Netflix New Subscribers : నెట్‌ఫ్లిక్స్ వ్యూహం ఫలించింది.. పాస్‌వర్డ్ షేరింగ్ ఆపేసింది.. కొత్తగా 6 మిలియన్ల సబ్‌స్ర్కైబర్లు..!

Netflix New Subscribers : నెట్‌ఫ్లిక్స్ పాస్‌వర్డ్ షేరింగ్ పాలసీని దాదాపు అన్ని దేశాల్లో నిలిపివేసింది. 2023 రెండో త్రైమాసికంలో (Netflix) దాదాపు 6 మిలియన్ల కొత్త పేమెంట్ సబ్‌స్ర్కైబర్ల సభ్యుత్వాలను పొందింది.

Netflix New Subscribers : ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) పాస్‌వర్డ్ షేరింగ్‌ను ఎదుర్కోవడానికి చేసిన ప్రయత్నాలు అనేక పాజిటివ్ ఫలితాలను ఇస్తున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే.. అకౌంట్ షేరింగ్‌పై అణిచివేత తర్వాత కంపెనీ గణనీయమైన సబ్‌స్ర్కైబర్ల వృద్ధిని నివేదించింది. 2023 రెండో త్రైమాసికంలో నెట్‌ఫ్లిక్స్ దాదాపు 6 మిలియన్ల పేమెంట్ సబ్‌స్ర్కైబర్లను పొందింది. అంటే.. దాదాపు 8 శాతం పెరుగుదలగా చెప్పవచ్చు. షేర్‌హోల్డర్‌లకు నెట్‌ఫ్లిక్స్ లేఖ ప్రకారం.. పాస్‌వర్డ్ షేరింగ్‌ నిలిపివేత కారణంగా సబ్‌స్ర్కైబర్ల సంఖ్య తగ్గిపోతుందని జోరుగా ప్రచారం జరిగింది. దానికి, బదులుగా కొత్త వ్యక్తిగత అకౌంట్లను క్రియేట్ చేయడానికి ఎక్కువ మంది వినియోగదారులు కొత్త పాలసీని పాటిస్తున్నారని, అదే సమయంలో వ్యక్తిగత సబ్‌స్క్రిప్షన్‌లను ఎంచుకుంటున్నారని తెలిపింది.

అకౌంట్ క్యాన్సిల్ చేసుకున్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉందని లేఖలో పేర్కొంది. మానిటైజేషన్ ప్రారంభ దశలోనే ఉందని, చాలా కుటుంబాలను ఫుల్ పేమెంట్ నెట్‌ఫ్లిక్స్ సభ్యత్వాలుగా మార్చేందుకు అదనపు సభ్యుల ఫీచర్‌ను అందిస్తున్నామని కంపెనీ తెలిపింది. నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో పాస్‌వర్డ్ షేరింగ్‌ను తగ్గించడానికి అనేక ఇతర దేశాలలో గతంలో తీసుకున్న చర్యలతో పాటు కొత్త చర్యలను అమలు చేసింది. కొత్త విధానంతో అకౌంట్ యూజర్ల కుటుంబానికి మించి అకౌంట్ షేరింగ్ చేయడానికి అనుమతించిన యూజర్ల సంఖ్యను పరిమితం చేస్తుంది. అకౌంట్ లాగిన్ ఆధారాలను స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేరింగ్ చేసిన వారిపై ప్రభావం పడుతుంది.

Read Also : Netflix Password Sharing : భారత్‌లో నెట్‌ఫ్లిక్స్ పాస్‌వర్డ్ షేరింగ్‌ లేనట్టే.. ఒకే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్లతో మాత్రమే షేరింగ్ అనుమతి..!

నెట్‌ఫ్లిక్స్ యూజర్ల స్థానాలను విశ్లేషించడానికి వారి అకౌంట్ వినియోగ విధానాన్ని అమలు చేయడానికి అనేక పద్ధతులను ఉపయోగిస్తుంది. ఇందులో అకౌంట్ IP అడ్రస్, డివైజ్ ID, Wi-Fi నెట్‌వర్క్‌లు, అకౌంట్ కార్యాచరణ ట్రాకింగ్ ఉన్నాయి. ప్రతి అకౌంటుతో ఇంటిగ్రేట్ చేసిన ప్రైమరీ లొకేషన్ గుర్తించడం ద్వారా యూజర్లు షేరింగ్ పరిమితి విధిస్తుంది. నెట్‌ఫ్లిక్స్ ప్రైమరీ లొకేషన్ వినియోగదారులు నెట్‌ఫ్లిక్స్‌ను యాక్సెస్ చేసే ప్రైమరీ లొకేషన్ నుంచి సాధారణంగా హోం Wi-Fi నెట్‌వర్క్‌తో కనెక్ట్ చేసిన డివైజ్‌లకు మాత్రమే లింక్ అవుతుంది.

Netflix adds nearly 6 million new subscribers after ending password sharing in many countries

ఇతర వ్యక్తులతో పాస్‌వర్డ్‌లను షేరింగ్ చేసే వినియోగదారులు నెట్‌ఫ్లిక్స్ నుంచి ఇమెయిల్‌ను అందుకుంటారు. రాబోయే రోజుల్లో కొత్త అకౌంట్ యూజర్ విధానాన్ని నోటిఫై చేస్తుంది. అకౌంట్ యాక్సెస్‌ని మానిటరింగ్ చేయడానికి వినియోగదారులు వారి అకౌంట్లలో సెక్యూరిటీ, ప్రైవసీ సెట్టింగ్‌లకు నావిగేట్ చేయవచ్చు. ‘Manage Access And Devices‘ ఆప్షన్ ఎంచుకోవచ్చు. అదనంగా, మరొకరి అకౌంట్ ఉపయోగిస్తున్న సభ్యులు వారి ప్రొఫైల్‌ను ట్రాన్స్‌ఫర్ చేసే ఆప్షన్ కలిగి ఉంటారు. మెరుగైన యూజర్ ఎక్స్‌పీరియన్స్ కోసం అకౌంట్ హిస్టరీని క్రియేట్ చేసిన సిఫార్సులను కొనసాగించవచ్చు.

పాస్‌వర్డ్ షేరింగ్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా 100 మిలియన్లకు పైగా సబ్‌స్ర్కైబర్లు తమ సర్వీసులను ఉచితంగా ఉపయోగిస్తున్నారని నెట్‌ఫ్లిక్స్ గతంలో పేర్కొంది. ఇప్పుడు, వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ అనేక దేశాలలో పాస్‌వర్డ్ షేరింగ్‌ని పరిమితం చేసినందున కొత్త సబ్‌స్ర్కైబర్లలను అందిస్తోంది. అకౌంట్ షేరింగ్ ఇప్పుడు ఒకే ఇంటిలో నివసిస్తున్న వ్యక్తుల మధ్య మాత్రమే అనుమతిస్తుంది. తల్లిదండ్రులు లేదా హౌస్‌మేట్‌లు ఒకే లొకేషన్‌లో నివసిస్తున్న వినియోగదారులు ఇప్పటికీ ఎలాంటి పరిమితులు లేకుండా అకౌంట్ షేర్ చేసుకోవచ్చు. కానీ, నెట్‌ఫ్లిక్స్ అకౌంట్‌ కనీసం 4 మందికి సపోర్టు ఇచ్చే టాప్-మోస్ట్ ప్లాన్‌ని కలిగి ఉండాలి.

Read Also : Nothing Phone (2) Discount : నథింగ్ ఫోన్ (2)పై ఓపెన్ సేల్.. అదిరే డిస్కౌంట్.. కొనే ముందు ఈ ఫీచర్లు ఉన్నాయో లేదో చెక్ చేయండి..!

ట్రెండింగ్ వార్తలు