Gorantla Butchaih Chowdary : టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి చేదు అనుభవం.. తిరగబడిన మహిళలు, ఎందుకంటే..

తమను చెప్పుతో కొడతానని బుచ్చయ్య చౌదరి బెదిరిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారని మహిళలు ఆరోపిస్తున్నారు.

Gorantla Butchaih Chowdary : టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి చేదు అనుభవం.. తిరగబడిన మహిళలు, ఎందుకంటే..

Gorantla Butchaih Chowdary : రాజమండ్రి రూరల్ టీడీపీ సిట్టింగ్ అభ్యర్థి, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి నిరసన సెగ తగిలింది. ఇవాళ 27వ వార్డులో ప్రచారం చేస్తుండగా.. స్థానికులు తిరగబడ్డారు. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి తమ వార్డును పట్టించుకోలేదని, అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని మహిళలు నిరసన తెలిపారు.

దీంతో ఎమ్మెల్యే గోరంట్ల, మహిళలకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో తమను చెప్పుతో కొడతానని బుచ్చయ్య చౌదరి బెదిరిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారని మహిళలు ఆరోపిస్తున్నారు. ఇదే అంశంపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయనున్నట్లు మహిళలు తెలిపారు.

టీడీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ ఉదయం 10 గంటల సమయంలో 27వ వార్డుకు వెళ్లారు. అక్కడ ప్రచారం చేస్తున్న సమయంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరికి నిరసన సెగ తగిలింది. మహిళలు నిరసనకు దిగారు. బుచ్చయ్య చౌదరి ఎమ్మెల్యేగా గెలిచాక.. ఐదేళ్ల కాలంలో ఒక్కసారిగా ఈ వార్డులోకి తొంగి చూడలేదని, ఒక్కసారి కూడా వార్డుకు రాలేదని, వార్డులో ఏం జరుగుతోంది? మౌలిక వసతులు ఉన్నాయా? లేదా? మంచి నీరు అందుతోందా? లేదా? డ్రైనేజీ వ్యవస్థ ఏ విధంగా ఉంది?

వీటి గురించి ఎప్పుడూ వచ్చి చూసింది లేదు. కేవలం ఓట్ల కోసమే ఇప్పుడు వచ్చారని, ఇన్నాళ్లూ తమను పట్టించుకోని మీరు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారని స్థానిక మహిళలు నిలదీశారు. ఈ క్రమంలో మహిళలు, గోరంట్ల బుచ్చయ్య చౌదరికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇదే సమయంలో.. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. చెప్పుతో కొడతానని అనుచిత వ్యాఖ్యలు చేశారని మహిళలు ఆరోపిస్తున్నారు. గతంలోనూ శాటిలైట్ సిటీలో గోరంట్ల బుచ్చయ్య చౌదరిని స్థానిక మహిళలు, ప్రజలు నిలదీసిన పరిస్థితి ఉంది.

Also Read : ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌.. భూ యజమానులకు జరిగే మేలేంటి..? ప్రతిపక్షాల ప్రచారంలో నిజమెంత..?