Neuralink : న్యూరాలింక్ ప్రయోగంలో మరో ముందడుగు.. బ్రెయిన్ చిప్ వ్యక్తి ఆలోచనలతో కంప్యూటర్ మౌస్ కంట్రోల్ చేయగలడు : ఎలన్ మస్క్

Neuralink Implant : న్యూరాలింక్ తొలి మానవుడికి బ్రెయిన్ చిప్ అమర్చిన ప్రయోగం సానుకూల ఫలితాలను ఇస్తోందని ఎలన్ మస్క్ వెల్లడించారు. ఇప్పుడా వ్యక్తి తన ఆలోచనలతో కంప్యూటర్ మౌస్‌ను కంట్రోల్ చేయగలడని మస్క్ ప్రకటించారు.

Neuralink : న్యూరాలింక్ ప్రయోగంలో మరో ముందడుగు.. బ్రెయిన్ చిప్ వ్యక్తి ఆలోచనలతో కంప్యూటర్ మౌస్ కంట్రోల్ చేయగలడు : ఎలన్ మస్క్

Elon Musk says the first human with Neuralink implant is now able to control a mouse with his mind

Neuralink Implant : మనిషి మెదడులో బ్రెయిన్ చిప్ అమర్చిన న్యూరోటెక్నాలజీ స్టార్టప్ న్యూరాలింక్ ప్రయోగంలో మరో ముందడుగు పడింది. అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లలో ఒకటైన న్యూరాలింక్‌ ఇంటర్‌ఫేస్ చిప్ ప్రయోగం విజయంవంతం కావడంపై ప్రపంచ బిలియనీర్, న్యూరాలింక్ సహ వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ హర్షం వ్యక్తం చేశారు. బ్రెయిన్ చిప్ ప్రయోగం సానుకూల ఫలితాలను ఇస్తోందని ఆయన ప్రకటించారు. గత నెలలో న్యూరాలింక్ బ్రెయిన్ చిప్ ఇంప్లాంట్ పొందిన మొదటి రోగి పూర్తిగా కోలుకున్నాడని ప్రకటించిన మస్క్.. ఇప్పుడు ఆ వ్యక్తి తన ఆలోచనలతో కంప్యూటర్ మౌస్‌ను కంట్రల్ చేయగలడని వెల్లడించారు. ‘ప్రస్తుతం అంతా బాగానే ఉంది. చిప్ అమర్చిన వ్యక్తి పూర్తిగా కోలుకున్నాడు.

Read Also : Breast Cancer Saliva Test : నోటి లాలాజలం చుక్క వేస్తే చాలు.. ఐదు సెకన్లలో బ్రెస్ట్ క్యాన్సర్‌ను పసిగట్టేస్తుందట..!

అతడిలో ఎలాంటి ప్రతికూల నాడీ ప్రభావాలు కనిపించడం లేదు. ఆ వ్యక్తి కేవలం తన ఆలోచనల ద్వారా కంప్యూటర్ స్క్రీన్ చుట్టూ మౌస్ కదిలించగలిగాడని సోషల్ మీడియాలో స్పేస్‌ ఈవెంట్‌లో మస్క్ ప్రకటించారు. న్యూరాలింక్ ప్రయోగం విజయవంతమైన సమయంలో మస్క్ న్యూరాలింక్‌కు మరిన్ని పెద్ద లక్ష్యాలు ఉన్నాయి’ అని వెల్లడించారు.

బ్రెయిన్ చిప్ వ్యక్తి తన ఆలోచనలతో మౌస్ బటన్‌లను కంట్రోల్ చేయడం అనేది మరింత సంక్లిష్టమైన చర్యగా పేర్కొన్నారు. అంతకుముందు, జనవరిలో మస్క్ మొదటి మానవుడికి బ్రెయిన్ చిప్‌ను విజయవంతంగా అమర్చినట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. కంపెనీ గత ఏడాది సెప్టెంబర్‌లో హ్యూమన్ ట్రయల్స్ కోసం ఆమోదం పొందింది. అయితే, బ్రెయిన్ చిప్ అమర్చిన వ్యక్తికి సంబంధించి వివరాలను మస్క్ వెల్లడించలేదు.

న్యూరాలింక్ మొదటి లక్ష్యం ఇదే :
న్యూరాలింక్ ప్రయోగానికి ఎంచుకున్న మొదటి వ్యక్తి.. లౌ గెహ్రిగ్స్ డిసీజ్‌గా పిలిచే క్వాడ్రిప్లెజియాతో బాధపడుతున్నాడని కంపెనీ పేర్కొంది. ఈ అధ్యయనంలో మెదడులోని ఒక ప్రాంతంలో మెదడు-కంప్యూటర్ ఇంటర్‌ఫేస్ అమర్చుతారు. ఇందుకోసం న్యూరాలింక్ రోబోట్‌తో శస్త్రచికిత్స చేస్తారు.

న్యూరాలింక్ ప్రకారం.. బ్రెయిన్ చిప్ అమర్చిన వ్యక్తి ఆలోచనలను ఉపయోగించి కంప్యూటర్ కర్సర్ లేదా కీబోర్డ్‌ను కంట్రోల్ చేయడమే ప్రయోగంలో మొదటి లక్ష్యం. అంతేకాదు.. ఊబకాయం, ఆటిజం, డిప్రెషన్, స్కిజోఫ్రెనియా వంటి అనారోగ్య సమస్యలకు చికిత్స చేయడానికి చిప్ పరికరాల ద్వారా వేగవంతమైన శస్త్రచికిత్స అందించడమే మస్క్ కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

Elon Musk says the first human with Neuralink implant is now able to control a mouse with his mind

Elon Musk Neuralink implant

న్యూరాలింక్ అంటే ఏంటి? :
2016లో ఎలన్ మస్క్ న్యూరోటెక్నాలజీ సంస్థ స్థాపించారు. మస్క్ కంపెనీ బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్‌ఫేస్ (BCI)ని సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి ‘ది లింక్’ అని కూడా పేరు పెట్టింది. ఈ టెక్నాలజీతో నరాల సంబంధిత రుగ్మతలు ఉన్న వ్యక్తులు వారి ఆలోచనలతో ఎలక్ట్రానిక్ డివైజ్‌లపై కంట్రోల్ చేయలగరు. ఇక్కడ డివైజ్ అంటే ‘ది లింక్’ అనేది నాణెం పరిమాణంలో ఉంటుంది. దీన్ని శస్త్రచికిత్స ద్వారా మనిషి మెదడులో చిప్ అమర్చుతారు.

చాలా సన్నని వైర్‌లతో నేరుగా నిర్దిష్ట మెదడు ప్రాంతాలకు కనెక్ట్ చేస్తుంది. ముఖ్యంగా, నాడీ కార్యకలాపాలను డీకోడ్ చేయడం, ప్రేరేపించడం, ఆలోచనలతో నియంత్రించడం వంటివి ఉంటాయి. న్యూరాలింక్ ప్రయోగం ప్రారంభంలో ‘టెలిపతి’ వినియోగదారులను వారి ఆలోచనలతో నేరుగా ఫోన్‌లు, కంప్యూటర్‌లను కంట్రోల్ చేయడమే కంపెనీ లక్ష్యం. అంతేకాదు.. నరాల సంబంధిత రుగ్మతలకు చికిత్స చేయడంలో ఈ ప్రయోగం అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని కంపెనీ భావిస్తోంది.

Read Also : మనిషి మెదడులో ఎలక్ట్రానిక్ చిప్ అమర్చిన న్యూరాలింక్.. ఈ డివైజ్ ఎలా పనిచేస్తుంది? మస్క్ ఏమన్నారంటే?