Twitter X Logo : ట్విట్టర్ కొత్త లోగోను 2 సార్లు మార్చిన ఎలన్ మస్క్.. X లోగోలో అది నచ్చలేదట..!

Twitter X Logo : ఎలన్ మస్క్ ట్విట్టర్‌ని కొత్త లోగో (X)తో రీబ్రాండ్ చేశాడు. అయితే, కొత్త లోగో గురించి ఇంకా గందరగోళంగా ఉన్నట్లు కనిపిస్తోంది. బిలియనీర్ గత 24 గంటల్లో కొత్త ట్విట్టర్ లోగోను రెండు సార్లు మార్చాడు.

Twitter X Logo : ప్రముఖ మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్ (Twitter) అధినేత ఎలన్ మస్క్ (Elon Musk) ప్రపంచవ్యాప్తంగా బ్లూ బర్డ్ లోగో (Blue Bird Logo)కు వీడ్కోలు పల్కి కొత్త లోగోను ఆవిష్కరించాడు. ప్రధాన రీబ్రాండింగ్‌లో భాగంగా మస్క్ బ్లూ బర్డ్ లోగోను (X)లోగోకి మార్చాడు. మస్క్ తన మాటలకు కట్టుబడి సోమవారం నాటికి ట్విట్టర్ ఐకానిక్ బ్లూ బర్డ్ లోగోను మార్చేశాడు.

ఈ క్రమంలోనే ట్విట్టర్ అధికారిక హ్యాండిల్ పేరు కూడా (X)గా రీబ్రాండ్ మారిపోయింది. మీరు వెబ్ బ్రౌజర్‌లో సైట్‌ను ఓపెన్ చేసినప్పుడు ట్విట్టర్ బ్లూ బర్డ్ కూడా కొత్త లోగో (X)తో కనిపించింది. అయినప్పటికీ, కొత్త ట్విట్టర్ లోగో గురించి మస్క్ ఇప్పటికీ గందరగోళంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇటీవలే ట్విట్టర్ X లోగోను మార్చగానే కొత్త లోగోలో మందపాటి గీతలు అతనికి నచ్చకపోవడంతో లోగోలో చిన్న మార్పు చేశాడు.

Read Also : Twitter Direct Messages : మస్క్ మళ్లీ ఫిట్టింగ్ పెట్టాడుగా.. ట్విట్టర్ ఏది ఫ్రీగా ఇవ్వదు.. బ్లూ టిక్ లేకుండా DM మెసేజ్ పంపితే ఛార్జీలు తప్పవు!

రెండుసార్లు లోగోను మార్చేసిన మస్క్ :
ట్విట్టర్ కొత్త లోగోను చూపించే వీడియోను మస్క్ షేర్ చేశారు. ఈ వీడియోలో చూపిన లోగో అసలు X లోగో కన్నా కొంచెం మందంగా ఉన్నట్టుగా కనిపిస్తోంది. కొత్త లోగో ట్విటర్‌లో కనిపించినప్పటికీ.. అది ఎక్కువ సమయం ఉంచలేదు. డోజ్ డిజైనర్‌కు ప్రతిస్పందనగా.. మస్క్ (X) లోగోను మునుపటి దానికి మార్చుతున్నానని ట్విట్టర్ లోగో ‘కాలక్రమేణా అభివృద్ధి చెందుతూనే ఉంటుందని రాసుకొచ్చారు.

Elon Musk modifies X logo but reverses his decision, says new Twitter logo will evolve over time

‘లోగోలో మందమైన బార్‌లను ఇష్టపడను. అందుకే తిరిగి మార్చాను. లోగో కాలక్రమేణా అభివృద్ధి చెందుతుంది’ అని రాసుకొచ్చాడు. ట్విట్టర్ రీబ్రాండింగ్‌ లోగోకు సంబంధించి వినియోగదారుల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కొందరు యూజర్లు (X) అందించే అన్ని ఫీచర్ల గురించి ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. మరికొందరు, బ్లూ బర్డ్ లోగోకు ప్రకటించడం ఇష్టం లేదని చెబుతున్నారు.

X.com నుంచి Twitterకు రీడైరెక్షన్ :
యూజర్లు డొమైన్ X.com విజిట్ చేయగానే అది ట్విట్టర్‌కు మళ్లీ రీడైరెక్ట్ అవుతుంది. వాస్తవానికి మీ వెబ్ బ్రౌజర్‌లో X.com అని టైప్ చేస్తే.. Twitter వెబ్‌సైట్ లోడ్ అవుతుంది. దాంతో Twitter.com డొమైన్ భవిష్యత్తులో ఉనికిలో లేకుండా పోతుందా? లేదా X.com కు మారిపోతుందా? అని ఆశ్చర్యం కలిగిస్తుంది. ట్విట్టర్ అధికారిక హ్యాండిల్‌లో కూడా (X) లోగో బ్లూ బర్డ్ స్థానంలో ఉంది.

హ్యాండిల్ డిస్‌ప్లే పేరు X అని కూడా ఉంది. బయో ఇన్ఫోలో కూడా అదనంగా హ్యాండిల్ పేరు ట్విట్టర్‌కు బదులుగా X అని మస్క్ మార్చేశాడు. యూజర్ల వివిధ అవసరాలను తీర్చేందుకు గో-టు యాప్‌గా ‘ఎవ్రీథింగ్’ యాప్ (X)ని క్రియేట్ చేయాలని మస్క్ నిర్ణయించుకున్నాడు.

Read Also : Twitter X Logo : మస్క్ వెనక్కి తగ్గేదే లే.. శాన్‌ఫ్రాన్సిస్కోలో ట్విట్టర్ X లోగో మార్చకుండా అడ్డుకున్న పోలీసులు.. అసలేం జరిగిందంటే?

ట్రెండింగ్ వార్తలు