IND vs NZ : గురువారం నుంచే భారత్ vs న్యూజిలాండ్ టీ20 సిరీస్.. జియో హాట్‌స్టార్‌లో రాదు.. మరీ ఎక్కడ చూడొచ్చొ తెలుసా?
ఇప్పుడు అందరి దృష్టి అక్టోబర్ 22 గురువారం నుంచి ప్రారంభం కానున్న భారత్, న్యూజిలాండ్ టీ20 సిరీస్ పై (IND vs NZ) పడింది.
India vs New Zealand T20 series starts from Thursday do you know where to watch
IND vs NZ : వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ ముగిసింది. ఐదో టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో 2-2తో సిరీస్ సమమైంది. ఇక ఇప్పుడు అందరి దృష్టి అక్టోబర్ 22 గురువారం నుంచి ప్రారంభం కానున్న భారత్, న్యూజిలాండ్ టీ20 సిరీస్ పై పడింది. ఐదు మ్యాచ్‌ల ఈ టీ20 సిరీస్‌ను కైవసం చేసుకోవాలని ఇరు భారత్, అటు కివీస్ జట్లు ఆరాటపడుతున్నాయి.
న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ కోసం ఇప్పటికే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. భారత ఆటగాళ్లు ఇప్పటికే న్యూజిలాండ్ విమానం ఎక్కేశారు.
భారత్, న్యూజిలాండ్ టీ20 సిరీస్ షెడ్యూల్ ఇదే..
* తొలి టీ20 మ్యాచ్ – అక్టోబర్ 22న – క్రైస్ట్‌చర్చ్
* రెండో టీ20 మ్యాచ్ – అక్టోబర్ 24న – క్రైస్ట్‌చర్చ్
* మూడో టీ20 మ్యాచ్ – అక్టోబర్ 27న – వెల్లింగ్టన్
* నాలుగో టీ20 మ్యాచ్ – అక్టోబర్ 30న – ఆక్లాండ్
* ఐదో టీ20 మ్యాచ్ – నవంబర్ 1న – హామిల్టన్
IND-W vs ZIM-W T20 : షఫాలీ వర్మ విధ్వంసం.. జింబాబ్వే చిత్తు.. 2-0తో భారత్ సిరీస్ కైవసం!
కివీస్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ఇదే..
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్), వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, శివమ్ దూబే, నితీష్ కుమార్ రెడ్డి, నమన్ ధీర్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, భువన్వేశర్ కుమార్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్.
ఎక్కడ చూడొచ్చంటే?
ఇక ఈ సిరీస్ ప్రసార హక్కులను సోనీ నెట్వర్క్ కలిగి ఉంది. ఈ క్రమంలో టీవీల్లో మ్యాచ్‌లు సోనీ స్పోర్ట్స్‌లో ప్రసారం కానున్నాయి. ఇక ఓటీటీ విషయానికి వస్తే.. సోనీ లివ్ యాప్, వెబ్సైట్లో స్ట్రీమింగ్ కానున్నాయి.
ఇక మ్యాచ్‌లు అన్నీ కూడా భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నాం 12.30 గంటలకు ప్రారంభం కానున్నాయి.
