Google Pixel 10 Price : ధర చూసి షాక్ అవ్వకండి.. గూగుల్ పిక్సెల్ 10పై కిర్రాక్ డిస్కౌంట్.. అమెజాన్‌లో ఈసారి ఫుల్ మాస్ డీల్!
Google Pixel 10 Price : కొత్త పిక్సెల్ ఫోన్ కొంటున్నారా? భారత మార్కెట్లో గూగుల్ పిక్సెల్ 10 ధర భారీగా తగ్గింది. అమెజాన్‌లో ఏకంగా రూ. 15వేలకు పైగా తగ్గింది. ఈ డీల్ మీకోసమే..
Google Pixel 10 Price
Google Pixel 10 Price : కొత్త ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. గూగుల్ పిక్సెల్ 10 అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ గూగుల్ లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్‌పై అద్భుతమైన ఆఫర్ అందిస్తోంది. ఈ సేల్ ధరను రూ. 15,500 కన్నా భారీగా తగ్గించింది. బ్రాండ్-న్యూ ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో భారీ డిస్కౌంట్లను పొందవచ్చు.
ఈ డీల్ ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు. మీ విష్ లిస్ట్‌లో పిక్సెల్ 10 ఫోన్ (Google Pixel 10 Price) ఉంటే ఇప్పుడే కొనేసుకోవచ్చు. ఇంతకీ ఈ పిక్సెల్ ఫోన్ ఫీచర్లు, ధరకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
అమెజాన్‌లో గూగుల్ పిక్సెల్ 10 డీల్ :
భారత మార్కెట్లో గూగుల్ పిక్సెల్ 10 ఫోన్ రూ. 79,999కు లాంచ్ అయింది. ప్రస్తుత ఆఫర్‌తో అమెజాన్ రూ. 11,570 నేరుగా డిస్కౌంట్ అందిస్తోంది. ధర రూ. 68,429కు తగ్గుతుంది. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజర్లు ఈఎంఐ లావాదేవీలపై అదనంగా రూ. 4వేలు డిస్కౌంట్ పొందవచ్చు. ఈ పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్ కోసం డివైజ్ వాల్యూ బట్టి ఎక్కువ సేవింగ్ చేసుకోవచ్చు. ఇందులో ఫ్లాట్ డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్ ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా పొందవచ్చు. ఈ పిక్సెల్ ఫ్లాగ్‌షిప్‌లో బెస్ట్ డీల్స్ కూడా పొందవచ్చు.
గూగుల్ పిక్సెల్ 10 స్పెసిఫికేషన్లు :
గూగుల్ పిక్సెల్ 10 ఫోన్ 6.3-అంగుళాల OLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 3,000-నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో కలిగి ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ అందిస్తుంది. హుడ్ కింద, 12GB వరకు ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజీతో గూగుల్ టెన్సర్ G5 చిప్‌సెట్ కలిగి ఉంది. స్పీడ్ మల్టీ టాస్కింగ్ ఏఐ ఆధారిత పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ ఫోన్‌లో 30W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4970mAh బ్యాటరీ కలిగి ఉంది.
ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. ఈ పిక్సెల్ ఫోన్ మాక్రో ఫోకస్‌తో 48MP ప్రైమరీ కెమెరా, 13MP అల్ట్రావైడ్ లెన్స్, 5x ఆప్టికల్ జూమ్ అందించే 10.8MP టెలిఫోటో సెన్సార్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ షార్ప్ వీడియో కాల్స్, సెల్ఫీల కోసం మీరు 10.5MP సెల్ఫీ కెమెరా పొందవచ్చు. గూగుల్ పిక్సెల్ 10 ఇండిగో, ఫ్రాస్ట్, లెమన్‌గ్రాస్ అబ్సిడియన్ కలర్ ఆప్షన్‌లలో వస్తుంది.
