Pune Horror Case: రూ.40వేల అప్పు చెల్లించలేదని భర్త ఎదుటే భార్యపై అత్యాచారం చేసిన షేక్

తీవ్రంగా భయానికి లోనైన దంపతులు ఈ దారుణం గురించి బయటికి చెప్పేందుకు భయపడ్డారు. అయితే ఆమెతో శారీరక సంబంధం పెట్టుకునేందుకు షేర్ డిమాండ్ చేశాడు. అందుకు భర్త నిరాకరించడంతో వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశాడు.

Pune Horror Case: మహారాష్ట్రలోని పూణెలో సంచలనం రేపింది. ఒక వడ్డీ వ్యాపారి ఓ మహిళపై కత్తితో బెదిరించి అత్యాచారం చేశాడు. అది కూడా ఆమె భర్త చూస్తుండగానే. కారణం.. అతడి వద్ద నుంచి తీసుకున్న డబ్బును ఆమె భర్త తిరిగి ఇవ్వకపోవడమే. ఫిబ్రవరిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి దంపతులు ఫిర్యాదు చేసేందుకు కూడా భయపడ్డారు. కానీ ఎట్టకేలకు ధైర్యం తెచ్చుకుని కేసు పెట్టారు. దీంతో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Bijendra Prasad Yadav: బిహార్‭లో పోలీసుల కాల్పుల్లో ఇద్దరు యువకుల మృతి.. దానిని సమర్ధిస్తూ దారుణ వ్యాఖ్యలు చేసిన ఆ రాష్ట్ర మంత్రి

అయితే దారునం చేస్తున్న సమయంలో వడ్డీ వ్యాపారి వీడియో తీశాడని దంపతులు ఆరోపించారు. అనంతరం దాన్ని సోషల్ మీడియాలో కూడా షేర్ చేశారని చెప్పారు. నిందితులపై ఐపీసీ, ఐటీ చట్టం కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారమంతా హడప్సర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనిది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పూణె నగరంలో నివసిస్తున్న ఓ వ్యక్తి నిందితుడైన వడ్డీ వ్యాపారి ఇంతియాజ్ హెచ్ షేక్ (Imtiaz H Shaikh) నుంచి 40 వేల రూపాయలు వడ్డీలేని రుణం తీసుకున్నాడు. కానీ అతను తిరిగి ఇవ్వలేకపోయాడు. ఫిబ్రవరిలో ఒకరోజు షేక్ అతడి ఇంటికి వచ్చి, తన డబ్బు తిరిగి ఇవ్వమని అడిగాడు. తమ వద్ద డబ్బులు లేవని, మరికొంత సమయం కావాలని కోరారు. వారి అభ్యర్థనపై షేక్‌కు కోపం వచ్చి క్రూరత్వాన్ని చూపించాడు.

Twitter Gold Tick : బ్రాండ్ అకౌంట్లకు మస్క్ కొత్త ఫిట్టింగ్.. ట్విట్టర్‌లో యాడ్స్‌పై నెలకు రూ. 81 వేలు ఖర్చు పెడితేనే గోల్డ్ టిక్..!

కత్తితో బెదిరించి భర్త ఎదుటే భార్యపై షేక్ అత్యాచారం చేశాడు. ఈ ఘటనను వీడియో తీశారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే తీవ్రంగా భయానికి లోనైన దంపతులు ఈ దారుణం గురించి బయటికి చెప్పేందుకు భయపడ్డారు. అయితే ఆమెతో శారీరక సంబంధం పెట్టుకునేందుకు షేర్ డిమాండ్ చేశాడు. అందుకు భర్త నిరాకరించడంతో వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశాడు.

ED Director SK Mishra: ఈడీ డైరెక్టర్ ఎస్‭కే మిశ్రా పదవీ కాలాన్ని పొడగించిన సుప్రీంకోర్టు

మంగళవారం భార్యాభర్తలు ధైర్యం తెచ్చుకుని నిందితులపై హడస్పర పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు. నిందితులను అదుపులోకి తీసుకున్నామని, తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసు అధికారి తెలిపారు. భారతీయ శిక్షాస్మృతి, సమాచార సాంకేతిక చట్టంలోని సంబంధిత నిబంధనల ప్రకారం నిందితులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు