Tata Motors: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా టాటా మోటర్స్ ప్రత్యేకమైన కస్టమర్ ఎంగేజ్‌మెంట్ ప్రోగ్రాం

టాటా ఈవీ కమ్యూనిటీకి స్నేహితులు, కుటుంబ సభ్యులను దగ్గర చేసే విధంగా వారిని మచు పిచ్చు, ఐస్‌లాండ్ వంటి అద్భుతమైన ప్రదేశాలకు క్యూ రేటెడ్ ట్రావెల్ ప్యాకేజీలు లేదా గ్రాండ్‌స్లామ్‌ లైవ్ చూసే అవకాశం వంటి బహుమతులు ఇవ్వనున్నారు.

World Environment Day: భారతదేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారు టాటా మోటార్స్ ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలను ప్రత్యేకంగా నిర్వహిస్తోంది. దేశంలో ఈవీ స్వీకరణ పెరగడానికి యజమానుల భాగస్వామ్యం కోసం టాటా ఈవీ యజ మానులందరినీ ఒకచోట చేర్చే కార్యక్రమంగా ‘ఎవాల్వ్’ని ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. ‘ఎవాల్వ్’ అనేది అనుభవపూర్వక డ్రైవ్‌లు, పెద్ద కమ్యూనిటీకి ప్రయోజనం చేకూర్చే కార్యకలాపాలు, ఎక్స్‌ క్లూజివ్ రిఫరల్ ప్రయోజనాలతో కూడిన ఎక్స్‌ ఛేంజ్, అప్‌గ్రేడ్ ప్రోగ్రామ్‌లతో సహా వివిధ కస్టమర్ ఫోకస్డ్ కార్య కలాపాలను కలిగి ఉంటుంది.

Medical Colleges: దేశంలో కొత్తగా మరో 50 వైద్య కళాశాలలకు కేంద్రం ఆమోదం

ముంబైలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ప్రారంభానికి నాయకత్వం వహించేలా టాటా మోటార్స్ నేడిక్కడ ఈ కస్టమర్ ఎంగేజ్‌మెంట్ కార్యక్రమం మొదటి దశను ప్రారంభించింది. ఇది దశలవారీగా ప్రారంభమయ్యే పరిమిత కాల రిఫరల్ ప్రోగ్రాం. టాటా ఈవీ కమ్యూనిటీకి స్నేహితులు, కుటుంబ సభ్యులను దగ్గర చేసే విధంగా వారిని మచు పిచ్చు, ఐస్‌లాండ్ వంటి అద్భుతమైన ప్రదేశాలకు క్యూ రేటెడ్ ట్రావెల్ ప్యాకేజీలు లేదా గ్రాండ్‌స్లామ్‌ లైవ్ చూసే అవకాశం వంటి బహుమతులు ఇవ్వనున్నారు. ఈ ప్రత్యేకమైన ఎంగేజ్‌మెంట్ ప్రోగ్రామ్ కంపెనీకి సంబంధించిన టాప్ 13 EV వినియోగదారు మార్కెట్‌లు/క్యాచ్‌మెంట్ ఏరియాలో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది.

ట్రెండింగ్ వార్తలు