షాకింగ్.. ఫ్రెండ్ ప్రాణం తీసిన సరదా.. రెప్పపాటులో ఎంత ఘోరం జరిగిపోయిందో చూడండి..

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రమాదం జరిగిన తీరు అందరినీ షాక్ కి గురి చేస్తోంది.

Woman Falls From 3rd Floor (Photo Credit : Google)

Viral Video : ఒక్కోసారి సరదా కోసం చేసే పనులే ఊహించని ప్రమాదాలకు దారితీస్తాయి. ప్రాణాలను ప్రమాదంలో పడేస్తాయి. రెప్పపాటులో ఘోరం జరిగిపోతుంది. ఆ తర్వాత ఎంత చింతించినా ప్రయోజనం ఉండదు. అందుకే, దేనికైనా సమయం సందర్భం ఉండాలి. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోకతప్పదు. మహారాష్ట్రలో అలాంటి ఘోరం ఒకటి జరిగింది. ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య సరదా.. తీవ్ర విషాదం నింపింది. ఒక నిండు ప్రాణాన్ని తీసింది.

థానేలోని డోంబివలీలో ఓ మహిళ మూడో అంతస్తు నుంచి పడిపోవడంతో చనిపోయింది. ఆ మహిళ మూడో అంతస్తులో పిట్టగోడపై కూర్చుంది. తోటి స్నేహితుడు సరదాగా ఆమెను కౌగిలించుకునేందుకు ప్రయత్నించాడు. అంతే, ఆమె స్కిడ్ అయ్యి కింద పడిపోయింది. అంత ఎత్తు నుంచి పడటంతో తీవ్ర గాయాలతో చనిపోయింది. ఇదంతా రెప్పపాటులో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మృతురాలి పేరు నాగినా దేవి. డోంబివలీ ఈస్ట్ వికాస్ నకా ఏరియాలోని గ్లోబల్ స్టేట్ బిల్డింగ్ లో క్లీనర్ గా పని చేస్తోంది. ఆమె మూడో అంతస్తులో తన సహచరులతో సరదాగా మాట్లాడుతూ ఉంది. మెట్లకు సమీపంలో ఉన్న పిట్టగోడపై కూర్చుంది. ఇంతలో బంటీ అనే యువకుడు ఆమె దగ్గరికి వచ్చాడు. పిట్టగోడపై ఉన్న నాగినా దేవిని కౌగిలించుకునే ప్రయత్నం చేశాడు. అది కాస్తా ఊహించని ప్రమాదానికి దారితీసింది. బంటీ ఆమెపై చెయ్యి వేయడంతో.. ఆ మహిళా పట్టుతప్పి అలానే కిందకు పడిపోయింది. బంటీ కూడా బ్యాలెన్స్ కోల్పోయాడు. అతడు కూడా కిందపడబోయాడు. ఎలాగో గోడను గట్టిగా పట్టుకుని బతికిపోయాడు. కానీ, నాగినా దేవి మాత్రం మరణించింది.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రమాదం జరిగిన తీరు అందరినీ షాక్ కి గురి చేస్తోంది. ప్రమాదకర స్థలాల్లో పొరపాటున కూడా ఇలాంటి సరదా పనులు చేయకూడదు. లేదంటే, ఇదిగో ఇలాంటి ఘోరాలే జరుగుతాయి. నాగినా దేవికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె మృతితో వారు తల్లి లేని వారయ్యారు. నాగినా దేవి ఇంట్లో తీవ్ర విషాదం అలుముకుంది. ఈ సంఘటన ఆ బిల్డింగ్ లో నివాసం ఉంటున్న వారిని షాక్ కి గురి చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు.

సరదాగా ఉండటం తప్పు కాదు. కానీ, ఆ సరదా మన జీవితంలో విషాదం నింపేలా ఉండకుండా చూసుకోవాలి. సరదాకు.. సమయం సందర్భం ఉంటుంది. చుట్టు పక్కల పరిసరాలు ఏ విధంగా ఉన్నాయో చూసుకోవాలి. ప్రమాదకర స్థలాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదాల బారిన పడకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.

Also Read : ఇంత రిస్క్ అవసరమా? భార్యాభర్తల ప్రాణాల మీదకు తెచ్చిన ఫోటోషూట్..

ట్రెండింగ్ వార్తలు