Yamaha FZS-Fi: సరికొత్త హంగులతో వచ్చిన Yamaha FZS-Fi, రేటు ఎంతంటే??

FZ 2022 సిరీస్ లో భాగంగా FZ-FI V3.0, FZS-FI and FZS-FI Deluxe అనే మూడు మోడళ్లను భారత వినియోగదారులకు అందిబాటులోకి తెచ్చింది Yamaha.

Yamaha FZS-Fi: జపాన్ ద్విచక్ర వాహన దిగ్గజం యమహా మోటార్స్ ఇండియా భారత్ లో తన సేల్స్ ను మరింత పెంచుకునేందుకు ప్రయత్నిస్తుంది. అందులో భాగంగా 150cc విభాగంలో అత్యధిక సేల్స్ నమోదు చేస్తున్న FZ సిరీస్ కు సరికొత్త హంగులు జోడించింది. FZ 2022 సిరీస్ లో భాగంగా FZ-FI V3.0, FZS-FI and FZS-FI Deluxe అనే మూడు మోడళ్లను భారత వినియోగదారులకు అందిబాటులోకి తెచ్చింది. ఇందులో మొదట నుంచి ఉన్న FZ-FI మోడల్ ను సూక్ష్మ మార్పులతో కొనసాగిస్తుండగా..FZS-FI and FZS-FI Deluxe వేరియంట్ లను మరింత ప్రీమియంగా తీర్చిదిద్దింది. ఈ రెండు బైక్ లలో ప్రధానంగా ఉన్న మార్పులను గమనిస్తే..

Also Read: Dangerous Alexa: 10 ఏళ్ల చిన్నారిని కరెంటు ప్లగ్ లో వేలు పెట్టమన్న “అలెక్సా”

యమహా FZS DLX వేరియంట్‌లో.. వెనుక భాగంలో కొత్త LED లైట్, గోల్డ్, బ్లూ రంగుల అల్లాయ్ వీల్స్, డ్యూయల్-టోన్ సీట్లు మరియు LED ఇండికేటర్‌లు ఉన్నాయి. మెటాలిక్ బ్లాక్, మెటాలిక్ గ్రే మరియు మెజెస్టి రెడ్ కలర్స్ డీలక్స్ వేరియంట్ లో మాత్రమే లభిస్తాయి. స్టాండర్డ్, డీలక్స్ వేరియంట్ లలో కామన్ గా వస్తున్న ఫీచర్స్ ను గమనిస్తే.. బ్లూటూత్ కనెక్టివిటీ, సింగిల్ ఛానల్ ABS, వెనుక డిస్క్ బ్రేక్, మల్టీ-ఫంక్షన్ LCD ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, LED హెడ్‌లైట్, టైర్ హగ్గింగ్ రియర్ మడ్‌గార్డ్ మరియు ఇంజిన్ గార్డ్ వంటివి ఉన్నాయి. స్టాండర్డ్ వేరియంట్ లో మ్యాట్ రెడ్, మ్యాట్ బ్లూ కలర్స్ ఉన్నాయి.

Also Read: CM Jagan in Delhi: రాష్ట్రంలో రహదారుల నిర్మాణంపై కేంద్రమంత్రికి విజ్ఞప్తి

ఇవి మినహా ఇంజిన్ లో ఎటువంటి మార్పులు లేవు. 150CC సింగల్ సిలిండర్ ఇంజిన్ తో వస్తున్న ఈ బైక్ లు 12.4bhp@7250 పవర్ ను, 13.3Nm@5,500rpm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ FZS ధరలను గమనిస్తే..FZS Fi V3.0 వెర్షన్ ప్రారంభ ధర Rs 1,09,900 ఇతర రంగులను ఎంచుకుంటే FZS-FI ధర Rs 1,15,900(ex-showroom Delhi), FZS Deluxe ధర Rs 1,18,900 (ex-showroom Delhi)గాను ఉన్నాయి. కొత్తగా విడుదల చేసిన ఈ బైక్ లు దేశ వ్యాప్తంగా అన్ని యమహా డీలర్ల వద్ద అందుబాటులో ఉన్నాయి.

Also Read: Business News: అమెజాన్ – ఫ్యూచర్ సంస్థల పై ఢిల్లీ హైకోర్టులో విచారణ

ట్రెండింగ్ వార్తలు