iPhone 15 Series : ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్‌పై అదిరే డిస్కౌంట్లు.. ఆన్‌లైన్‌లో ప్రీ-బుకింగ్ చేసుకోవాలంటే? ఇదిగో ప్రాసెస్..!

iPhone 15 Series : ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్‌పై ప్రీ-బుకింగ్ మొదలైంది.. ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ కొనుగోలుపై ఆసక్తి ఉన్న భారతీయులు.. ఆన్‌లైన్ ద్వారా ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చు. ఐఫోన్‌ల ధరలు, స్కౌంట్ లాంచ్ ఆఫర్లపై ఓసారి లుక్కేయండి.

iPhone 15 Series pre-booking window now open_ Check out India price and discount offers

iPhone 15 Series : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) కొత్తగా లాంచ్ చేసిన ఐఫోన్ 15 సిరీస్ ఇప్పుడు ప్రీ-బుకింగ్‌కు అందుబాటులో ఉంది. ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో లేదా ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ కొనుగోలుకు ఆసక్తి ఉన్న భారతీయులు లాంచ్ ఆఫర్‌లతో దేనినైనా తక్కువ ధరకు పొందవచ్చు. ప్రీ-ఆర్డర్లు సెప్టెంబర్ 15 నుంచి అందుబాటులోకి వచ్చాయి. ఈ సేల్ అధికారికంగా సెప్టెంబర్ 22న జరుగుతుంది. కొత్త ఐఫోన్ల ధరలు, సేల్, ప్రీ-ఆర్డర్ ఈవెంట్‌కు ముందు చాలామంది డిస్కౌంట్ లాంచ్ ఆఫర్‌లను అందిస్తోంది.

ఐఫోన్ 15 మోడళ్ల భారత ధర ఎంతంటే? :
ఐఫోన్ 15 బేస్ 128GB ధర రూ. 79,900, 256GB మోడల్ రూ. 89,900కి విక్రయించింది. 512GB వెర్షన్ రూ.1,09,900 ధర ట్యాగ్‌తో యూజర్లకు అందుబాటులో ఉంటుంది.

ఐఫోన్ 15 ప్లస్ : భారత ధర ఎంతంటే? :
ఐఫోన్ 15 ప్లస్ 128GB ధర రూ. 89,900, 256GB వేరియంట్ ధర రూ. 99,900. అదే ఐఫోన్ 512GB మోడల్ కూడా ఉంది. ఈ మోడల్ ఐఫోన్ రూ. 1,19,900కు విక్రయిస్తోంది.

Read Also : iPhone 14 Series Price Cut : ఐఫోన్ 15 సిరీస్ రాగానే.. భారీగా తగ్గిన ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 13 ధరలు.. ఏ ఫోన్ ధర ఎంతంటే?

ఐఫోన్ 15 ప్రో భారత ధర :
128GB మోడల్‌తో కూడిన ఐఫోన్ 15 ప్రో ధర రూ. 1,34,900, 256GB వేరియంట్ ధర రూ. 1,44,900, 512GB మోడల్‌ను రూ. 1,64,900 లేదా 1TB వేరియంట్‌ను రూ. 1,84,900కి కొనుగోలు చేయవచ్చు.

ఐపోన్ 15 ప్రో మ్యాక్స్ : భారత ధర ఎంతంటే? :
ఆపిల్ (Apple) నుంచి అత్యంత ప్రీమియం ఐఫోన్ (iPhone 15 Pro Max) 256GB మోడల్ ధర రూ.1,59,900కు అందిస్తుంది. 512GB వేరియంట్ రూ. 1,79,900, 1TB మోడల్ రూ. 1,99,900కి అందుబాటులో ఉంటుంది.

ఐఫోన్ 15 సిరీస్ ప్రీ-ఆర్డర్ : డిస్కౌంట్ ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్ డీల్స్ :
ఫ్లిప్‌కార్ట్, ఆపిల్ ఇండియా స్టోర్‌లో డిస్కౌంట్ ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్ 15 సిరీస్ ప్రీ-ఆర్డర్ల కోసం ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై రూ. 5వేలు తగ్గింపు ఆఫర్‌తో అందుబాటులో ఉన్నాయి. HDFC డెబిట్ కార్డ్ కలిగిన యూజర్లు EMI లావాదేవీలను ఎంచుకుంటే కూడా ఈ ఆఫర్‌ను పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రోMaxపై అలాంటి ఆఫర్‌లను అందించడం లేదు.

ఆపిల్ అధికారిక ఆన్‌లైన్ స్టోర్ నుంచి ఐఫోన్‌ను కొనుగోలు చేయొచ్చు. ఆపిల్ కొత్త ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మాక్స్ మోడళ్లకు డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లను ప్రకటించింది. HDFC బ్యాంక్ కార్డ్ యూజర్లు రూ. 6వేలు డిస్కౌంట్ పొందవచ్చు, నాన్-ప్రో మోడల్‌లకు రూ. 5వేలు క్యాష్‌బ్యాక్ ఆఫర్ పొందవచ్చు. ఐఫోన్ 14, 14 ప్లస్‌లపై రూ. 4,000 తగ్గింపు, ఐఫోన్ 13పై రూ. 3వేలు, ఐఫోన్ SE ధర రూ. 2,000తో పాత ఐఫోన్ మోడల్‌లపై బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్‌లను కూడా కంపెనీ అందిస్తోంది.

iPhone 15 Series pre-booking window now open_ Check out India price and discount offers

ఆపిల్ ట్రేడ్-ఇన్ ఆప్షన్లను కూడా అందిస్తోంది. కొనుగోలుదారులు కొత్త ఐఫోన్‌లపై అర్హత కలిగిన స్మార్ట్‌ఫోన్‌లను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా ఇన్‌స్టంట్ క్రెడిట్‌లో రూ. 55,700 వరకు పొందవచ్చు. కానీ, ఈ ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఎక్స్ఛేంజ్ చేసుకునే పాత ఫోన్, దాని కండిషన్ ఆధారంగా వాల్యూ ఉంటుంది. ఎందుకంటే స్మార్ట్‌ఫోన్ చాలా పాతది అయితే.. తక్కువ డిస్కౌంట్ ఎక్స్ఛేంజ్ ధరను పొందవచ్చు. అందువల్ల, కొనుగోలుదారులు ముందుగా ఆఫర్లు, అన్ని వెబ్‌సైట్‌లలోని అన్నింటినీ చెక్ చేసుకోవచ్చు.

ఐఫోన్ 15ని ప్రీ-ఆర్డర్ చేయడం ఎలా? :
1. ఆపిల్ అధికారిక వెబ్‌సైట్‌ (apple.com) కి వెళ్లండి.
2. మీ ప్రైమరీ మోడల్‌ని ఎంచుకోండి.
3. iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro లేదా iPhone 15 Pro Max.
4. స్టోరేజీ, కలర్ ఆప్షన్లను ఎంచుకోండి.
4. ఆపిల్ ట్రేడ్-ఇన్‌ను ఎంచుకోండి (లేదా ‘నో ట్రేడ్-ఇన్’ ఎంచుకోండి).
ఒకవేళ మీరు ట్రేడ్-ఇన్ ఆప్షన్‌తో వెళితే.. మీ పాత డివైజ్‌పై కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి.
5. కవరేజ్ AppleCare+ నిర్ణయించుకోండి.
6. పేమెంట్లను కొనసాగించడానికి ‘Continue’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
7. iPhone 15 మోడల్ ఎంచుకుని పేమెంట్ చేయండి.

Read Also : iPhone 15 Series Low Price : ఐఫోన్ 15 సిరీస్ కావాలా? తక్కువ ధరకే కొత్త ఐఫోన్లను అందిస్తున్న దేశాలివే.. ఏ దేశంలో ధర ఎంత? ఇప్పుడే తెప్పించుకోండి..!

ట్రెండింగ్ వార్తలు