TS Electric Vehicles : ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుదారులకు శుభవార్త!

ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు దారులకు గుడ్ న్యూస్. ఎలక్ట్రిక్ వెహికల్స్ బ్యాటరీ సామర్థ్యం అనుగుణంగా సబ్సిడీని తెలంగాణ ప్రభుత్వం ఇవ్వనుంది.

TS Electric Vehicles : ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు దారులకు గుడ్ న్యూస్. ఎలక్ట్రిక్ వెహికల్స్ బ్యాటరీ సామర్థ్యం అనుగుణంగా సబ్సిడీని తెలంగాణ ప్రభుత్వం ఇవ్వనుంది. ఈ మేరకు రాష్ట్ర పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (TSRedCo) మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌.జానయ్య పేర్కొన్నారు. ప్రతి కిలో వాట్‌కు రూ.15 వేల చొప్పున సబ్సిడీని అందించనుందని ఆయన తెలిపారు. ఎలక్ట్రికల్ వాహనాల విషయంలో ద్విచక్ర వాహనాలు, త్రీ వీలర్, ఫోర్ వీలర్ అనే వ్యత్యాసం లేదని, అన్ని రకాల ఈవీ వాహనాలకు సబ్సీడీని అందించనున్నట్టు వెల్లడించారు.

రూ.10 లక్షల విలువైన వాహనాల వరకు సబ్సిడీ అందించనున్నట్టు తెలిపారు.  ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహించే దిశగా ఈవీ వాహనాలకు సబ్సీడీ అందించేందుకు ఈ నెల 11, 12 తేదీల్లో నెక్లెస్‌ రోడ్డు లోని పీపుల్స్‌ ప్లాజాలో ‘Go Electric’ పేరుతో రోడ్‌ షో నిర్వహించనున్నామని తెలిపారు. రూ.50 వేల నుంచి రూ.2 లక్షల విలువైన టూ వీలర్స్, రూ.2.50 లక్షల దగ్గర నుంచి రూ.3 లక్షల విలువైన ఆటోలు, అలాగే రూ.8 లక్షల నుంచి రూ.30 లక్షల విలువ చేసే ఎలక్ట్రిక్ కార్లు ఈ రోడ్‌ షోలో ప్రదర్శనకు ఉంచనున్నట్టు వెల్లడించారు. ఈ షోకేస్‌లో 60 వరకు ఈవీ స్టాల్స్, చార్జింగ్‌ పాయింట్లు కూడా ప్రదర్శనలో ఉంచనున్నట్టు జానయ్య తెలిపారు.

కాలుష్య నివారించడమే ప్రధానంగా ముందుకు సాగుతున్నట్టు తెలిపారు. నగరంలో 15 ఏళ్లు నిండిన ఆటోలను రెట్రోఫిట్‌మెంట్‌ ద్వారా బ్యాటరీలతో నడిచేలా తీర్చిదిద్దనున్నట్టు చెప్పారు. హైదరాబాద్‌లోని ప్రభుత్వ కార్యాలయాల్లో 65 చార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. నగరంలో మరో 118 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు, వరంగల్‌, కరీంనగర్ పట్టణాల్లో కూడా 10 వరకు చార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. పెట్రోల్‌ బంకుల్లో చార్జింగ్‌ స్టేషన్లపై కూడా ఏర్పాటు చేసేలా ఒప్పందం చేసుకున్నట్టు జానయ్య పేర్కొన్నారు.

Read Also : Oppo Find N : ఒప్పో ఫస్ట్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది.. డిసెంబర్ 15న లాంచ్!

ట్రెండింగ్ వార్తలు