Truecaller Fraud insurance : ట్రూకాలర్ యూజర్ల కోసం ఫ్రాడ్ ఇన్సూరెన్స్ ఫీచర్.. ఇదేలా పనిచేస్తుందంటే?

Truecaller Fraud insurance : ట్రూకాలర్ ఫ్రాడ్ ఇన్సూరెన్స్ అనేది భారత్‌లో ప్రముఖ బీమా కంపెనీ (HDFC ERGO) భాగస్వామ్యంతో ట్రూకాలర్ అందించిన కొత్త ఫీచర్. మోసపూరిత కార్యకలాపాలకు బీమా రూ.10వేల వరకు కవరేజీని అందిస్తుంది.

Truecaller Fraud insurance : ట్రూకాలర్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఆన్‌లైన్ మోసాల బారిన పడకుండా ఉండేందుకు ట్రూకాలర్ సరికొత్త ఫీచర్ తీసుకొచ్చింది. అదే.. ట్రూకాలర్ ఫ్రాడ్ ఇన్సూరెన్స్.. ఈ సర్వీసు ప్రారంభంలో iOS, Android యూజర్ల కోసం భారత్‌లో అందుబాటులోకి వచ్చింది.

Read Also : SIM Swap New Rules : మొబైల్ నంబర్ పోర్టబిలిటీపై కొత్త రూల్.. ఇకపై సిమ్ మార్చుకుంటే ఎన్ని రోజులు పడుతుందంటే?

ట్రూకాలర్ ప్రీమియం సబ్‌స్క్రైబర్‌లు ఆన్‌లైన్ మోసానికి గురైనట్లయితే.. వారికి అదనపు రక్షణను అందించడం లక్ష్యంగా కంపెనీ పెట్టుకుంది. ఈ సేవలను అందించడానికి ట్రూకాలర్ హెచ్‌డీఎఫ్‌సీ ERGOతో భాగస్వామ్యం కలిగి ఉంది. ఆన్‌లైన్ స్కామ్‌ల పెరుగుదలను పరిగణనలోకి తీసుకుంటే.. ఈ కొత్త ఫీచర్ వాస్తవానికి ఆన్‌లైన్ స్కామ్‌ల బారిన పడిన వినియోగదారులకు సాయపడుతుంది. ప్రస్తుతానికి ఈ ఫీచర్ ప్రీమియం సబ్‌స్క్రైబర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంది.

ట్రూకాలర్ ఫ్రాడ్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి? :
ట్రూకాలర్ ఫ్రాడ్ ఇన్సూరెన్స్ అనేది భారత్‌లో ప్రముఖ బీమా కంపెనీ (HDFC ERGO) భాగస్వామ్యంతో ట్రూకాలర్ అందించిన కొత్త ఫీచర్. మోసపూరిత కార్యకలాపాలకు బీమా రూ.10వేల వరకు కవరేజీని అందిస్తుంది. ఈ బీమా సజావుగా ట్రూకాలర్ యాప్‌లో మెర్జ్ అయి ఉంటుంది. దీని వలన వినియోగదారులు వారి మొబైల్ డివైజ్‌ల నుంచే నేరుగా వారి కవరేజీని యాక్టివ్ చేసుకోవచ్చు.

ఈ ఫీచర్‌ని ఎవరు ఉపయోగించగలరు? :
ప్రీమియం సబ్‌స్క్రైబర్‌లు : ట్రూకాలర్ వార్షిక ప్రీమియం సబ్‌స్క్రైబర్‌లకు ఇన్సూరెన్స్ ఫీచర్ అందుబాటులో ఉంటుంది.
ఇప్పటికే ఉన్న కొన్ని ప్రీమియం ప్లాన్‌లలో అదనపు ఖర్చు లేకుండా బీమా పొందవచ్చు.
ఫ్యామిలీ ప్లాన్ యూజర్లు : ట్రూకాలర్ ఫ్యామిలీ ఉన్న సబ్‌స్క్రైబర్‌లు కుటుంబ సభ్యులకు బీమా కవరేజీని పొడిగించవచ్చు.
అప్‌గ్రేడ్ ఆప్షన్ : ప్రస్తుతం అర్హత లేని వినియోగదారులు ఈ బీమాకు యాక్సస్ పొందేందుకు వారి ప్లాన్‌ను అప్‌గ్రేడ్ చేయవచ్చు.

ఫ్రాడ్ ఇన్సూరెన్స్ ఫీచర్ ఎలా యాక్టివేట్ చేయాలి?
ట్రూకాలర్ యాప్‌ ఓపెన్ చేయండి : మీరు యాప్ లేటెస్ట్ వెర్షన్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి.
ఇన్సూరెన్స్ ఆప్షన్ నావిగేట్ చేయండి : యాప్ సెట్టింగ్‌లు లేదా ప్రీమియం ఫీచర్ల విభాగంలో ఫ్రాడ్ ఇన్సూరెన్స్ ఆప్షన్ ఎంచుకోండి.
ఆప్ట్-ఇన్ : మీ కవరేజీని యాక్టివ్ చేయడానికి ప్రాంప్ట్‌లను ఫాలో అవ్వండి.

ఈ బీమా ఫీచర్ ఎందుకు ముఖ్యమంటే? :
ఆన్‌లైన్ మోసాల్లో ఫోన్ కాల్‌లు, మెసేజ్‌ల ద్వారా ఎక్కువగా జరుగుతుంటాయి. ఆన్‌లైన్ స్కాములతో డబ్బును తిరిగి పొందడం సవాలుగా ఉంటుంది. ట్రూకాలర్ సీఈఓ అలాన్ మామెడి, సైబర్ మోసగాళ్ళ నుంచి రక్షణను అందించడం ద్వారా యూజర్లకు ప్రైవసీని, భద్రతను అందించడమే తమ లక్ష్యమన్నారు. ట్రూకాలర్ ప్రపంచవ్యాప్తంగా 400 మిలియన్లకు పైగా వినియోగదారులు, భారత్‌లో 285 మిలియన్లకు పైగా వినియోగదారులను కలిగి ఉంది. ఈ బీమా ఫీచర్ సాయంతో యూజర్ల ప్రైవసీని మెరుగుపరచడానికి ట్రూకాలర్ ప్రయత్నాలలో భాగంగా చెప్పవచ్చు.

కంపెనీ గతంలో డీప్ ఫేక్ వాయిస్ స్కామ్‌లను ఎదుర్కోవడానికి ఏఐ కాల్ స్కానర్‌ను ప్రవేశపెట్టింది. ట్రూకాలర్ ప్రీమియం ఐఓఎస్‌ యూజర్లలో భారత్‌లో ఏడాదికి 50శాతం సబ్‌స్క్రిప్షన్‌ల పెరుగుదలతో గణనీయమైన వృద్ధిని సాధించింది. భవిష్యత్తులో మరిన్ని మార్కెట్లకు ఇన్సూరెన్స్ ఫీచర్‌ను విస్తరించాలని కంపెనీ యోచిస్తోంది. ట్రూకాలర్ 2024 మొదటి త్రైమాసికంలో (SEK) 58 మిలియన్ల గ్లోబల్ సబ్‌స్క్రిప్షన్ రాబడిని నివేదించింది. 25శాతం వార్షిక వృద్ధిని సూచిస్తుంది. ప్రతి వినియోగదారుకు (ARPU) ఆల్-టైమ్ అధిక సగటు ఆదాయాన్ని సాధించింది.

Read Also : Vivo Pad 3 Launch : కొత్త ట్యాబ్ కొంటున్నారా? భారీ డిస్‌ప్లేతో వివో ఎల్‌సీడీ స్ర్కీన్ ట్యాబ్ 3 ఇదిగో.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

ట్రెండింగ్ వార్తలు