Uttar Pradesh: సమాజ్‭వాదీ పార్టీకి ఓటేయనందుకు నా భార్యను కాల్చి చంపారు.. యూపీ వ్యక్తి ఆరోపణ

మెయిన్‭పురి లోక్‭సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ గెలుపొందారు. ములాయం సింగ్ యాదవ్ మరణంతో మెయిన్‭పురి లోక్‭సభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఏర్పడింది. ముందుగా పార్టీ నుంచి ఎవరినైనా పోటీ చేయిద్దామని అనుకున్నప్పటికీ, చర్చల అనంతరం డింపుల్ యాదవ్ వైపుకు మొగ్గు చూపారు

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తి చాలా తీవ్రమైన ఆరోపణ చేశాడు. కొద్ది రోజుల క్రితం జరిగిన మెయిన్‭పురి ఉప ఎన్నికల్లో సమాజ్‭వాదీ పార్టీ అభ్యర్థి డింపుల్ యాదవ్‭కు ఓటేయలేదన్న కారణంతో తన భార్యను కాల్చి చంపారని ఆయన అన్నాడు. కొంత మంది దుండగులు తనను కారులో తీసుకెళ్తున్న సమయంలో తన భార్య జోక్యం చేసుకుందట. ఆ సందర్భంలో తన భార్యను వారు కాల్చి చంపారంటూ వెల్లడించాడు. కాసేపటికి కదులుతున్న వాహనం నుంచి తనను తోసేసి పారిపోయారని చెప్పాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.

India-China Border Clash At LAC : చైనా కవ్వింపులతో ఇండియా అలర్ట్.. నియంత్రణ రేఖ వెంబడి కొత్త డ్రోన్ యూనిట్ల మోహరింపు

మెయిన్‭పురి లోక్‭సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ గెలుపొందారు. ములాయం సింగ్ యాదవ్ మరణంతో మెయిన్‭పురి లోక్‭సభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఏర్పడింది. ముందుగా పార్టీ నుంచి ఎవరినైనా పోటీ చేయిద్దామని అనుకున్నప్పటికీ, చర్చల అనంతరం డింపుల్ యాదవ్ వైపుకు మొగ్గు చూపారు. ముందస్తు అంచానాలకు అనుగుణంగానే ఫలితాల్లో ఎస్పీ విజయం వైపు పరుగులు తీస్తోంది. ఎస్పీకి ఎంతో బలమైన ప్రాంతం, పైగా ములాయం మరణంతో ప్రజల్లో ఏర్పడిన సానుభూతి కారణంగా ఎస్పీకే గెలుపు అవకాశాలు ఉన్నట్లు అంచనాలు వచ్చాయి. అంతే కాకుండా, యూపీలో ప్రధాన పార్టీల్లో ఒకటైన బహుజన్ సమాజ్ పార్టీ ఈ ఎన్నికకు దూరంగా ఉండడం కూడా ఎస్పీకి కలిసి వచ్చింది. గతంలో కూడా ఇలాంటి ఫార్ములా వర్కౌట్ అయింది.

Ayodhya Mosque: అయోధ్య మసీదు నిర్మాణానికి తొలగిన అతిపెద్ద అడ్డంకి.. మసీదుతో పాటు ఆసుపత్రి నిర్మాణం తొందరలో ప్రారంభం

ట్రెండింగ్ వార్తలు