ఆలయాల కూల్చివేత.. రగిలిపోతున్న రామగుండం.. 48 గంటలు టైమ్‌ ఇచ్చిన బండి సంజయ్‌

చౌరస్తాలో కూల్చివేసిన ఓ ఆలయాన్ని కాంగ్రెస్ శ్రేణులు తిరిగి నిర్మించారు.

ఆలయాల కూల్చివేత.. రగిలిపోతున్న రామగుండం.. 48 గంటలు టైమ్‌ ఇచ్చిన బండి సంజయ్‌

Updated On : November 8, 2025 / 5:20 PM IST

Ramagundam: పెద్దపల్లి జిల్లా రామగుండంలో మున్సిపల్ సిబ్బంది 50కి పైగా దారి మైసమ్మ ఆలయాలను కూల్చి వేశారు. దీంతో హిందూ వాహిని, బీజేపీ, బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఆందోళనకు దిగాయి.

మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళనలు తెలిపి, రాజీవ్ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఆలయాల కూల్చివేతలపై కేంద్ర హోం శాఖ సహాయ కార్యదర్శి బండి సంజయ్ సీరియస్ అయ్యారు. కూల్చేసిన ఆలయాలను 48 గంటల్లో నిర్మించకపోతే గోదావరి ఖనికి వచ్చి సంగతి తేలుస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు. (Ramagundam)

Viral Video: కళ్లల్లో కారం కొట్టి నగల షాపులో చోరీకి మహిళ యత్నం.. ఆమె తుక్కు రేగ్గొట్టిన యువకుడు..

చౌరస్తాలో కూల్చివేసిన ఓ ఆలయాన్ని కాంగ్రెస్ శ్రేణులు తిరిగి నిర్మించారు. తనకు తెలియకుండా మైసమ్మ ఆలయాలను ఎలా కూలుస్తారంటూ మున్సిపల్ అధికారులపై ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ సీరియస్ అయ్యారు.

సున్నితమైన అంశం కావడంతో ఏసీపీ రమేశ్, వన్‌టౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ ఇంద్రసేనారెడ్డి ఆందోళనకారులతో మాట్లాడి శాంతింపజేసే ప్రయత్నం చేస్తున్నారు.