Odisha Violence: మొన్న మణిపూర్, నిన్న హర్యానా, నేడు ఒడిశా.. ఏకంగా పోలీస్ స్టేషన్‭కే నిప్పు పెట్టి, పోలీసు సిబ్బందిని తీవ్రంగా కొట్టారు

అక్రమాలకు పాల్పడిన పోలీసు అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆగ్రహించిన స్థానికులు ఫిరింగియా బ్లాక్ చౌక్ వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. నిరసన తెలిపిన స్థానికులు ఐఐసిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు

Phiringia Police Station: దేశంలో అల్లర్లు ఒక ప్రాంతంలో కాస్త చల్లబడ్డాయి అనుకునేలోపు మరో ప్రాంతంలో ఊపందుకుంటున్నాయి. మణిపూర్, హర్యానా అల్లర్ల వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంతలోనే ఒడిశాలో ప్రారంభమైనట్లు కనిపిస్తోంది. ఒక గుంపు వచ్చి ఏకంగా పోలీస్ స్టేషన్‌కే నిప్పు పెట్టింది. అంతటితో ఆగకుండా స్టేషన్‌లోని సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ సహా ఇతర పోలీసు సిబ్బందిని తీవ్రంగా కొట్టారు. ఫుల్బానీ జిల్లాలోని ఫిరింగియా బ్లాక్‌లో జరిగిందీ దారుణం. కారణం.. గంజాయి స్మగ్లింగ్‌లో పోలీసుల ప్రమేయం ఉండడమే అని అంటున్నారు. అయితే ఈ అల్లర్లు మణిపూర్, హర్యానా తరహాలో రాజుకుంటాయా అనే ఆందోళన వ్యక్తం అవుతోంది.

Encounter : జమ్మూకాశ్మీర్ లో ఎన్ కౌంటర్.. ఉగ్రవాదిని హతమార్చిన భద్రతా దళాలు

స్థానిక ప్రజల ఆరోపణల ప్రకారం.. ఫిరింగియా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్-ఇన్-చార్జి (ఐఐసి) తపన్ కుమార్ నహకా సహా ఆయన సిబ్బంది నిషేధిత పదార్థాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారట. ఆగస్టు 3న గంజాయి లోడ్ చేసిన పోలీసు వ్యాన్‌ను ఫిరింగియా సర్పంచ్, మాజీ సర్పంచ్, స్థానిక ప్రజలు అడ్డుకున్నారు. ఈ సమయంలో వాహనం స్మగ్లర్‌కు డ్రగ్స్‌ విక్రయించేందుకు బుధఖంభా గ్రామానికి వెళుతున్నట్లు సమాచారం. కాగా, గ్రామస్థులు ఈ ఘటనను వీడియో తీసి కంధమాల్ ఎస్పీకి పంపించి ఐఐసీ సహా ఇతర పోలీస్ స్టేషన్ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ సందర్భంలోనే ఈ దాడి జరిగింది.

Employee chat viral : ఫుల్లుగా తాగి అర్ధరాత్రి బాస్‌కి మెసేజ్ చేసిన ఉద్యోగి.. ఆ తరువాత ఏం జరిగింది?

అయితే వారి డిమాండ్ ను పోలీసు అధికారులు పట్టించుకోలేదు. అక్రమాలకు పాల్పడిన పోలీసు అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆగ్రహించిన స్థానికులు ఫిరింగియా బ్లాక్ చౌక్ వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. నిరసన తెలిపిన స్థానికులు ఐఐసిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. స్థానిక సర్పంచ్ జలంధర కన్హార మాట్లాడుతూ.. ‘‘రక్షకభటులుగా ఉన్న పోలీసులు వేటగాళ్లుగా మారారు. గంజాయి స్మగ్లింగ్‌కు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న పోలీసు అధికారులను పట్టుకున్నాం. మా దగ్గర వీడియో ఉంది. మేము దానిని అవసరమైనప్పుడు ప్రదర్శిస్తాము. పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం’’ అని అన్నారు.

ట్రెండింగ్ వార్తలు