Gold Rate : హమ్మయ్య.. శాంతించిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో తులం గోల్డ్ రేటు ఎంతంటే?
తెలుగు రాష్ట్రాల్లో సోమవారం బంగారం ధర తగ్గింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ..
- Harishth Thanniru
- Published on- July 8, 2024 / 10:42 AM IST
Gold Price Today
Gold And Silver Price Today : ఈ నెల ప్రారంభం నుంచి పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు సోమవారం శాంతించాయి. ఇవాళ నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ. 220 తగ్గింది. ఈ నెల ప్రారంభం నుంచి గోల్డ్ రేటు తగ్గడం ఇదే తొలిసారి. మరోవైపు వెండి ధర దూసుకెళ్తుంది. ఈనెల ప్రారంభం నుంచి వెండి ధర పెరుగుతూనే ఉంది. ఇవాళ కూడా కిలో వెండిపై రూ. 200 పెరిగింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ. లక్షకు చేరువైంది. దేశ వ్యాప్తంగా ఇవాళ్టి బంగారం, వెండి ధరలను ఓ సారి పరిశీలిస్తే..
- తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా..
తెలుగు రాష్ట్రాల్లో సోమవారం బంగారం ధర తగ్గింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,450కాగా.. 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ ధర రూ.73,580.
- దేశంలోని ప్రధాన నగరాల్లో ..
దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.67,600 కాగా, 24క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 73,730.
ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.67,450 కాగా, 24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 73,580.
చెన్నైలో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.68,000 కాగా.. 24క్యారెట్ల గోల్డ్ ధర రూ. 74,180కు చేరింది.
- వెండి ధర ఇలా ..
దేశ వ్యాప్తంగా సోమవారం వెండి ధర పెరిగింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం..
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 99,500.
దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే..
చెన్నైలో కిలో వెండి ధర రూ.99,500.
కోల్ కతా, ముంబయి, ఢిల్లీ ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.95,000.
బెంగళూరులో కిలో వెండి ధర రూ. 94,600 వద్ద కొనసాగుతుంది.
- పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 10 గంటలకు నమోదైనవి. ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.
