48 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని చంద్రబాబు ఆదేశాలు

పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రోగ్రాం కమిటీ సమావేశంలో ఈ ఆదేశాలు జారీ చేశారు.

48 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని చంద్రబాబు ఆదేశాలు

Chandrababu Naidu

Updated On : November 8, 2025 / 5:02 PM IST

Chandrababu Naidu: పెన్షన్ల పంపిణీ, సీఎంఆర్ఎఫ్ చెక్‌ల అందజేత కార్యక్రమాల్లో పొల్గొనని 48 మంది ఎమ్మెల్యేలకు నోటిసులు ఇవ్వాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రొగ్రాం కమిటీకి ఆదేశించారు.

పార్టీ కేంద్ర కార్యాలయంలో బ్యాక్ ఆఫీసు, ప్రోగ్రాం కమిటీ సమావేశంలో ఈ ఆదేశాలు జారీ చేశారు. కొంతమంది ఎమ్మెల్యేల తీరుపై ఆయన సీరియస్‌ అయ్యారు. పేదల సేవలో భాగంగా పించన్ల పంపిణీలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొనాల్సిందేనని సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. (Chandrababu Naidu)

Also Read: ఆలయాల కూల్చివేత.. రగిలిపోతున్న రామగుండం.. 48 గంటలు టైమ్‌ ఇచ్చిన బండి సంజయ్‌

పాల్గొనని ఎమ్మెల్యేలపై నోటీసులు ఇచ్చి వివరణ తీసుకున్న తరువాత చర్యలు తీసుకునేందుకు కూడా వెనకాడబోమని హెచ్చరించారు. కార్యకర్తలకు బీమా, సీఎంఆర్ఎఫ్ చెక్ ల పంపిణీలో కూడా ఎమ్మెల్యేలు పాల్గొని తీరాల్సిందేనని ఆదేశాలు ఇచ్చారు.

ఎమ్మెల్యేలకు నచ్చిన కార్యకర్తలే కాకుండా సిన్సియర్ గా పనిచేసిన కార్యకర్తలను కూడా కలుపుకొని వెళ్లాలని అన్నారు. ప్రతి శుక్రవారం నియోజకవర్గ పార్టీ కార్యాలయాల్లో జరిగే ప్రజా విజ్ఙప్తుల దినంలో ఎమ్మెల్యేలు పాల్గొనాల్సిందేనని తెలిపారు.

ఎవరైన పాల్గొనకపోతే వెంటనే పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వివరణ తీసుకోవాలని, తన దృష్టికి తీసుకురావాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వ అభివృద్ది, సంక్షేమం గతంలో కంటే ఎంతో ఎక్కువగా చేస్తుందని అన్నారు.