Union Budget 2023-24 : కేంద్ర బడ్జెట్ 2023-24.. మహిళలకు ప్రత్యేక పథకం

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సంవత్సరం 2023-24కు సంబందించిన వార్షిక బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి నిర్మలా మాట్లాడుతూ మహిళా సాధికారతకు పెద్ద పీట వేస్తున్నట్లు పేర్కొన్నారు.

Union Budget 2023-24 : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సంవత్సరం 2023-24కు సంబందించిన వార్షిక బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి నిర్మలా మాట్లాడుతూ మహిళా సాధికారతకు పెద్ద పీట వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా మహిళల కోసం కొత్త పొదుపు పథకం వస్తుందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇందులో భాగంగానే ఈ బడ్జెట్ లో మహిళల కోసం ప్రత్యేకంగా కొత్త పథకాన్ని ప్రవేశ పెట్టినట్లు ప్రకటించారు. మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ అనే కొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు.

మహిళల కోసం కేంద్రం ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఈ పథకం 2025వరకు అందుబాటులో ఉంటుంది. ఇందులో రెండు సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టవచ్చని తెలిపారు. ఈ పథకంలో రూ.2 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. ఈ ఫిక్స్ డ్ డిపాజిట్ పథకంలో డిపాజిట్ పై 7.5 శాతం వడ్డీ ఉంటుంది. ఏదైనా మహిళ, అమ్మాయి ఖాతా ద్వారా డిపాజిట్ చేయవచ్చు. దాని నుండి డబ్బును విత్‌డ్రా చేసుకునేందుకు షరతులు ఉంటాయి. అవసరమైనప్పుడు పాక్షికంగా సొమ్మును ఉపసంహరించుకునే వెసులుబాటు కల్పించారు.

union budget 2023 live updates: పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెడుతున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. Live Updates

పార్లమెంట్ లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సార్వత్రిక బడ్జెట్ లో ఏయే వస్తువులు తక్కువ ధరకు లభిస్తున్నాయో, ఏయే వస్తువులు ఎక్కువ ఖర్చు అవుతున్నాయో కూడా చెప్పారు. మొబైల్ విడి భాగాలు, టీవీలు, ఎలక్ట్రిక్ వస్తువులు, టీవీ ప్యానెళ్లపై కస్టమ్ డ్యూటీ తగ్గింపు చేశారు. దీంతో వీటి ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది. కిచెన్ చిమ్నీలు, హీట్ కాయిల్స్, కెమెరా లెన్స్ ధరలు తగ్గనున్నాయి. బయోగ్యాస్‌కు సంబంధించిన కొన్ని విడి భాగాలపై కస్టమ్ డ్యూటీ తగ్గించబడింది.

అదేవిధంగా ఎలక్ట్రిక్ కార్లు, బొమ్మలు, సైకిళ్లు చౌకగా వస్తాయి. సింగరేట్ ధరలు భారీగా పెరిగాయి. వీటిపై సుంకం 16శాతంకి పెంపు చేశారు. బ్రాండెడ్ దుస్తుల ధరలు పెరగనున్నాయి. వాహనాలు టైర్లు, విదేశాల నుంచి దిగుమతి అయ్యే రబ్బరు ధరలు పెరగనున్నాయి. బంగారం, వెండి ధరల విషయానికి వస్తే.. బంగారం, వెండి ధరలపై కస్టమ్స్‌ డ్యూటీ పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు.

ట్రెండింగ్ వార్తలు