Ragging Incident : ఇదెక్కడి ర్యాగింగ్ రా సామీ.. ఇద్దరు అబ్బాయిలకు పెండ్లి.. ఏం చెస్తున్నార్రా మీరు..!

ragging incident : జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లి జేఎన్టీయూలో ర్యాగింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. సీనియర్లు ర్యాగింగ్ పేరుతో

Ragging Incident : ఇదెక్కడి ర్యాగింగ్ రా సామీ.. ఇద్దరు అబ్బాయిలకు పెండ్లి.. ఏం చెస్తున్నార్రా మీరు..!

Ragging Incident

Updated On : November 9, 2025 / 2:39 PM IST

Ragging Incident : విద్యతో భవిష్యత్‌కు బంగారు బాటలు వేసుకోవాల్సిన విద్యార్థులు మారుతున్న కాలంలో వికృత చేష్టలకు అడ్రస్ అవుతున్నారు. కొత్తగా కాలేజీలో చేరిన విద్యార్థులను ర్యాగింగ్ పేరుతో హింసకు గురిచేస్తున్నారు. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలను తెచ్చినా ఎక్కడో అక్కడ ఈ ర్యాగింగ్ భూతం వికృతరూపం దాల్చుతోంది.

ర్యాగింగ్ భూతం ఇంకా వదల్లేదు. ర్యాగింగ్ ను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నా.. కొన్ని కాలేజీల్లో ర్యాగింగ్ భూతం వికృత రూపం దాల్చుతోంది. ర్యాగింగ్‌కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నా.. కొందరిలో మార్పు రావడం లేదు. ఇటీవల నల్గొండ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ జరిగిన ఘటన కలకలం సృష్టించింది. మొదటి సంవత్సరం వైద్య విద్యార్థులను రెండో ఏడాది చదువుతున్న సీనియర్లు ర్యాగింగ్ చేశారు. దీంతో జూనియర్ విద్యార్థులు ప్రిన్సిపల్, వార్డెన్ కు ఫిర్యాదు చేశారు. తాజాగా.. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లి జేఎన్టీయూలో ర్యాగింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.

Also Read: Revanth Reddy : ఫేక్ సర్వేలను నమ్మొద్దు.. జమిలి ఖాయం.. 2034 వరకు మాదే అధికారం

నాచుపల్లిలోని జేఎన్టీయూలో సీనియర్లు ర్యాగింగ్ పేరుతో వికృతంగా ప్రవర్తించారు. నాలుగు రోజుల క్రితం ఈ ఘటన జరిగింది. సీనియర్లు ఇంటరాక్షన్ పేరుతో జూనియర్లతో కలిసి ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ముగియడంతో లెక్చరర్లు వెళ్లిపోయారు. ఆ తరువాత కొందరు సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ పేరుతో జూనియర్లను వేధించారు. ఇద్దరు అబ్బాయిలకు పెండ్లి చేయడం, డ్యాన్సులు చేయించడంతో పాటు అసభ్యకరంగా ప్రవర్తించారు.

ఇద్దరు అబ్బాయిలకు పెండ్లి చేసిన వీడియోలు బయటకు రావడంతో ర్యాగింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదు చేస్తే ఏం చేస్తారోనన్న భయంతో జూనియర్లు సైలెంట్‌గా ఉన్నారు. ఈ ఘటనపై ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. కాలేజీలో ఎలాంటి ర్యాగింగ్ జరగలేదని చెప్పారు. ఎవరైనా ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని మాల్వాల సీఐ రవి హెచ్చరించారు.