Lava Blaze Pro 5G : భారతీయ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ, లావా (Lava) ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ లైనప్‌ను క్రమంగా విస్తరిస్తోంది. కంపెనీ ఇప్పటికే ఈ ఏడాదిలో Agni 2, Yuva 2, Blaze 5Gతో సహా వరుస స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. లేటెస్టుగా లావా మరో కొత్త 5G స్మార్ట్‌ఫోన్ (Lava Blaze Pro 5G)ని రూ. 15వేల లోపు 5G స్మార్ట్ఫోన్ల పోటీతో భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. కేవలం రూ. 12,499 వద్ద తన సింగిల్ 8GB RAM+ 128 స్టోరేజ్‌ను ప్రకటించింది.
ఈ లావా డివైజ్ రంగులు మారే బ్యాక్ ప్యానెల్‌ను కూడా కలిగి ఉంది. ఇందులో 2 కలర్ వేరియంట్లలో విక్రయానికి అందుబాటులో ఉన్నాయి. Redmi 12 5G, Poco M6 Pro, Realme Narzo 60X, Vivo T2X లకు పోటీగా వచ్చింది. ఈ కొత్త లావా బ్లేజ్ 5G ఫోన్ ధర, లభ్యత, స్పెసిఫికేషన్లను ఓసారి పరిశీలిద్దాం.
Read Also : iPhone 13 Price Cut : ఆపిల్ ఐఫోన్ 13 ధర భారీగా తగ్గిందోచ్.. ఈ ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్ అసలు మిస్ చేసుకోవద్దు..!
భారత్‌లో లావా బ్లేజ్ ప్రో 5G ధర ఎంతంటే? :
లావా సింగిల్ 8GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ మోడల్ (Blaze Pro 5G)ని కేవలం రూ. 12,499కే అందస్తోంది. ఈ డివైజ్ రంగులు మారే బ్యాక్ ప్యానెల్‌ను కలిగి ఉంది. స్టార్రీ నైట్, రేడియంట్ పర్ల్ అనే 2 కలర్ ఆప్షన్లలో విక్రయానికి అందుబాటులో ఉంటుంది. లావా బ్లేజ్ ప్రో 5G ఫోన్ అక్టోబర్ 3 నుంచి లావా రిటైల్ నెట్‌వర్క్‌తో పాటు ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్ (Amazon) వేదికగా కొనుగోలు చేయొచ్చు.
లావా బ్లేజ్ ప్రో 5G స్పెసిఫికేషన్స్ :
లావా Pro 5G ఫోన్ MediaTek Dimensity 6020 ప్రాసెసర్‌తో వస్తుంది. Android 13 OS ద్వారా 128GB స్టోరేజీ, 8GB RAM మరింత విస్తరించుకోవచ్చు. పవర్ కోసం లావా ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. బ్లేజ్ ప్రో 5G పంచ్ హోల్ డిజైన్, 120 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల FHD+ డిస్ప్లేను కలిగి ఉంది.
ఈ ఫోన్ ఫేస్ అన్‌లాక్, సైడ్ ఫింగర్ సెన్సార్ వంటి కొన్ని సెక్యూరిటీ ఫీచర్లతో కూడా వస్తుంది. అదనంగా, అడ్వాన్స్ ప్రైవసీ కోసం గుర్తుతెలియని ఫోన్ కాల్స్‌పై ఆటో కాల్ రికార్డింగ్‌ను అందిస్తుంది. లావా ‘free service at home’ను కూడా అందిస్తోంది. వారంటీ కింద లావా డివైజ్‌లపై డోర్‌స్టెప్ సర్వీసును కూడా అందిస్తుంది. 50MP ప్రైమరీ కెమెరా, 8MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో కూడిన డ్యూయల్-కెమెరా సిస్టమ్‌తో వస్తుంది.
కెమెరా ఫిల్మ్, స్లో మోషన్, టైమ్‌లాప్స్, UHD, Gif, బ్యూటీ, HDR, నైట్, పోర్ట్రెయిట్, AI, ప్రో, పనోరమా, ఫిల్టర్లు, ఇంటెలిజెంట్ స్కానింగ్‌తో సహా అనేక రకాల షూటింగ్ మోడ్‌లను కూడా అందిస్తుంది. వీడియోల కోసం బ్లేజ్ ప్రో 5G సాఫీగా రికార్డింగ్ చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (EIS)తో 2K సపోర్టుతో కూడా వస్తుంది. గత ఆగస్ట్‌లో లావా కేవలం 3GB RAM, 64GB స్టోరేజ్ మోడల్‌కు కేవలం ధర రూ. 6,999కే ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్ (Yuva 2)ని లాంచ్ చేసింది.