Oppo K11 5G Launch Date : ఒప్పో K11 5G ఫోన్ లాంచ్ డేట్ తెలిసిందోచ్.. ధర, కీలక ఫీచర్లు లీక్..!

Oppo K11 5G Launch Date : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఒప్పో K11 5G ఫోన్ వచ్చేస్తోంది. ఈ నెల 25న భారత మార్కెట్లో లాంచ్ కానుంది.

Oppo K11 5G Launch Date Set for July 25; Price, Key Specifications, Colour Options Teased

Oppo K11 5G Launch Date : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ ఒప్పో నుంచి సరికొత్త 5G ఫోన్ రాబోతోంది. ఈ నెల (జూలై 25న) భారత మార్కెట్లో లాంచ్ కానుంది. గత ఏప్రిల్ 2022లో (Oppo K11 5G) ఏప్రిల్ 2022లో ఆవిష్కరించిన Oppo K10 5Gకి సక్సెసర్‌గా రానుంది. ఒప్పో K10 5G ఫోన్ 8GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజీతో జత చేసిన MediaTek డైమెన్సిటీ 810 SoCతో వస్తుంది. 33W వైర్డు SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీతో రానుంది. ఈ ఫోన్ లాంచ్‌కు ముందు.. ఒప్పో K11 5G ఫోన్ ధర, కొన్ని కీలక స్పెసిఫికేషన్‌లను కంపెనీ వెల్లడించింది. ఇంతలో, రాబోయే హ్యాండ్‌సెట్ ఇతర స్పెసిఫికేషన్‌లు టిప్‌స్టర్ ద్వారా లీక్ అయ్యాయి.

ఒప్పో చైనా ప్రెసిడెంట్ (Bobee Liu Weibo) పోస్ట్‌లో రాబోయే ఒప్పో K11 5G ఫోన్ ధర CNY 2,000 (దాదాపు రూ. 22,900) ఉంటుందని, హ్యాండ్‌సెట్‌లో ఫ్లాగ్‌షిప్-లెవల్ కెమెరాను కంపెనీ అందించనుంది. ఈ ఒప్పో ఫోన్ 50MP సోనీ IMX890 సెన్సార్‌తో రానుంది. ఈ ఫోన్ గ్లేసియర్ బ్లూ, మూన్ షాడో గ్రే (చైనీస్ నుంచి) కలర్ ఆప్షన్లలో రానుంది. బేస్ 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 1,399 (దాదాపు రూ. 15,900)తో లాంచ్ కానుంది.

Read Also : Honor Play 40C Launch : భారీ బ్యాటరీతో హానర్ ప్లే 40C ఫోన్ వచ్చేసిందోచ్.. ఫీచర్లు భలే ఉన్నాయి భయ్యా.. ధర తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు!

ఒప్పో K11 5G హ్యాండ్‌సెట్ కలర్ ఆప్షన్లు, డిజైన్‌ను కూడా కంపెనీ వెల్లడించింది. ఈ ఫోన్ ఫ్లాట్ డిస్‌ప్లేతో, సర్కిల్ ఎడ్జ్‌లతో 2.8D కర్వడ్‌తో కనిపిస్తుంది. బ్యాక్ ప్యానెల్ టాప్ లెఫ్ట్ సైడ్కొద్దిగా పెరిగిన రెండు వృత్తాకార కటౌట్‌లు ఉండనున్నాయి. ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌లు అలాగే LED ఫ్లాష్ యూనిట్‌ను కలిగి ఉంటాయి. వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ రైట్ ఎడ్జ్‌తో కనిపించవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ 8.23mm మందం, 184 గ్రాముల బరువు కలిగి ఉన్నట్లు తెలిపింది.

Oppo K11 5G Launch Date Set for July 25; Price, Key Specifications, Colour Options Teased

ఆప్టిక్స్ విషయానికి వస్తే.. ట్రిపుల్ కెమెరా సెటప్‌లో 50MP సోనీ IMX890 ప్రైమరీ సెన్సార్‌తో పాటు 8MP, 2MP సెన్సార్ కూడా ఉంటాయి. ఒప్పో K11 5Gలోని సెల్ఫీ కెమెరా 16MP సెన్సార్‌తో వస్తుందని టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ (@yabhishekd) తెలిపారు. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 782G SoC, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 ఫుల్ HD+ OLED డిస్‌ప్లేను ప్యాక్ చేస్తుంది.

UFS 3.1 స్టోరేజ్‌తో LPDDR4x RAMని ఆఫర్ చేస్తుందని కూడా టిప్‌స్టర్ తెలిపింది. ఒప్పో K11 5G ఫోన్ 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీతో రానుందని భావిస్తున్నారు. సెక్యూరిటీ విషయానికి వస్తే.. ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వచ్చే అవకాశం ఉంది. NFC కనెక్టివిటీకి సపోర్టు ఇచ్చే అవకాశం ఉంది. X-యాక్సిస్ హాప్టిక్ మోటార్, IR బ్లాస్టర్, డ్యూయల్ స్పీకర్లతో రానుంది.

Read Also : Mercedes-Benz GLC SUV : రెండో జనరేషన్ మెర్సిడెస్-బెంజ్ GLC వచ్చేస్తోంది.. ఆగస్టు 9నే లాంచ్.. ఇప్పుడే బుకింగ్ చేసుకోండి..!

ట్రెండింగ్ వార్తలు