Online Loan Apps Harassment : వద్దన్నా లోన్ ఇచ్చి వేధింపులు.. శృతి మించుతున్న ఆన్‪లైన్ లోన్ యాప్‌ల అరాచకాలు

ఆన్ లైన్ లోన్ యాప్ ల ఆగడాలు శృతి మించుతున్నాయి. రోజూ ఎక్కడో ఒక చోట లోన్ యాప్ ల అరాచకాలు బయటపడుతున్నాయి. పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నామని చెబుతున్నా.. కొత్త కేసులు పుట్టుకొస్తూనే ఉన్నాయి.

Online Loan Apps Harassment : ఆన్ లైన్ లోన్ యాప్ ల ఆగడాలు శృతి మించుతున్నాయి. రోజూ ఎక్కడో ఒక చోట లోన్ యాప్ ల అరాచకాలు బయటపడుతున్నాయి. పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నామని చెబుతున్నా.. కొత్త కేసులు పుట్టుకొస్తూనే ఉన్నాయి. తీసుకున్న రుణంపై వడ్డీ మీద వడ్డీ వేసి ప్రాణాలు పోయేలా చేస్తున్నారు. ఈ లోన్ యాప్ ల వేధింపులు భరించలేక పలువురు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. తాజాగా వికారాబాద్ జిల్లాలో మరో ఆన్ లైన్ లోన్ యాప్ అరాచకం వెలుగుచూసింది.

వికారాబాద్ జిల్లాకు చెందిన ఓ యువకుడిపై లోన్ యాప్ నిర్వాహకుల వేధింపుల ఉదంతం వెలుగుచూసింది. కోటేశ్వర శర్మ అనే యువకుడు ఆన్ లైన్ యాప్ ల వేధింపుల బారిన పడ్డాడు. నెల రోజుల క్రితం లోన్ అప్రూవల్ అయిందంటూ శర్మ ఫోన్ కు మేసేజ్ వచ్చింది. అప్లయ్ చేయకుండానే ఎలా లోన్ అప్రూవ్ అయిందో తెలియక కంగారుపడిన శర్మ ఆ మేసేజ్ ఓపెన్ చేశాడు. అసలు విషయం ఏంటో తెలుసుకోవాలనే తొందరలో తన వివరాలన్నీ ఎంటర్ చేశాడు.

అంతే.. అప్పటినుంచి శర్మ వాట్సాప్ కు మేసేజ్ లు, కాల్స్ రావడం మొదలయ్యాయి. కాగా తనకు లోన్ అవసరం లేదని అతడు నెత్తీ నోరు బాదుకుని చెప్పినా.. 2వేల 200 రూపాయలు అతడి బ్యాంకు ఖాతాలో జమ చేశారు. ఆ రోజు నుంచి లోన్ తిరిగి కట్టాలంటూ రాత్రి పగలు తేడా లేకుండా మేసేజ్ లు, కాల్స్ రూపంలో టార్చర్ మొదలైంది. దీంతో అతడు లోన్ తిరిగి కట్టేశాడు. ఇక వారి టార్చర్ నుంచి విముక్తి లభించినట్లే అని రిలాక్స్ అయ్యాడు.

అయితే, లోన్ డబ్బు మొత్తం కట్టేసినా ఇంకా డబ్బు కట్టాలంటూ మేసేజ్ లు రావడం మొదలయ్యాయి. దీంతో ఆ యువకుడు బిత్తరపోయాడు. ఆ మేసేజ్ లు కాల్స్ కు స్పందించడం మానేశాడు. దీంతో లోన్ యాప్ నిర్వాహకులు మరింత రెచ్చిపోయారు. వారి టార్చర్ మళ్లీ మొదలైంది. శర్మ బంధువులు, మిత్రులకు.. మీ వాడు లోన్ కట్టడం లేదంటూ మేసేజ్ లు పంపడం మొదలు పెట్టారు. తన పరువు పోతుందని భావించిన శర్మ మళ్లీ రూ.15వేలు కేటుగాళ్లకు సమర్పించుకున్నాడు. అయినా వేధింపులు ఆగలేదు.

దీంతో మరో దారి లేక ఆ యువకుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. లోన్ యాప్ నిర్వాహకులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వాట్సాప్ డిలీట్ చేయాలని యువకుడికి చెప్పారు. వారి నుంచి వచ్చే ఎలాంటి కాల్స్, మేసేజ్ లకు రెస్పాండ్ అవ్వొద్దని సూచించారు. కాగా, కేటుగాళ్లు మరింత రెచ్చిపోయారు. శర్మ మరో వాట్సాప్ నెంబర్ కు కాల్స్, మేసేజ్ లు చేస్తూ మళ్లీ వేధింపులు మొదలుపెట్టారు.

ట్రెండింగ్ వార్తలు