Airtel Cheapest Plans : ఎయిర్‌టెల్ యూజర్లకు పండగే.. చీపెస్ట్ 2 బడ్జెట్-ఫ్రెండ్లీ రీఛార్జ్ ప్లాన్లు.. 20కిపైగా OTT యాప్స్ ఫ్రీగా చూడొచ్చు..

Airtel Cheapest Plans : ఎయిర్‌టెల్ 2 చౌకైన ధరకే 28 రోజుల ప్లాన్లను అందిస్తోంది. వినియోగదారులకు 20కి పైగా OTT యాప్స్ ఫ్రీగా యాక్సెస్‌ అందిస్తోంది. పూర్తి వివరాలివే..

Airtel Cheapest Plans : ఎయిర్‌టెల్ యూజర్లకు పండగే.. చీపెస్ట్ 2 బడ్జెట్-ఫ్రెండ్లీ రీఛార్జ్ ప్లాన్లు.. 20కిపైగా OTT యాప్స్ ఫ్రీగా చూడొచ్చు..

Airtel Cheapest Plans

Updated On : November 9, 2025 / 4:06 PM IST

Airtel Cheapest Plans : ఎయిర్‌టెల్ యూజర్లకు గుడ్ న్యూస్.. కస్టమర్ల కోసం ఎయిర్‌టెల్ బడ్జెట్-ఫ్రెండ్లీ రీఛార్జ్ ప్లాన్లను అందిస్తోంది. అన్‌లిమిటెడ్ కాల్స్, డేటా, ఫ్రీ టెక్స్ట్ మెసేజ్ వంటి అనేక బెనిఫిట్స్ కూడా అందిస్తుంది. ఎయిర్‌టెల్ ప్రస్తుతం 28 రోజుల వ్యాలిడిటీతో రెండు సరసమైన ప్లాన్‌లను అందిస్తోంది.

ఈ ప్లాన్‌లు యూజర్లు సోనీలైవ్, జీ5 వంటి పాపులర్ (Airtel Cheapest Plans) ఓటీటీతో సహా 20 కన్నా ఎక్కువ స్ట్రీమింగ్ యాప్స్ ఉచితంగా అందిస్తుంది. ఈ యాప్‌లతో లేటెస్ట్ వెబ్ సిరీస్, మహారాణి 4, పాపులర్ షో, ఇండియన్ ఐడల్‌తో సహా వైడ్ రేంజ్ షోలు, సినిమాలను వీక్షించవచ్చు.

ఈ రెండు బడ్జెట్-ఫ్రెండ్లీ ఎయిర్‌టెల్ ప్లాన్‌ల వివరాలివే :

ఎయిర్‌టెల్ రూ.349 ప్లాన్ :
సరసమైన ఎయిర్‌టెల్ రీఛార్జ్ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీ
కాలింగ్, SMS : వినియోగదారులు దేశవ్యాప్తంగా అన్‌లిమిటెడ్ కాలింగ్, ఫ్రీ నేషనల్ రోమింగ్, రోజుకు 100 ఫ్రీ ఎస్ఎంఎస్
డేటా : ఈ ప్లాన్‌లో రోజుకు 1.5GB డేటా పొందవచ్చు.
OTT బెనిఫిట్స్ : ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్లే ప్రీమియంకు ఫ్రీ సబ్‌స్ర్కిప్షన్ , సోనీలైవ్, జీ5తో సహా 20కి పైగా OTT యాప్స్

Read Also : iPhone 16 Price : ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 16పై బిగ్ బ్లాస్టింగ్ ఆఫర్.. ఇంత చీప్‌గా ఐఫోన్ మళ్లీ దొరకదు!

ఎయిర్‌టెల్ రూ.499 ప్లాన్ :
ఈ ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది.
కాలింగ్-SMS : కంపెనీ యూజర్లకు అన్‌లిమిటెడ్ కాలింగ్, ఫ్రీ నేషనల్ రోమింగ్, ప్రతిరోజూ 100 ఫ్రీ ఎస్ఎంఎస్ అందిస్తుంది.
డేటా : ఈ ప్లాన్ రోజుకు 2.5GB హై-స్పీడ్ డేటాతో వస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌తో ఎయిర్‌టెల్ 5G స్మార్ట్‌ఫోన్ యూజర్లకు అన్‌లిమిటెడ్ 5G డేటాను అందిస్తుంది.
OTT బెనిఫిట్స్ : ఈ ప్లాన్‌తో కంపెనీ ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే ప్రీమియంకు సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది. SonyLIV, Zee5, ErosNowతో సహా 20కి పైగా OTT యాప్‌లకు ఫ్రీ యాక్సస్ పొందవచ్చు.

ఎయిర్‌టెల్ అడ్వాన్స్ 5G నెట్‌వర్క్ :
ఎయిర్‌టెల్‌ యూజర్ల కోసం కంపెనీ భారత్ అంతటా అనేక టెలికాం సర్కిల్‌లలో డ్యూయల్-ఛానల్ 5G సర్వీసును ప్రారంభిస్తోంది. ఎయిర్‌టెల్ ఇప్పుడు స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్‌ కోసం అప్‌గ్రేడ్ 5G సర్వీసును అందిస్తోంది. 2022లో 5G సర్వీసును ప్రవేశపెట్టిన ఎయిర్‌టెల్ పాత టెక్నాలజీపైనే ఆధారపడింది. కానీ, ఇప్పుడు, కొత్త 5G సర్వీసుతో ఎయిర్‌టెల్ యూజర్లకు ఈజీ బ్రౌజింగ్, స్పీడ్ డౌన్‌లోడ్‌లు, మెరుగైన కనెక్టివిటీని అందిస్తుంది.