Viral Video: తరగతి గదిలోనే ఫైటింగ్ చేసుకున్న ఇద్దరు టీచర్లు.. ఎందుకంటే?
బట్టలు చిరిగేలా వారు కొట్టుకున్న తీరు ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మర్యాదగా నడుచుకోవాలని..
- T Venkateshwarlu
- Published On : May 3, 2024 / 05:23 PM IST
పాఠశాలకు ఆలస్యంగా వెళ్తే విద్యార్థులను ఉపాధ్యాయులు కొట్టడం సాధారణమే. మరి ఉపాధ్యాయులు ఆలస్యంగా వస్తే? చాలా చోట్ల వారిని మాత్రం ఎవరూ ఏమీ అనరు. ఆగ్రాలోని ఓ స్కూల్లో మాత్రం ఇటువంటి ఘటన చోటుచేసుకుంటే పరిస్థితులు హింసాత్మకంగా మారతాయనేలా ఇద్దరు టీచర్లు కొట్టుకున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆగ్రాలోని ఓ ప్రాథమిక పాఠశాలలోకి ఉపాధ్యాయురాలు ఆలస్యంగా వచ్చారు. ఎందుకు ఆలస్యమైందంటూ ఆమెను ప్రధానోపాధ్యాయురాలు నిలదీశారు. దీంతో ఆ ఇద్దరి మధ్య ఫైటింగ్ జరిగింది. బట్టలు చిరిగేలా వారు కొట్టుకున్న తీరు ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
మర్యాదగా నడుచుకోవాలని ఒకరికొకరు బుద్ధులు చెప్పుకుంటూనే ఆ ఇద్దరు టీచర్లు కొట్టుకున్నారు. దీంతో ఇతర టీచర్లు వచ్చి ఆ ఫైటింగ్ ను ఆపేందుకు ఎంతగా ప్రయత్నించినా వారు ఆపలేదు. గొడవ పడ్డ ఆ ఇద్దరు టీచర్లను విడిపించడం అక్కడున్న ఇతర టీచర్లు ఎవరికీ సాధ్యం కాలేదు.
మధ్యలో వచ్చిన వారిని కూడా చితకబాదతాం అన్నట్లు వ్యవహరించారు. ఆ సమయంలో తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. టీచర్‌కి గాయాలైనట్లు తెలుస్తోంది. టీచర్ పై ప్రిన్సిపాల్ మేడం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
स्कूल में लेट आने पर महिला टीचर और स्कूल प्रिंसिपल में के बीच हुई मारपीट.
वीडियो सोशल मीडिया पर वायरल.
थाना सिकंदरा क्षेत्र के सीगना गांव के पूर्व माध्यमिक स्कूल का मामला. महिला टीचर हुई घायल,प्रधानाध्यापिका ने ही टीचर के खिलाफ दी तहरीर . #Agra @agrapolice pic.twitter.com/egjKgqBnj9— Journalist Harikant sharma (@harikantsharmaG) May 3, 2024
Also Read : టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి చేదు అనుభవం.. తిరగబడిన మహిళలు, ఎందుకంటే..
