మనిషి మెదడులో ఎలక్ట్రానిక్ చిప్ అమర్చిన న్యూరాలింక్.. ఈ డివైజ్ ఎలా పనిచేస్తుంది? మస్క్ ఏమన్నారంటే?
Neuralink implant : మనిషి మెదడులో ఎలక్ట్రానిక్ చిప్ అమర్చే ప్రయోగం విజయవంతమైంది. న్యూరాలింక్ ఇంప్లాంట్‌ను స్వీకరించిన మొదటి వ్యక్తి బాగా కోలుకుంటున్నాడని న్యూరాలింక్ అధినేత ఎలన్ మస్క్ ధృవీకరించారు.

First human to receive Neuralink implant is recovering well, Elon Musk confirms
Neuralink implant : మనిషి మెదడులో ఎలక్ట్రానిక్ చిప్ ప్రయోగం ఫలించింది. న్యూరోటెక్నాలజీ స్టార్టప్ అయిన న్యూరాలింక్ మొదటి వ్యక్తి మెదడులో ఇంటర్‌ఫేస్ చిప్ విజయవంతంగా అమర్చింది. ఈ విషయాన్ని న్యూరాలింక్ సహ వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ మంగళవారం (జనవరి 30) ఒక ప్రకటనలో వెల్లడించారు. మానవ మెదడు, కంప్యూటర్‌ల మధ్య ప్రత్యక్ష కమ్యూనికేషన్ మార్గాలను స్థాపించే మిషన్‌లో గణనీయమైన ముందడుగు వేసినట్లు ఆయన ప్రకటించారు. 2016లో ఈ మిషన్ ప్రక్రియ ప్రారంభ ఫలితాల గురించి మస్క్ ఆశావాదాన్ని వ్యక్తం చేశారు. అయితే, న్యూరాలింక్ ప్రయోగం విజయవంతం కావడం మానవ-కంప్యూటర్ కమ్యూనికేషన్‌లో పెద్ద పురోగతిని సూచిస్తోంది.
చిప్ అమర్చిన వ్యక్తి కోలుకుంటున్నాడు : మస్క్
ఈ సందర్భంగా మస్క్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. మొదటి వ్యక్తికి న్యూరాలింక్ నుంచి ఎలక్ట్రానిక్ చిప్ అమర్చడం జరిగింది. ప్రస్తుతం అతడు బాగా కోలుకుంటున్నాడు’ అని మస్క్ (X) వేదికగా పోస్ట్‌లో ధ్రువీకరించారు. ప్రారంభ ఫలితాలు ఆశాజనకమైన ఉన్నాయని, తద్వారా న్యూరాన్ స్పైక్ డిటెక్షన్‌ను కలిగి ఉన్నాయని గుర్తించినట్టు తెలిపారు. మానవ సామర్థ్యాలను పెంపొందించడం, (ALS) లేదా పార్కిన్సన్స్ వంటి నాడీ సంబంధిత రుగ్మతలను పరిష్కరించడంతో పాటు చివరికి మనుషులు, కృత్రిమ మేధస్సు మధ్య సినర్జిస్టిక్ సంబంధాన్ని సృష్టించడం న్యూరాలింక్ విస్తృత లక్ష్యమని ఆయన అన్నారు.
The first human received an implant from @Neuralink yesterday and is recovering well.
Initial results show promising neuron spike detection.
— Elon Musk (@elonmusk) January 29, 2024
లింక్ డివైజ్ 5 నాణేలతో సమానం :
గత ఏడాదిలో న్యూరాలింక్ మెదడు ఇంప్లాంట్ ప్రయోగాన్ని ప్రారంభించడానికి అమెరికా రెగ్యులేటర్ల నుంచి అనుమతి పొందింది. ఈ ప్రయోగంలో టెక్నికల్‌గా లింక్ అని పిలిచే డివైజ్‌ను ఉపయోగించారు. ఈ లింక్ డివైజ్ పరిమాణంలో పేర్చబడిన ఐదు నాణేలతో సమానంగా ఉంటుంది. ఈ ఎలక్ట్రానిక్ చిప్‌ను శస్త్రచికిత్స ద్వారా మానవ మెదడు లోపల ఇన్వాసివ్ ప్రక్రియ ద్వారా అమర్చుతారు. డేటా కంపెనీ పిచ్‌బుక్ ప్రకారం.. కాలిఫోర్నియాలో ఉన్న న్యూరాలింక్ గత ఏడాదిలో 400 మంది ఉద్యోగులను కలిగి ఉంది. ఈ ప్రయోగానికి కనీసం 363 మిలియన్ డాలర్ల నిధులను పొందింది.
చిప్ ఎలా పనిచేస్తుంది? :
న్యూరాలింక్ చిప్ ప్రయోగం ఇదివరకే కోతులు, పందులలో విజయవంతంగా పరీక్షించడం జరిగింది. ఈ డివైజ్ చాలా సేఫ్ అని కంపెనీ నిపుణులు సైతం వెల్లడించారు. ఈ చిప్ ద్వారా కోతి కూడా పాంగ్ అనే వీడియో గేమ్ కూడా ఆడింది. బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ ఫేస్‌లో 8 మిల్లీమీటర్ల వ్యాసంతో N1 అనే చిప్ అమర్చుతారు. ఇందులో సన్నగా ఉండే ఎలక్ట్రోడ్లు కూడా ఉంటాయి. హెయిర్‌తో పోలిస్తే.. ఈ ఎలక్ట్రోడ్లు 20వ వంతు మందంగా ఉంటాయి. మెదడులో ఈ డివైజ్ అమర్చడానికి ముందుగా పుర్రెలో చిన్నపాటి భాగాన్ని కత్తిరించి అక్కడ N1 అనే టూల్ ఫిక్స్ చేస్తారు. అంతేకాదు.. సన్నటి ఎలక్ట్రోడ్లు కలిగిన చిప్‌ను మెదడులోకి మెల్లగా చొప్పిస్తారు.

First human Neuralink implant
ఈ చిప్‌లో 3వేలకు పైగా ఎలక్ట్రోడ్లు ఉంటాయి. మెదడులో ముఖ్యమైన భాగాలకు దగ్గరగా ఎలక్ట్రోడ్లను పంపుతారు. వాస్తవానికి ఇవి చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి. ఎటు అంటే అటు సులభంగా వంగే విధంగా ఉంటాయి. ఇలా అమర్చిన ఎలక్ట్రోడ్లు.. మెదడులోని న్యూరాన్ల మధ్య ప్రసారమయ్యే సందేశాలను గుర్తించి ఆపై చిప్‌కు పంపడం జరుగుతుంది. చిప్‌లో అమర్చిన ఎలక్ట్రోడ్లు మొత్తం వెయ్యి న్యూరాన్ల వరకు వాటి చర్యలను మానిటరింగ్ చేస్తాయి. ఒక మనిషిలోకి మొత్తంగా 10 చిప్‌లను అమర్చవచ్చు. మెదడులో అమర్చిన వెంటనే చిప్.. విద్యుత్ సంకేతాలను పంపడం ప్రారంభిస్తుంది. ఆయా సంకేతాలను అల్గోరిథమ్‌గా మారుస్తాయి.
న్యూరాలింక్ మాత్రమే కాదు.. సింక్రాన్ కంపెనీ కూడా :
మెదడు-మెషిన్ ఇంటర్‌ఫేస్ పరిశోధన అభివృద్ధి చెందుతున్న తరుణంలో న్యూరాలింక్ ప్రాజెక్టు ఎక్కువగా బయటకు వినిపిస్తోంది. కేవలం మస్క్ న్యూరాలింక్ మాత్రమే కాదు.. కొన్ని ఇతర కంపెనీలు కూడా ఇదే ప్రయోగాలను నిర్వహిస్తున్నాయి. మస్క్ న్యూరాలింక్ ప్రాజెక్టులో పెట్టుబడి కోసం ఆస్ట్రేలియాకు చెందిన కంపెనీ ఇంప్లాంట్ డెవలపర్ సింక్రోన్ నుంచి సహకారాన్ని పొందింది.
జూలై 2022లో అమెరికా చెందిన వ్యక్తికి తన మొదటి డివైజ్ అమర్చడం ద్వారా ఒక మైలురాయిని సాధించింది. అయితే, న్యూరాలింక్ లింక్ మాదిరిగా ఈ కంపెనీ చిప్ అమర్చడానికి పుర్రెలో భాగాన్ని కత్తిరించాల్సిన అవసరం లేదని సింక్రాన్ పేర్కొంది. మెదడు-కంప్యూటర్ ఇంటర్‌ఫేస్‌ల సామర్థ్యాన్ని అన్‌లాక్ చేయాలనే తపనతో న్యూరాలింక్ చేసిన ప్రయోగం విజయవంతం కావడంతో మస్క్ కూడా హర్షం వ్యక్తం చేశారు.