Android Camera Phones : ఒక క్లిక్‌తో కిల్లింగ్ లుక్.. ఈ 6 ఆండ్రాయిడ్ కెమెరా ఫోన్లు ఆపిల్ ఐఫోన్ 17 పక్కన పెట్టేశాయ్..!

Android Camera Phones : ఐఫోన్ కొంటారా? ఆండ్రాయిడ్ ఫోన్ కొంటారా? 2025లో ఆపిల్ ఐఫోన్ 17 కన్నా బెటర్ కెమెరా ఫీచర్లతో 6 ఆండ్రాయిడ్ ఫోన్లను మీకోసం అందిస్తున్నాం..

1/7Android Camera Phones
Android Camera Phones : కొత్త ఆపిల్ ఐఫోన్ కొంటున్నారా? ప్రస్తుతం మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 17 కన్నా అద్భుతమైన ఫీచర్లతో అనేక ఆండ్రాయిడ్ కెమెరా ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్ 17 అనేది కెమెరా ఫోన్ మాదిరిగానే ఉంటుంది. కానీ, దాదాపు అదే కెమెరా ఫీచర్లతో చాలా చౌకైన ధరకే ఆరు ఆండ్రాయిడ్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు లభ్యమవుతున్నాయి. అందులో గూగుల్ పిక్సెల్ 10 నుంచి శాంసంగ్ గెలాక్సీ S25, వన్‌ప్లస్ 13, వివో X200 FE, షావోమీ 15, ఒప్పో ఫైండ్ X8 ప్రో ఉన్నాయి. ఐఫోన్ 17 కన్నా అదిరిపోయే ఫీచర్లు కలిగిన ఈ 6 ఆండ్రాయిడ్ కెమెరా ఫోన్లలో మీకు నచ్చిన ఫోన్ వెంటనే కొనేసుకోండి.
2/7Xiaomi 15
షావోమీ 15 (రూ. 53,999) : షావోమీ 15లో 32MP సెల్ఫీ కెమెరా, ట్రిపుల్ 50MP కెమెరా ఉన్నాయి. క్లియర్ ఫొటోలను అందిస్తాయి. ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ద్వారా పవర్ పొందుతుంది. 5240mAh బ్యాటరీతో వస్తుంది. సరికొత్త ఐఫోన్ 17 కన్నా బెటర్ ఫీచర్లతో వస్తుంది.
3/7Vivo X200 FE
వివో X200 FE (రూ. 54,998) : వివో X200 ఎఫ్ఈ ఫోన్ 6.31-అంగుళాల ఎల్టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లే, 5000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ అందిస్తుంది. ట్రిపుల్ కెమెరా సెటప్, 50MP+50MP+8MP, 50MP సెల్ఫీ కెమెరాతో ఈ సెగ్మెంట్‌లో కొత్త బెంచ్‌మార్క్‌ను అందుకుంది. ఆపిల్ ఐఫోన్ 17 కన్నా అద్భుతమైన ఫీచర్లు కలిగి ఉంది.
4/7Samsung Galaxy S25
శాంసంగ్ గెలాక్సీ S25 (రూ. 74,999) : శాంసంగ్ గెలాక్సీ S25 ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 50MP + 10MP + 12MP ఉన్నాయి. 3x ఆప్టికల్ జూమ్‌తో సూపర్ స్టెడి వీడియోను అందిస్తుంది. సెల్ఫీల విషయానికి వస్తే.. ఈ శాంసంగ్ ఫోన్ పవర్‌ఫుల్ పోర్ట్రెయిట్‌ క్లిక్ చేసేందుకు 12MP ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది. ఈ యూనిట్ 4000mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్‌తో వస్తుంది. ఐఫోన్ 17కి గట్టి పోటీదారుగా నిలిచింది.
5/7Oppo Find X8 Pro
ఒప్పో ఫైండ్ X8 ప్రో (రూ. 89,999) : ఒప్పో ఫైండ్ X8 ప్రో ట్రిపుల్ 50MP కెమెరా, 32MP సెల్ఫీ కెమెరాతో ప్రత్యేకంగా ఉంటుంది. ఇంకా, 6.36-అంగుళాల డిస్‌ప్లే కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. మొత్తంమీద, ఈ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ 17 కన్నా అద్భుతమైన ఫీచర్ల కలిగి ఉంది.
6/7OnePlus 13
వన్‌ప్లస్ 13 (రూ. 63,999) : వన్‌ప్లస్ 13 ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్, భారీ 6000mAh బ్యాటరీతో ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంది. ట్రిపుల్ 50MP కెమెరా, సింగిల్ 32MP సెల్ఫీ కెమెరాతో ఐఫోన్ 17కి గట్టి పోటీని ఇస్తుంది. 100W వైర్డ్ ఛార్జర్‌తో ఈ వన్‌ప్లస్ కేవలం 36 నిమిషాల్లో 100 శాతం ఛార్జ్ అవుతుంది.
7/7Google Pixel 10
గూగుల్ పిక్సెల్ 10 (రూ. 79,999) : 6.3-అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లే, గూగుల్ పిక్సెల్ 10 ట్రిపుల్ 48MP + 10.8MP + 13MP కెమెరా, 5x ఆప్టికల్ జూమ్‌తో 10.5MP సెల్ఫీ కెమెరాను అందిస్తుంది. అద్భుతమైన సెల్ఫీలను క్యాప్చర్ చేయొచ్చు. 4970mAh బ్యాటరీతో ఈ పిక్సెల్ ఫోన్ ఆండ్రాయిడ్ 16లో రన్ అవుతుంది. గూగుల్ టెన్సర్ G5 ద్వారా పవర్ పొందుతుంది.