Cyberabad She Teams : సోషల్ మీడియాపై షీ టీమ్స్ నిఘా-50 మందికి ఫస్ట్ వార్నింగ్

సోషల్ మీడియా వెబ్ సైట్లలో మహిళలను  వేధించే ఆకతాయిల  ఆట కట్టిస్తున్నారు హైదరాబాద్ షీ టీమ్స్ సభ్యులు.

Cyberabad She Teams  :  సోషల్ మీడియా వెబ్ సైట్లలో మహిళలను  వేధించే ఆకతాయిల  ఆట కట్టిస్తున్నారు హైదరాబాద్ షీ టీమ్స్ సభ్యులు. డిజిటల్ ప్రపంచంలో మహిళల భద్రత కోసం సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర దేశంలోనే తొలి సారిగా ప్రారంభించిన ఆన్ లైన్ షీటీమ్స్ గస్తీ సత్ఫలితాలు ఇస్తోంది.

సైబరాబాదా   షీటీమ్స్ కు చెందిన 11 బృందాలకు చెందిన  అధికారులు నిరంతరం సోషల్ మీడియా ప్లాట్ ఫాంలైన ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రాం, ట్విట్టర్‌, పలు వాట్సాప్‌ గ్రూపులు, డేటింగ్‌ యాప్‌లపై నిఘాపెట్టారు.   నిరంతరం వాటిని మానిటర్‌ చేస్తున్నారు.

మహిళలు, అమ్మాయిలను టార్గెట్‌ చేసుకుని పోస్టింగ్‌లు, ఫొటోలు, వీడియోలను, మెసేజ్ లు పెట్టి వారిని ఇబ్బందులకు గురి చేస్తున్న వారి భరతం పడుతున్నారు.

Also Read : Corona Variant : జూన్,జులైలో కొత్త వేరియంట్-గాంధీ సూపరింటెండెంట్ రాజారావు

షీటీమ్స్ సభ్యులు చేపట్టిన ఆన్ లైన్ గస్తీలో భాగంగా ఇప్పటి వరకు 50మంది పోకిరీల భరతం పట్టారు, వారిని వారి కుటుంబ సభ్యులను పోలీసు స్టేషన్ కు పిలిచి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. రెండోసారి దొరికితే జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు.

ట్రెండింగ్ వార్తలు