Infinix GT 10 Pro Launch : రంగులు మారే బ్యాక్ ప్యానెల్‌తో కొత్త ఇన్ఫినిక్స్ ఫోన్ వస్తోంది.. 108MP కెమెరా, మరెన్నో ఆకర్షణీయమైన ఫీచర్లు..!

Infinix GT 10 Pro Launch : ఇన్పినిక్స్ నుంచి సరికొత్త GT 10 Pro ఫోన్ త్వరలో లాంచ్ అవుతోంది. ఈ ఫోన్ ఫీచర్లలో రంగులు మారే బ్యాక్ ప్యానెల్ స్పెషల్ LED లైట్లతో రానుంది.

Infinix GT 10 Pro Launch : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? భారత మార్కెట్ సహా అనేక దేశాల మార్కెట్లలో Infinix GT 10 Pro మోడల్ లాంచ్ కానుంది. లాంచ్ డేట్ ఎప్పుడు అనేది అధికారికంగా ఇంకా వెల్లడించలేదు. కానీ, కొత్త ఫోన్ ఫీచర్లకు సంబంధించి అనేక లీక్‌లు ఆన్‌లైన్‌లో కనిపించాయి. ఇన్పినిక్స్ ఫోన్ స్పెసిఫికేషన్లలో డివైజ్ 7,000mAh బ్యాటరీ, 256GB స్టోరేజీతో వస్తుంది. అదనంగా, ఈ ఫోన్‌లో ప్రత్యేక హైలైట్ రంగులు మారే బ్యాక్ ప్యానెల్ అందిస్తుంది. అంటే.. వెనుక భాగంలో LED లైట్లు ఉంటాయి. నోటిఫికేషన్‌లు, ఛార్జింగ్ స్టేటస్, గేమ్‌లు ఆడినప్పుడు LED లైట్లు వెలుగుతుంటాయి. ఈ ఫీచర్ ఫంక్షనల్ బెనిఫిట్స్ కూడా అందిస్తుంది.

ఈ కలర్ కాన్సెప్ట్ నథింగ్ ఫోన్ల నుంచి తీసుకుంది. కానీ, ఫోన్ డిజైన్ భిన్నంగా ఉంటుంది. ఇన్ఫినిక్స్ GT 10 Pro ప్రత్యేకమైన డిజైన్‌కు కంపెనీ పేరు పెట్టింది. అదే.. సైబర్ మెకా. సైబర్ బ్లాక్ వేరియంట్ బ్రైట్ ఆరెంజ్ హైలైట్‌లతో వస్తుంది. అయితే, మిరాజ్ సిల్వర్ వేరియంట్ యూవీ లైట్‌ పడినప్పుడు స్టీల్ బ్లూ నుంచి డస్టీ పింక్‌కి రిప్లక్ట్ అయ్యేలాబ్యాక్ ప్యానెల్‌ రంగులను ప్రదర్శిస్తుంది.

Read Also : Nothing Phone (2) Discount : నథింగ్ ఫోన్ (2)పై ఓపెన్ సేల్.. అదిరే డిస్కౌంట్.. కొనే ముందు ఈ ఫీచర్లు ఉన్నాయో లేదో చెక్ చేయండి..!

ఇన్ఫినిక్స్ నివేదిక ప్రకారం.. GT 10 ప్రో మోడల్ ఆగస్ట్‌లో ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేయాలనే యోచనలో ఉంది. అయితే, లీక్‌ల ప్రకారం.. వచ్చే రెండు నెలల్లోనే భారత్ లాంచ్ కానుంది. భారతీయ యూజర్లు కొంచెం ఓపిక పట్టవలసి ఉంటుంది. దురదృష్టవశాత్తూ.. ఇన్ఫినిక్స్ GT 10 Pro+ భారతీయ మార్కెట్లో అందుబాటులో ఉండకపోవచ్చు. ఇన్ఫినిక్స్ GT 10 Pro మోడల్ 256GB స్టోరేజీ, 16GB RAMతో సున్నితమైన మరింత సమర్థవంతమైన పర్ఫార్మెన్స్ కలిగి ఉంటుంది.

Infinix GT 10 Pro to launch with color changing back panel, 108-megapixel camera, and more

లీక్‌ల ప్రకారం.. ఈ డివైజ్ శక్తివంతమైన MediaTek డైమెన్సిటీ 8050 చిప్‌సెట్ కావచ్చు. అయితే, ఇన్ఫినిక్స్ GT 10 ప్రో ముఖ్య సేల్ సెంటర్లలో 7,000mAh బ్యాటరీ కావచ్చునని లీక్‌ల ద్వారా వెల్లడైంది. ఈ బ్యాటరీ 160W లేదా 260W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్టు ఇవ్వవచ్చు. ఇన్ఫినిక్స్ మార్చిలో ఈ అత్యాధునిక ఛార్జింగ్ టెక్నాలజీని ప్రకటించింది. లైటనింగ్-వేగవంతమైన ఛార్జింగ్ సమయాలను అందజేస్తుంది.

అంతేకాకుండా, స్మార్ట్‌ఫోన్ 120Hz AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఫోటోగ్రఫీ ముందు డివైజ్ 108MP ప్రైమరీ సెన్సార్, రెండు 8MP కెమెరా సెన్సార్‌లతో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉండవచ్చు. ప్రస్తుతానికి, రాబోయే Infinix GT 10 ప్రో లాంచ్ ఈవెంట్‌పై అధికారిక ధృవీకరణ లేదు. అయితే, రాబోయే రోజుల్లో లేదా వారాల్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. కంపెనీ, లేటెస్ట్ 5G ఫోన్ ఏ ధరల విభాగాన్ని లక్ష్యంగా చేసుకుంటుందో లీక్‌లు ఇప్పటివరకు రివీల్ చేయలేదు.

Read Also : Netflix New Subscribers : నెట్‌ఫ్లిక్స్ వ్యూహం ఫలించింది.. పాస్‌వర్డ్ షేరింగ్ ఆపేసింది.. కొత్తగా 6 మిలియన్ల సబ్‌స్ర్కైబర్లు..!

ట్రెండింగ్ వార్తలు