Twitter Gold Tick : బ్రాండ్ అకౌంట్లకు మస్క్ కొత్త ఫిట్టింగ్.. ట్విట్టర్‌లో యాడ్స్‌పై నెలకు రూ. 81 వేలు ఖర్చు పెడితేనే గోల్డ్ టిక్..!

Twitter Gold Tick : ట్విట్టర్ ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నాల్లో భాగంగా ఎలన్ మస్క్ బ్రాండ్‌లను యాడ్స్ కోసం నెలకు కనీసం రూ. 81వేలు ఖర్చు చేయాలంటూ కొత్త ఫిట్టింగ్ పెట్టాడు. లేదంటే.. బ్రాండ్ వెరిఫైడ్ బ్యాడ్జ్‌ గోల్డ్ టిక్ కోల్పోతారని హెచ్చరించాడు.

Twitter Gold Tick : ప్రపంచ బిలియనీర్ ఎలన్ మస్క్ (Elon Musk) ట్విట్టర్ టేకోవర్ చేసినప్పటి నుంచి ఆదాయ మార్గాలను అన్వేషిస్తూనే ఉన్నాడు. ట్విట్టర్‌కు ఆదాయాన్ని తెచ్చిపెట్టే ఏ మార్గాన్ని కూడా అసలు వదలుకోవడం లేదు. రెండు నెలల క్రితమే.. మస్క్ తన ప్రకటనదారులు చాలా మంది ట్విట్టర్‌లోకి తిరిగి వచ్చారని వెల్లడించారు. అన్ని ఆందోళనకరమైన విషయాలను పరిష్కరించినట్టు మస్క్ చెప్పాడు. ట్విట్టర్ కొత్త సీఈఓగా మార్కెట్‌లో అగ్ర అడ్వర్టైజ్‌మెంట్ ఎగ్జిక్యూటివ్‌ అయిన లిండా యాకారినోను నియమించుకున్న సంగతి తెలిసిందే.

మస్క్ హయాంలో ట్విట్టర్ ప్రకటనల వ్యాపారం భారీగా దెబ్బతింది. ఇప్పుడు యాడ్స్ బిజినెస్‌ను తిరిగి గాడిలో పెట్టేందుకు మస్క్ ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఇటీవలి నివేదికల ప్రకారం.. ట్విట్టర్ యాడ్స్ కోసం నెలకు కనీసం 1,000 డాలర్లు (రూ. 81వేలు) ఖర్చు చేయాల్సిందిగా బ్రాండ్ అకౌంట్లను మస్క్ ప్రలోభపెట్టాలని భావిస్తున్నాడు. లేదంటే.. బ్రాండ్ ట్విట్టర్ అకౌంట్లలో గోల్డ్ వెరిఫైడ్ బ్యాడ్జ్‌ను కోల్పోవాల్సి ఉంటుంది.

Read Also : Twitter X Logo : ట్విట్టర్ కొత్త లోగోను 2 సార్లు మార్చిన ఎలన్ మస్క్.. X లోగోలో అది నచ్చలేదట..!

180 రోజుల్లో అలా చేయకపోతే.. గోల్డ్ టిక్ తొలగిస్తాం :
బిజినెస్ ఇన్‌సైడర్ నివేదిక ప్రకారం.. ట్విట్టర్ ప్లాట్‌ఫారం ఆగస్ట్ 7 నుంచి ప్రకటనల వ్యాపారాభివృద్ధికి కనీసం 60 రోజుల్లో యాడ్స్ కోసం 1,000 డాలర్లు (దాదాపు రూ. 81వేలు) లేదా 180 రోజుల్లో 6వేల డాలర్లు (రూ. 800.9 లక్షలు) ఖర్చు చేయకపోతే గోల్డ్ చెక్‌మార్క్‌ను తొలగిస్తుంది. దీనికి సంబంధించి ఇమెయిల్ ద్వారా ట్విట్టర్ పలు బ్రాండ్‌లకు తెలియజేస్తోంది. ట్విట్టర్ కొత్త రీబ్రాండ్ (X) లోగోకు మార్చిన సందర్భంగా కొన్ని యాడ్స్‌పై 50 శాతం వరకు డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది. బ్రాండ్ అకౌంటుదారులు తమ గోల్డ్ వెరిఫైడ్ బ్యాడ్జ్‌ను ట్విట్టర్‌లో ఉంచడానికి ఇప్పటికే నెలవారీ 1,000 డాలర్లు చెల్లించాలి. ఈ ఏడాది జనవరిలోనే కొత్త ట్విట్టర్ వెరిఫికేషన్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది.

Brands might lose their gold tick on Twitter if they don’t spend at least Rs 81,000 per month on ads

ట్విట్టర్‌లో కొత్త మార్పులివే :
ఈ వారం ప్రారంభంలో మస్క్.. ఎవ్రీథింగ్ యాప్ అనుగుణంగా ట్విట్టర్ (X) లోగోతో రీబ్రాండ్ చేశాడు. ఐకానిక్ బ్లూ బర్డ్ లోగోను మార్చేసి.. ఆ స్థానంలో రీబ్రాండింగ్ ఫ్యూచరిస్టిక్ (X)తో మార్చేశాడు. ట్విట్టర్ CEO లిండా యాకారినో, ఉద్యోగులకు రాసిన లేఖలో (X) రీబ్రాండింగ్‌ను తేలికగా తీసుకోవద్దని సూచించారు. ఇప్పుడు యూజర్లు డొమైన్ X.com అని టైప్ చేస్తే.. ట్విట్టర్‌కి రీడైరెక్ట్ అవుతుంది.

ఈ ప్లాట్‌ఫారమ్‌లోని కంపెనీ అధికారిక హ్యాండిల్‌ను (X)గా పిలుస్తారు. బయో ఇన్ఫోలో X లోగో అనేది అక్టోబర్ 2022 నుంచి అందుబాటులో ఉంది. ట్విట్టర్ కొనుగోలు చేసిన కొద్దిసేపటికే, మస్క్ మైక్రో-బ్లాగింగ్ సైట్‌ ప్లాట్‌ఫారమ్‌ను కొనుగోలు చేసింది తన ఎవరీథింగ్ యాప్‌ (X)ని రూపొందించడంలో భాగమేనని వివరణ ఇచ్చాడు.

Read Also : Tech Tips in Telugu : పబ్లిక్ ఛార్జింగ్ పోర్టులను వాడుతున్నారా? స్కామర్లతో జాగ్రత్త.. మీ బ్యాంకు అకౌంట్లను ఖాళీ చేసేస్తారు.. సేఫ్‌గా ఉండాలంటే?

ట్రెండింగ్ వార్తలు