వేరే అమ్మాయితో భర్త.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య.. ఆ తర్వాత..

Vizag Woman: స్పాలో మరో అమ్మాయిని పరిచయం చేసుకుని ఆమెతో గడుపుతున్నాడు.

విశాఖలోని సీతమ్మధారలో భర్తకు దేహశుద్ధి చేసింది ఓ భార్య. తన భర్త వేరే అమ్మాయితో సన్నిహిత సంబంధం కొనసాగిస్తుండడంతో ఆమె ఈ పని చేసింది. విశాఖకు చెందిన యువకుడు, యువతి ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. అయితే, ఆ తర్వాత ఆమె అంటే ఆ యువకుడు ఇష్టాన్ని చూపడం లేదు.

స్పాలో మరో అమ్మాయిని పరిచయం చేసుకుని ఆమెతో గడుపుతున్నాడు. ఆమె మీద మోజుతో విలువైన బహుమతులు కొనిస్తున్నాడు. ఆమెతోనే పార్కులు, బీచ్‌లు, హోటళ్లలో ఎంజాయ్ చేస్తున్నాడు. భార్యకు దూరంగా ఉంటున్నారు. తన భర్త తనకు దూరం కావడానికి కారణం అతడు మరో అమ్మాయితో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతుండడమేనని గ్రహించింది ఆ భార్య.

తాజాగా, తన భర్త, మరో అమ్మాయి గదిలో ఉండడంతో అక్కడికి బంధువులతో కలిసి వెళ్లి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. తన బండారాన్ని బయటపెట్టినందుకు వణికిపోయాడు ఆ భర్త. అందరి ముందూ భర్తను కొట్టేసి బుద్ధి చెప్పింది భార్య. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Also Read: నక్సలైట్ల ఘాతుకం.. ఇద్దరు భద్రతా సిబ్బంది మృతి.. మరో నలుగురికి గాయాలు

ట్రెండింగ్ వార్తలు