Ktr : బండి సంజయ్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్..

కవిత బెయిల్ అంశంపై బండి సంజయ్ చేసిన ట్వీట్ రాజకీయవర్గాల్లో తీవ్ర దుమారం రేపింది.

Ktr : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పై కేంద్రమంత్రి బండి సంజయ్ చేసిన సెటైరికల్ ట్వీట్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ”బండి సంజయ్ కేంద్ర హోం వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. సుప్రీం తీర్పుపైన మీరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. సంజయ్ వ్యాఖ్యలను కోర్టు ధిక్కార చర్యలుగా చూడాలని కోరుతున్నా” అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. కవిత బెయిల్ వ్యవహారంపై బండి సంజయ్, కేటీఆర్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.

బండి సంజయ్ తీరును కేటీఆర్ తీవ్రంగా తప్పుపట్టారు. ఆయనపై నిప్పులు చెరిగారు. కేంద్ర మంత్రిగా ఉండి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ నే తప్పు పట్టే విధంగా తప్పుడు అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం సమంజసం కాదని కేటీఆర్ హితవు పలికారు. దీనిపై సుప్రీంకోర్టు స్పందించాలని, సుమోటోగా తీసుకుని సంజయ్ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

Also Read : కవిత అరెస్ట్ నుంచి బెయిల్ వరకు.. ఎప్పుడు ఏం జరిగింది.. పూర్తి వివరాలు ఇలా..

కాగా, కవిత బెయిల్ అంశంపై కేంద్రమంత్రి బండి సంజయ్ సెటైరికల్ ట్వీట్ చేశారు. కవితకు బెయిల్ వచ్చినందుకు అందుకు కృషి చేసిన కాంగ్రెస్ కు, న్యాయవాదులకు అభినందనలు తెలిపారు. కవిత బెయిల్ పై బయటకు వచ్చారు, అదే సమయంలో కాంగ్రెస్ వ్యక్తి రాజ్యసభకు వెళ్లారని అన్నారు. కవిత బెయిల్ కోసం వాదించిన అభ్యర్థిని కాంగ్రెస్ ఏకగ్రీవంగా రాజ్యసభకు పంపిందని అభిషేక్ మను సింఘ్విని ఉద్దేశించి ఎక్స్ లో ట్వీట్ చేశారు బండి సంజయ్. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడికి మద్దతివ్వడంలో కేసీఆర్ అద్భుతమైన రాజకీయ చతురత ప్రదర్శించారని బండి సంజయ్ అన్నారు. వైన్, డైన్ చేసే క్రైమ్‌లో భాగస్వాములకు అభినందనలంటూ సెటైర్లు వేశారు. మొత్తంగా కవిత బెయిల్ అంశంపై బండి సంజయ్ చేసిన ట్వీట్ రాజకీయవర్గాల్లో తీవ్ర దుమారం రేపింది.

 

ట్రెండింగ్ వార్తలు