Quotation Gang : సన్నీలియోన్, ప్రియమణి రా అండ్ రస్టిక్ సినిమా తెలుగులో రిలీజ్.. ఎప్పుడంటే..
గ్యాంగ్స్ వార్ నేపథ్యంలో QG - కొటేషన్ గ్యాంగ్ సినిమా రాబోతున్నట్టు తెలుస్తుంది.
- Saketh U
- Published On : August 27, 2024 / 05:05 PM IST
Sunny Leone Priyamani Quotation Gang Trailer Released and Release Date Announced
Quotation Gang : జాకీ ష్రాఫ్, ప్రియమణి, సన్నీలియోన్, సారా అర్జున్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన బాలీవుడ్ సినిమా QG – కొటేషన్ గ్యాంగ్ సినిమాని హిందీతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, తమిళ్ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. తెలుగులో ఈ సినిమాని ఎన్టీఆర్ శ్రీను సమర్పణలో రుషికేశ్వర్ ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మాత వేణుగోపాల్ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా తెలుగులో ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేస్తూ రిలీజ్ డేట్ ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఈవెంట్ ని నిర్వహించారు. ఆగస్టు 30న ఈ QG సినిమాని రిలీజ్ చేయనున్నారు.
QG – కొటేషన్ గ్యాంగ్ సినిమా ట్రైలర్ చూస్తుంటే ఫుల్ రా అండ్ రస్టిక్ గా ఉంది. సన్నిలియోన్, ప్రియమణి, జాకీ ష్రాఫ్ వీళ్లంతా నటనలో అదరగొట్టారని తెలుస్తుంది. గ్యాంగ్స్ వార్ నేపథ్యంలో ఈ సినిమా రాబోతున్నట్టు తెలుస్తుంది. మీరు కూడా QG ట్రైలర్ చూసేయండి..
ప్రెస్ మీట్ లో నిర్మాత వేణుగోపాల్ మాట్లాడుతూ.. ఇది మంచి మాస్ మసాలా కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమా. ప్రేక్షకులకు నచ్చుతుంది ఈ సినిమా అని అన్నారు. ఎన్టీఆర్ ప్రెజెంట్స్ ఎన్టీఆర్ శ్రీను మాట్లాడుతూ.. డైరెక్టర్ బాలా దగ్గర 15 ఏళ్ళు దర్శకత్వ శాఖలో పనిచేసిన వివేక్ కుమార్ కన్నన్ ఈ సినిమాని డైరెక్ట్ చేసారు. ఈ సినిమాని అద్భుతమైన లొకేషన్స్ లో షూట్ చేశారు అని తెలిపారు.
నిర్మాత ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. జాకీ ష్రాఫ్, సన్నీలియోన్, ప్రియమణి లాంటి పెద్ద స్టార్స్ ని పెట్టి కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఈ సినిమాని నిర్మించారు. డ్రమ్స్ శివమణి మ్యూజిక్ అద్భుతంగా ఉండబోతుంది. నిర్మాత వేణుగోపాల్, డిస్ట్రిబ్యూటర్ ఎన్టీఆర్ శ్రీనుకి ఇది సరైన సినిమా అని తెలిపారు. నిర్మాత దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. QG ట్రైలర్ చాలా బాగుంది. సినిమాలో విజువల్స్ కూడా బాగున్నాయి. నిర్మాత వేణుగోపాల్ గారికి ఈ సినిమా మంచి విజయం సాధించి డబ్బులు తీసుకురావాలి అని అన్నారు.
