Motorola Edge 50 Ultra : మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా ఫోన్ చూశారా? ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర ఎంతో తెలుసా?

Motorola Edge 50 Ultra Launch : మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా ఫోన్ 125W టర్బోపవర్ ఛార్జింగ్, 50డబ్ల్యూ వైర్‌లెస్ ఛార్జింగ్, 10డబ్ల్యూ రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 4,500mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది.

Motorola Edge 50 Ultra : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా ఫోన్ వచ్చేసింది. కంపెనీ ఎడ్జ్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లలో టాప్-ఆఫ్-ది-లైన్ మోడల్‌గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జనరేషన్ 3 చిప్‌సెట్‌పై రన్ అవుతుంది.

144హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల పీఓఎల్డీ స్క్రీన్‌ను కలిగి ఉంది. 3ఎక్స్ ఆప్టికల్ జూమ్‌తో 64ఎంపీ టెలిఫోటోను ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. 4,500ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. 125డబ్ల్యూ వైర్డ్ ఛార్జింగ్, 50డబ్ల్యూ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇవ్వగలదు. ఐపీ68 రేటింగ్‌ను కలిగి ఉందని కంపెనీ తెలిపింది.

Read Also : Vivo X Fold 3 Pro : వివో ఎక్స్ ఫోల్డ్ ప్రో సేల్ మొదలైందోచ్.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ఈ మడతబెట్టే ఫోన్ ధర ఎంతో తెలుసా?

భారత్‌లో మోటోరోలా 50 అల్ట్రా ధర :
భారత మార్కెట్లో మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా ఫోన్ ధర రూ. 59,999, ఈ హ్యాండ్‌సెట్ 12జీబీ+512జీబీ ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లో అందుబాటులో ఉంది. కంపెనీ వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా డార్కెస్ట్ స్ప్రూస్, పీచ్ ఫజ్, షీర్ బ్లిస్ కలర్ ఆప్షన్‌లలో విక్రయానికి వస్తుంది. పరిచయ ఆఫర్‌లో భాగంగా మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా ఫోన్ డిస్కౌంట్ ధర రూ. 49,999, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్ లావాదేవీలపై 5వేల ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు.

మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
డ్యూయల్ సిమ్ (నానో) మోటరోలా ఎడ్జ్ 50 అల్ట్రా కంపెనీ కొత్త యూఐతో పాటు ఆండ్రాయిడ్ 14లో రన్ అవుతుంది. 6.7-అంగుళాల 1.5కె (1,220×2,712 పిక్సెల్‌లు) ఎల్‌టీపీఎస్ పోల్డ్ స్క్రీన్‌తో హెచ్ఎ 144Hz రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్, హెచ్‌డీఆర్10+ కంటెంట్‌కు సపోర్టు, గరిష్టంగా 2500నిట్స్ వరకు బ్రైట్‌నెస్‌ని కలిగి ఉంది. మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా 12జీబీ ఫోన్ ఎల్‌పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్‌తో ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జనరేషన్ 3 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది.

మీరు 512జీబీ యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్‌ని పొందుతారు. ఫోటోలు, వీడియోలకు మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రాలో ఎఎఫ్/1.6 ఎపర్చరు, ఓమ్ని-డైరెక్షనల్ ఫేజ్ డిటెక్షన్ ఆటోఫోకస్ (PDAF), ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో కూడిన 50ఎంపీ ప్రైమరీ కెమెరాతో వస్తుంది. 122-డిగ్రీ ఫీల్డ్-ఆఫ్-వ్యూ, ఎఫ్/2.0 ఎపర్చర్‌తో కూడిన 50ఎంపీ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, అలాగే 3ఎక్స్ ఆప్టికల్ జూమ్, ఎఫ్/2.4 ఎపర్చర్‌తో కూడిన 64ఎంపీ టెలిఫోటో కెమెరాను కూడా కలిగి ఉంది. ఫ్రంట్ సైడ్ 50ఎంపీ కెమెరాను కలిగి ఉంది. వీడియో కాల్స్, సెల్ఫీలను క్యాప్చర్ చేసేందుకు ఉపయోగించవచ్చు.

మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా ఫోన్ కనెక్టివిటీ ఆప్షన్లలో 5జీ, 4జీ ఎల్‌టీఈ, వై-ఫై6, బ్లూటూత్ 5.4, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఈ హ్యాండ్‌సెట్‌లోని సెన్సార్‌లలో యాక్సిలరోమీటర్, గైరోస్కోప్, యాంబియంట్ లైట్ సెన్సార్, కంపాస్, అలాగే యాంబియంట్ లైట్, ప్రాక్సిమిటీ సెన్సార్‌లు ఉన్నాయి. బయోమెట్రిక్ అథెంటికేషన్ కోసం మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రాలో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంటుంది. ఫేస్ అన్‌లాకింగ్ ఫీచర్‌కు సపోర్టును కూడా అందిస్తుంది. కంపెనీ మోటో సెక్యూర్, థింక్‌షీల్డ్ సెక్యూరిటీ ఫీచర్‌లతో వస్తుంది.

మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా ఫోన్ 125W టర్బోపవర్ ఛార్జింగ్, 50డబ్ల్యూ వైర్‌లెస్ ఛార్జింగ్, 10డబ్ల్యూ రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 4,500mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. ఈ మోటోరోలా హ్యాండ్‌సెట్ ఒక్కసారి ఛార్జ్‌పై 40 గంటల బ్యాటరీ లైఫ్ అందిస్తుందని పేర్కొంది. ఈ హ్యాండ్‌సెట్ దుమ్ము, నీటి నిరోధకతకు ఐపీ68 రేటింగ్‌ను కలిగి ఉంది. 161.09x 72.38 x 8.59ఎమ్ఎమ్, బరువు 197 గ్రాములు ఉంటుంది.

Read Also : WhatsApp New Update : వాట్సాప్‌లో అదిరే అప్‌డేట్.. ఫొటోలు, వీడియోలకు హైక్వాలిటీ ఆప్షన్లు.. చెక్ చేసుకున్నారా?

ట్రెండింగ్ వార్తలు