Elon Musk : భవిష్యత్తులో ఇక ఫోన్‌లు ఉండవు.. కేవలం న్యూరాలింక్‌లు మాత్రమే.. ఎలన్ మస్క్

Elon Musk : న్యూరాలింక్ చీఫ్ రాబోయే రోజుల ఫోన్ల మనుగడపై కూడా ఆసక్తికర కామెంట్స్ చేశారు. భవిష్యత్తులో ఎలాంటి ఫోన్‌లు ఉండవని, కానీ న్యూరాలింక్ మాత్రమే ప్రపంచాన్ని ఆధిపత్యం చెలాయిస్తాయని మస్క్ పేర్కొన్నారు.

Elon Musk : ప్రముఖ టెస్లా, స్పేస్ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ న్యూరాలింక్ మెదడు చిప్‌ను మొదటిసారిగా మానవునికి ఈ ఏడాది జనవరిలో విజయవంతంగా అమర్చారు. ఈ బ్రెయిన్ చిప్‌ని అందుకున్న 29 ఏళ్ల వ్యక్తి.. ప్రమాదం తర్వాత పక్షవాతంతో మంచానికే పరిమితమయ్యాడు. నోలాండ్ అర్బాగ్ అనే వ్యక్తికి జనవరి 28న బ్రెయిన్ చిప్‌ని అమర్చారు.

Read Also : Neuralink : న్యూరాలింక్ ప్రయోగంలో మరో ముందడుగు.. బ్రెయిన్ చిప్ వ్యక్తి ఆలోచనలతో కంప్యూటర్ మౌస్ కంట్రోల్ చేయగలడు : ఎలన్ మస్క్

రెండు రోజుల శస్త్రచికిత్స తర్వాత అతను కోలుకుంటున్నట్లు మస్క్ తెలిపారు. అర్బాగ్ శస్త్రచికిత్స 100 రోజులు పూర్తి అయిన సందర్భంగా న్యూరాలింక్ అతడి ఆరోగ్య పరిస్థితి గురించి వివరణాత్మక నివేదికను ప్రపంచ బిలియనీర్ షేర్ చేశారు. తాజాగా న్యూరాలింక్ చీఫ్ రాబోయే రోజుల ఫోన్ల మనుగడపై కూడా ఆసక్తికర కామెంట్స్ చేశారు. భవిష్యత్తులో ఎలాంటి ఫోన్‌లు ఉండవని, కానీ న్యూరాలింక్ మాత్రమే ప్రపంచాన్ని ఆధిపత్యం చెలాయిస్తాయని మస్క్ పేర్కొన్నారు.

తన ట్విట్టర్ (X) అకౌంట్లో మస్క్ స్పందిస్తూ.. “భవిష్యత్తులో ఫోన్‌లు ఉండవు. కేవలం న్యూరాలింక్‌లు మాత్రమే’’ అని పోస్టు చేశారు. ఈ సందర్భంగా మస్క్ తన చేతిలో ఫోన్ పట్టుకుని ఉన్న ఫొటోను న్యూరాలింక్ షేర్ చేసింది. ఆ ఫొటోలో మస్క్ నుదిటిపై న్యూరల్ నెట్‌వర్క్ లాంటి డిజైన్‌ను సూచిస్తుంది. చూస్తుంటే.. అదంతా ఏఐ టెక్నాలజీ ఉపయోగించి రూపొందించినట్టుగా కనిపిస్తోంది.

మీ ఆలోచనలతో కొత్త ‘ఎక్స్’ ఫోన్‌ని కంట్రోల్ చేసేందుకు మీ మెదడుపై న్యూరాలింక్ ఇంటర్‌ఫేస్‌ను ఇన్‌స్టాల్ చేస్తారా?” అని యూజర్ ఫొటోకు క్యాప్షన్ పెట్టారు. మరోవైపు.. న్యూరాలింక్ తమ సూపర్ కంప్యూటర్‌తో పాటు ఫోన్‌ను వారి మనస్సుతో కంట్రోల్ చేసేలా మెదడు చిప్‌ను అమర్చేందుకు రెండో పార్టిసిపెంట్ కోసం వెతుకుతోంది.

ఇప్పటికే “న్యూరాలింక్ రెండో పార్టిసిపెంట్ కోసం దరఖాస్తులను స్వీకరిస్తోంది. మా టెలిపతి సైబర్‌నెటిక్ బ్రెయిన్ ఇంప్లాంట్. ఇది కేవలం ఆలోచించడం ద్వారా మీ ఫోన్, కంప్యూటర్‌ను కంట్రోల్ చేసేందుకు మిమ్మల్ని అనుమతిస్తుంది. ఈ విషయం గురించి మీకు చెప్పడానికి నోలాండ్ (@ModdedQuad) కన్నా ఎవరూ లేరు” అని మస్క్ రాశారు.

అంతకుముందు ఒక ట్వీట్‌లో.. న్యూరాలింక్ తన మొదటి రోగి వీడియోను ఎక్స్‌లో షేర్ చేశామని, తమ క్లినికల్ ట్రయల్స్ కోసం పాల్గొనేవారి కోసం చూస్తున్నారని మస్క్ క్యాప్షన్‌లో పేర్కొన్నారు. “మానవ సామర్థ్యం, సరిహద్దులను పునర్నిర్వచించటానికి మార్గదర్శకులు అవసరం. మీకు క్వాడ్రిప్లెజియా ఉంటే.. మీ కంప్యూటర్‌ను కంట్రోల్ చేసే కొత్త మార్గాలను అన్వేషించవచ్చు. మా క్లినికల్ ట్రయల్‌లో పాల్గొనమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము” అని కంపెనీ ట్వీట్ చేసింది.

Read Also : Elon Musk : ఈవీఎంలతో హ్యాకింగ్ రిస్క్.. ఎలన్ మస్క్‌ హెచ్చరిక.. బీజేపీ నేత రియాక్షన్ ఇదే!

ట్రెండింగ్ వార్తలు