iQOO Neo 7 Pro India : భారత్‌కు ఐక్యూ నియో 7 ప్రో వచ్చేస్తోంది.. జూలై 4నే లాంచ్.. ధర ఎంత ఉండొచ్చుంటే?

iQOO Neo 7 Pro India : ఐక్యూ నియో 7 ప్రో జూలై 4న భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఈ కొత్త 5G ఫోన్‌కు వెనుక భాగంలో లెదర్ ఫినిషింగ్ ఉంటుంది. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో రానుంది.

iQOO Neo 7 Pro India launch set for July 4, price tipped to be under Rs 40,000

iQOO Neo 7 Pro India launch : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ ఐక్యూ (iQOO) నుంచి నియో 7 ప్రో భారత మార్కెట్లో జూలై 4న లాంచ్ కానుంది. లాంచ్ ఈవెంట్‌కు ముందు.. కంపెనీ స్మార్ట్‌ఫోన్ డిజైన్‌ను వెల్లడించింది. స్పెసిఫికేషన్లు ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. ప్రీమియం డిజైన్, టాప్-ఎండ్ స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 చిప్‌సెట్, మరిన్నింటిని కలిగి ఉంటుంది. ఇప్పటివరకు లీక్ అయిన ఫీచర్ల గురించి తెలుసుకుందాం..

ఐక్యూ నియో 7 ప్రో డిజైన్ :
ఈ కొత్త 5G ఫోన్‌కు బ్యాక్ సైడ్ లెదర్ ఫినిషింగ్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ పొందవచ్చు. సైడ్ ఫ్రేమ్‌లు గోల్డెన్ సర్కిల్ కలిగి ఉంటాయి. ముందు భాగంలో చాలా ఆండ్రాయిడ్ ఫోన్‌లలో చూసిన పంచ్-హోల్ డిజైన్ ఉంది.

Read Also : Google Smartphones : ఆపిల్ మాత్రమే కాదు.. భారత్‌‌లో గూగుల్ కూడా పిక్సెల్ ఫోన్లను తయారు చేస్తుందట..!

ఐక్యూ నియో 7 ప్రో : ధర (అంచనా) :
భారత్‌లో ఐక్యూ నియో 7 ప్రో మోడల్ లాంచ్ ధర రూ. 40వేలు ఉంటుందని భావిస్తున్నారు. ఐక్యూ నియో 7 స్మార్ట్‌ఫోన్ అధునాతన వెర్షన్ అని చెప్పవచ్చు. ఈ ఫోన్ ధర కొంచెం ఎక్కువగా ఉంటుంది. నియో 7 మోడల్ భారత మార్కెట్లో రూ.29,999 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. ఈ ప్రో వెర్షన్ ధర రూ. 40వేల సెగ్మెంట్ కిందకు వస్తుంది. ఎందుకంటే.. ఫ్లాగ్‌షిప్ చిప్‌సెట్, ఆఫర్ ప్రీమియం ఫీచర్లను ఉపయోగిస్తుంది. రాబోయే iQOO నియో ఫోన్ అమెజాన్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉండనుంది.

iQOO Neo 7 Pro India launch set for July 4, price tipped to be under Rs 40,000

iQOO Neo 7 Pro లీకైన స్పెసిఫికేషన్‌లు ఇవే :
రాబోయే ఐక్యూ నియో 7 ప్రో మోడల్ 6.78-అంగుళాల FHD+ Samsung E5 AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. ప్యానెల్ 120Hz వద్ద రిఫ్రెష్ అయ్యే అవకాశం ఉంది. Qualcomm Snapdragon 8+ Gen 1 చిప్‌సెట్‌ను ప్యాక్ చేస్తుంది. ఈ ఫ్లాగ్‌షిప్ చిప్, అనేక 2022 ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లకు పవర్ అందిస్తుంది. రాబోయే నథింగ్ ఫోన్ 2 కూడా అదే చిప్‌ని ఉపయోగించనుంది.

12GB RAM, 256GB స్టోరేజీతో రానుంది. ఆప్టిక్స్ పరంగా.. ఐక్యూ నియో 7 Pro OIS సపోర్టుతో శాంసంగ్ GN5 సెన్సార్‌తో వెనుకవైపు 50MP ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. ఇతర కెమెరా సెన్సార్ల వివరాలు ప్రస్తుతానికి తెలియవు. ఈ 5G స్మార్ట్‌ఫోన్ 5,000mAh బ్యాటరీతో సపోర్టు అందిస్తుంది. కంపెనీ రిటైల్ బాక్స్‌లో 120W ఫాస్ట్ ఛార్జర్‌ను అందించనుంది.

Read Also : Samsung Galaxy M34 5G : శాంసంగ్ గెలాక్సీ M34 5G ఫోన్ భారత్‌కు వచ్చేస్తోంది.. ధర, స్పెషిఫికేషన్లు లీక్..!

ట్రెండింగ్ వార్తలు