Mark Zuckerberg : అయ్యో.. జుకర్‌బర్గ్‌ ఎంత పనైంది.. ఫేస్‌బుక్ సీఈఓకు భారీ నష్టం.. ఒక్క రోజులో ఎన్ని కోట్లు కోల్పోయాడో తెలుసా?

Mark Zuckerberg : ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా (Meta) యాజమాన్యంలోని ఫేస్‌బుక్ మాతృసంస్థ సీఈఓ మార్క్ జూకర్‌బర్గ్ (Mark Zuckerberg) భారీ నష్టాన్ని మూటగట్టుకున్నాడు. జుకర్‌బర్గ్ ఒక రోజు సంపాదనలో దాదాపు 11 బిలియన్ల డాలర్లు (రూ.90వేల కోట్లు) నష్టపోయాడు.

Mark Zuckerberg : ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా (Meta) యాజమాన్యంలోని ఫేస్‌బుక్ మాతృసంస్థ సీఈఓ మార్క్ జూకర్‌బర్గ్ (Mark Zuckerberg) భారీ నష్టాన్ని మూటగట్టుకున్నాడు. జుకర్‌బర్గ్ ఒక రోజు సంపాదనలో దాదాపు 11 బిలియన్ల డాలర్లు (రూ.90వేల కోట్లు) నష్టపోయాడు. 2022 ఏడాది ప్రారంభంలో మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం.. ఆరవ అతిపెద్ద అమెరికా కంపెనీగా మెటా ప్లాట్‌ఫారమ్‌ మార్కెట్ విలువలో భారీ పతనాన్ని చవిచూసింది. ప్రస్తుతం దేశంలోనే మెటా 26వ స్థానంలో ఉంది. ఈ ఏడాది మార్కెట్ విలువలో 677 బిలియన్ డాలర్లు (రూ. 55 లక్షల కోట్లకు పైగా) మెటా కోల్పోయింది.

మెటా దాదాపు 700 బిలియన్ల డాలర్ల నష్టపోయింది. ప్రపంచంలోని 20 అతిపెద్ద కంపెనీల ర్యాంక్‌ల నుంచి దిగజారిపోయింది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. మెటా సంస్థ మార్కెట్ విలువ ఇప్పుడు చెవ్రాన్ కార్ప్, ఎలి లిల్లీ & కో., ప్రోక్టర్ & గాంబుల్ కోతో సహా కంపెనీల కన్నా తక్కువకు పడిపోయింది. Meta చివరి అతిపెద్ద సింగిల్-డే క్రాష్ ఈ ఏడాది ఫిబ్రవరిలో దాని Q4 ఆదాయాల తర్వాత 230 బిలియన్ డాలర్లుగా నమోదైంది. అప్పుడు, జుకర్‌బర్గ్ద్ సంస్థ మెటా దాదాపు 30 బిలియన్ డాలర్లు లేదా (రూ. 2 లక్షల కోట్లకు)పైగా నష్టపోయింది. తద్వారా జుకర్‌బర్గ్ సంపద ఒక్కరోజులోనే ఆవిరై పోయింది.

Meta losses $700 billion in value; Mark Zuckerberg’s net worth down $11 billion in a day

మరోవైపు, ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ విలువ గురువారం (అక్టోబర్ 27) నాటికి 11 బిలియన్ డాలర్లు తగ్గిపోవడంతో మెటా కంపెనీ షేర్ 36 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఎందుకంటే కంపెనీ షేర్లు ఖరీదైన మెటావర్స్ కారణంగా 25 శాతం పడిపోయాయి. ప్రకటన ఖర్చులపై పెరుగుతున్న ద్రవ్యోల్బణం ప్రభావం పెట్టుబడిదారుల్లో భయాందోళనకు దారితీసింది. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో 25వ ధనవంతుడిగా ఉన్న జుకర్‌బర్గ్.. 11 బిలియన్ డాలర్ల సంపద కోల్పోవడంతో 29వ స్థానానికి పడిపోయాడు.

2021 సెప్టెంబర్ 7న మార్క్ జుకర్‌బర్గ్ సంపద 136.4 బిలియన్ డాలర్లుగా ఉంది. అంటే.. భారత కరెన్సీలో సుమారు 11 లక్షల కోట్ల సంపద మార్క్ సొంతం అనమాట.. ఇప్పటి వరకు బర్గ్ ఏకంగా 74 శాతం..100 బిలియన్ డాలర్ల సంపద కోల్పోయారు. మెటావర్స్ యూనిట్‌లో భారీగా నష్టాల కారణంగానే మెటా షేర్లు ఒక్కసారిగా పడిపోయాయి. గతంలో 37.7 బిలియన్ డాలర్ల సంపదతో 28వ స్థానంలో జుకర్ బర్గ్ ఉన్నాడు. ఆగస్ట్ 2020లో 102 బిలియన్ల గరిష్ట స్థాయి నుంచి ఒక్కసారిగా పడిపోయాడు. దాంతో జుకర్ బర్గ్ ఇండెక్స్‌లో మూడవ అత్యంత ధనవంతుడుగా నిలిచాడు.

Meta losses $700 billion in value; Mark Zuckerberg’s net worth down $11 billion in a day

మెటా స్టాక్ గురువారం నాడు 100.55 బిలియన్ డాలర్ల వద్ద ట్రేడవుతోంది. డిసెంబర్ 2016 నుంచి దాని కనిష్ట స్థాయికి పడిపోయింది. ఎందుకంటే కంపెనీ బుధవారం చివరిలో విడుదల చేసిన మూడవ త్రైమాసిక ఆదాయాలలో లాభాలలో 50 శాతం క్షీణించడంతో రాబడి కాస్తా 4 శాతానికి పడిపోయింది. మెటా రాబోయే ఖర్చు ప్రణాళికలో కంపెనీకి ప్రధాన ఆదాయ వనరు అయిన యాడ్ మార్కెట్ క్షీణిస్తున్న తరుణంలో మెటా క్యాపిటల్ ఇంటెన్సివ్ ప్రాజెక్ట్‌లపై ఖర్చు చేయడంపై ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.

మెటావర్స్ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ కోసం సంవత్సరానికి 10 బిలియన్ డాలర్ల ఖర్చు చేయాలని కంపెనీ భావిస్తోంది, ఆ పెట్టుబడులు ఫలించటానికి దాదాపు ఒక దశాబ్దం పడుతుందని ఆశిస్తున్నట్లు CEO జుకర్‌బర్గ్ చెప్పారు. కంపెనీ మెటావర్స్ యూనిట్.. ఈ ఏడాదిలో ఇప్పటికే 9.44 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని కోల్పోయింది, గత ఏడాదిలో యూనిట్ 10 బిలియన్ డాలర్లకు పైగా నష్టాలను నమోదు చేసింది. 2023లో యూనిట్ నష్టాలు మరింత పెరుగుతాయని మెటా అంచనా వేసింది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Elon Musk vs Vijaya Gadde: భారత సంతతికి చెందిన విజ‌యా గ‌ద్దె అంటే మ‌స్క్ కు ఎందుకంత కోపం.? ట‌్రంప్‌ విష‌యంలో జోక్య‌మే కార‌ణ‌మా..

ట్రెండింగ్ వార్తలు