RCB తరఫున బరిలోకి ట్రాన్స్ మహిళా క్రికెటర్..! సర్జరీ చేయించుకుని “ఆమె”గా మారిన “అతడు” ఎవరో కాదు..

కొన్ని రోజుల క్రితం అనయా తన లింగమార్పిడి శస్త్రచికిత్స నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత.. “ఇప్పుడే మైదానంలోకి వస్తున్నాను, ఆర్యన్‌గా కాదు అనయాగా” అని ప్రకటించింది.

RCB తరఫున బరిలోకి ట్రాన్స్ మహిళా క్రికెటర్..! సర్జరీ చేయించుకుని “ఆమె”గా మారిన “అతడు” ఎవరో కాదు..

Updated On : November 9, 2025 / 2:54 PM IST

Anaya Bangar: మాజీ క్రికెటర్‌ సంజయ్‌ బంగార్‌ కుమార్తె అనయా బంగార్‌ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మహిళల జట్టులో ఆడేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అనయా బంగార్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్టు చేసింది.

అందులో ఆమె రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు క్రికెట్‌ కిట్‌ బ్యాగ్‌తో మైదానంలోకి వెళ్లి ప్రాక్టీస్‌ చేస్తూ కనిపించింది. దీంతో ఆమె త్వరలోనే ఆ జట్టులో చేరబోతుందనే ఊహాగానాలు వస్తున్నాయి.

Also Read: 48 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని చంద్రబాబు ఆదేశాలు

కొన్ని రోజుల క్రితం అనయా తన లింగమార్పిడి శస్త్రచికిత్స నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత.. “ఇప్పుడే మైదానంలోకి వస్తున్నాను, ఆర్యన్‌గా కాదు అనయాగా..” అని ప్రకటించింది. చాలా కాలంగా ఆమె క్రికెట్‌లోకి తిరిగి రావాలని ప్రయత్నాలు చేస్తోంది.

రైస్‌ అండ్‌ ఫాల్‌ రియాలిటీ షోలో పాల్గొన్న సమయంలో ఆమె భావోద్వేగభరితంగా మాట్లాడింది. “నేను నా హక్కుల కోసం పోరాడతాను, ఒకరోజు భారత్‌ తరఫున ప్రపంచకప్‌ గెలుస్తాను” అని చెప్పింది.

ఇటీవల ముగిసిన ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు విజయం సాధించినప్పుడు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టు చేసింది. ఇటీవల చేసిన ఈ పోస్టు ద్వారా ఆమె ప్రొఫెషనల్‌ క్రికెట్‌లో ప్రవేశించాలనే తన కోరికను నెరవేర్చుకుంటున్నట్లు స్పష్టమైంది.

కానీ, అంతర్జాతీయ మహిళల క్రికెట్‌లో ట్రాన్స్‌జెండర్‌ ప్లేయర్లను ఐసీసీ నిషేధించడంతో ఆమెకు మహిళల ప్రీమియర్‌ లీగ్‌లోనూ ఆడే అనుమతి లభిస్తుందా? అన్నదే ప్రధాన ప్రశ్న.

ఈ ఏడాది ప్రారంభంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అనయా తన కుటుంబం, ముఖ్యంగా తండ్రి సంజయ్‌ బంగార్‌తో సంబంధాల గురించి మాట్లాడింది. “క్రికెట్‌లో భవిష్యత్తులో నాకు స్థానం లేదని ఆయన స్పష్టంగా చెప్పారు” అంది.

 

View this post on Instagram

 

A post shared by Anaya Bangar (@anayabangar)