తాడిపత్రి పట్టణంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు.. ఏం జరిగిందో తెలుసా?

ఎమ్మెల్యే, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డితో..

JC Ashmit Reddy

అనంతపురంలోని తాడిపత్రి పట్టణంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. పోలీస్టేషన్ ముందు ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, టీడీపీ శ్రేణులు బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. అక్రమంగా తరలిస్తున్న ఇసుక టిప్పర్లు, ట్రాక్టర్లపై కేసు పెట్టాలని సీఐ లక్ష్మీకాంత్ రెడ్డికి ఫోన్ చేసి చెప్పానని ఎమ్మెల్యే జేసి సస్మిత్ రెడ్డి అన్నారు.

అయినప్పటికీ సీఐ ఆ ఇసుక టిప్పర్లను, ట్రాక్టర్లను వదిలేశాడని టీడీపీ కార్యకర్తలు అంటున్నారు. ఎమ్మెల్యే, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డితో సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి దురుసుగా మాట్లాడాడని టీడీపీ కార్యకర్తలు అంటున్నారు. లక్ష్మీకాంత్ వైసీపీ సీఐ అంటూ టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు.

ఎమ్మెల్యేకు సీఐ క్షమాపణ చేప్పాలంటూ పోలీస్టేషన్ ముందు ఆందోళన చేస్తున్నారు. ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డికి డీఎస్పీ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. సీఐ వచ్చి ఎమ్మెల్యేకి క్షమాపణ చేప్పేంతవరకు అక్కడి నుంచి కదిలేది లేదని టీడీపీ నేతలు, కార్యకర్తలు అంటున్నారు.

Also Read: ఏపీ హోం మంత్రి వంగ‌ల‌పూడి అనితను కలిసిన సుగాలి ప్రీతి తల్లి

ట్రెండింగ్ వార్తలు