడా నోట్ కోరింది. నివేదిక ప్రకారం.. Google వ్యక్తిగతంగా రిమోట్ పనికి సంబంధించి కొత్త పని విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ కొత్త పని విధానాన్ని ‘క్లౌడ్ ఆఫీస్ ఎవల్యూషన్’ (Cloud Office Evolution) లేదా ‘(CLOE)’ అని పిలుస్తారు. కొత్త డెస్క్ షేరింగ్ మోడల్ తమ స్థలాన్ని మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి వీలవుతందని కంపెనీ భావిస్తోంది.

Google Employees : Some employees have no place to sit

ఈ కొత్త పని విధానం ద్వారా ఉద్యోగుల మధ్య మెరుగైన సహకారానికి దారి తీస్తుందని గూగుల్ భావిస్తోంది. తమ ఉద్యోగులకు ఏది బాగా సరిపోతుందో దానిపై ఆధారపడి ఆఫీసుల్లో లేదా ఇంటి నుంచి పని చేసే అవకాశం ఉంటుందని గూగుల్ విశ్వసిస్తోంది. ఈ కొత్త పని విధానం ( New Rotational Model) ఆఫీస్ స్పేస్‌ను మరింత సమర్ధవంతంగా ఉపయోగించుకోవడంలో సాయపడుతుందని భావిస్తోంది. నివేదికలపై స్పందించిన Google ప్రతినిధి మాట్లాడుతూ, ‘ఆఫీస్‌కు తిరిగి వచ్చినప్పటి నుంచి పైలట్‌లను రన్ చేస్తున్నాం.

విభిన్న హైబ్రిడ్ వర్క్ మోడల్‌లను పొందడానికి ఉద్యోగులకు బెస్ట్ ఎక్స్ వర్క్ పీరియన్స్ అందించనున్నాం. దీనికి సంబంధించి క్లౌడ్ ఉద్యోగులతో సర్వేలు కూడా నిర్వహించాము. డేటా క్లౌడ్ గూగుల్ ఉద్యోగులు తమ కార్యాలయంలో ఉన్నప్పుడు వ్యక్తిగత సహకారంతో పాటు ప్రతివారం కొన్ని రోజులు ఇంటి నుంచి పని చేసే ఆప్షన్ కూడా అందిస్తున్నాం’ అని తెలిపారు. ఉద్యోగుల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌తో ఈ కొత్త మోడల్‌ను అభివృద్ధి చేశామని, రిమోట్ వర్క్ నుంచి అందరూ మెచ్చుకోగలిగే సౌలభ్యంతో పాటు ఫోకస్‌తో ముందుకు కొనసాగనున్నట్టు కంపెనీ ప్రతినిధి అభిప్రాయపడ్డారు.

Read Also : OnePlus Nord 3 Launch : అత్యంత సరసమైన ధరకే వన్‌ప్లస్ నార్డ్ 3 సిరీస్ వచ్చేస్తోంది.. కెమెరా ఫీచర్లు హైలెట్.. ధర ఎంత ఉండొచ్చుంటే?

ట్రెండింగ్ వార్తలు